భారతదేశం - నైసర్గిక స్వరూపం

ప్రపంచ పటంలో భారత దేశ ప్రాముఖ్యతను గుర్తించాలంటే భారత దేశా నైసర్గిక స్వరూపాన్ని పరిశీలించాల
(భారత దేశము - నైసర్గిక స్వరూపము నుండి దారిమార్పు చెందింది)

ప్రపంచ పటంలో భారత దేశ ఉనికిని, దాని ప్రాముఖ్యతను గుర్తించాలంటే భారత దేశా నైసర్గిక స్వరూపాన్ని పరిశీలించాలి. ఆ అధ్యయనం విశదముగా పరిశీలించాలంటే?

సరిహద్దులు

మార్చు

భారత దేశానికి తూర్పున బంగాళా ఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము, ఉత్తరాన హిమాలయా పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం సహజ సరిహద్దులుగా ఉన్నాయి.

ఉనికి

మార్చు

ప్రపంచ పటంలో భారతదేశం ఆసియా ఖండం లో దక్షిణ భాగంలో ఉంది. ఇది పూర్తిగా ఉత్తరార్థ భూగోళములో ఉంది.

వైశాల్యం

మార్చు

భారత దేశ వైశాల్యము 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఇది ఉత్తర దక్షిణంగా 3214 కిలో మీటర్లుగాను, తూర్పు పడమరలుగా 2933 కిలోమీటర్లు పొడువుగాను ఉంది.

భౌగోళీక మండలాలు

మార్చు

భారత దేశన్ని ఐదు భౌగోళిక మండలాలుగా విభజించ వచ్చు. అవి. 1. హిమాలయా పర్వతముల ప్రాంతము, 2. గంగా సింధూ మైదాన ప్రాంతము, 3. ఎడారి ప్రాంతము, 4. దక్కను పీఠభూమి, 5. సముద్ర తీర మైదానములు.

హిమాలయ పర్వత ప్రాంతం

మార్చు

హిమాలయ పర్వతములు ప్రపంచములోనే మిక్కిలి ఎత్తైన పర్వతాలు. ఇవి సుమారు 5,00,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్నాయి. భారత్లో ఎత్తైన పర్వత శిఖరం కాంచన గంగ. దీని ఎత్తు 8580 మీటర్లు.

గంగా సింధూమైదానం

మార్చు

ఇది 2400 కిలో మీటర్ల పొడవు, సుమారు 300 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది. దీనిలో గంగ, సింధు, బ్రహ్మపుత్ర వాటి ఉపనదులు ప్రవహిస్తున్నవి. ఇవి సార వంతమైన భూములు.

ఎడారి ప్రాంతం

మార్చు

థార్ ఎడారి భారత్ లో పెద్ద ఎడారి ప్రాంతం. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది.

దక్కను పీఠ భూమి

మార్చు

భారత దేశపు దక్షిణ భూభాగంలో త్రిభుజాకారములో ఉంది. ఈ పీఠ భూమి యొక్క తూర్పు ప్రాంతమున, తూర్పు కనుమలు, పశ్చిమ ప్రాంతమున పశ్చిమ కనుమలు వ్యాపించి ఉన్నాయి. ఈ పీఠ భూమి పడమర నుండి తూర్పుకు వాలి వున్నందున ఇందులో ప్రవహించే నదులన్ని తూర్పు ముఖంగా ప్రవహించి బంగాళా ఖాతంలో కలుస్తున్నవి.

సముద్ర తీర మైదానాలు

మార్చు

తూర్పు కనుమలకు - బంగాళా ఖాతానికి మద్యన తూర్పు తీర మైదానము, పశ్చిమ కనుమలకు అరేబియా సముద్రానికి మద్యన పశ్చిమ తీర మైదానము లున్నవి. పశ్చిమ తీర మైదానము వెడల్పు తక్కువగా పొడవుగా నున్నది. ఇది గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు వ్యాపించి యున్నది. గోవాకు ఉత్తర భాగంలో వున్న మైదానాన్ని కొంకణ తీరమని, గోవాకు దక్షిణ భాగంలో కన్యాకుమారి వరకున్న మైదానాన్ని మలబారు తీర మని అంటారు. రెండవ తీర మైదానము తూర్పు దిక్కున ఉంది. ఇది విశాలమైనది. ఇందులో ప్రవహించే గోదావరి, మహానది, కృష్ణా కావేరి వంటి పెద్దనదులు డెల్టాను ఏర్పరచాయి. ఇది సార వంతమైన భూమి. ఇది పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి ఆగ్రం వరకు వ్యాపించి ఉంది. దీనిని ఉత్తర భాగాన కళింగ తీరమని, దక్షిణ భాగంలో కోర మాండల్ తీరమని వ్వవహరిస్తారు. ఈ తూర్పు తీర మైదానములో ఒడిషా రాష్ట్రంలో చిలక సరస్సు, కృష్ణా గోదావరి నదుల మధ్య కొల్లేరు సరస్సు, ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాల మధ్య పులికాట్ సరస్సు ఉన్నాయి.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు