భావనా పాణి
భావనా పాణి (జననం 1985 జూలై 6) భారతీయ నటి, మోడల్, నర్తకి. ఆమె ఒడిస్సీ, కథక్ వంటి శాస్త్రీయ నృత్య రూపాలతో పాటు బ్యాలెట్, సమకాలీన ఆధునిక నృత్యంలో శిక్షణ పొందింది. ఆమె 2001లో తేరే లియే చిత్రంతో చిత్రసీమలో అడుగుపెట్టింది.[1]
భావనా పాణి | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1985 జూలై 6
వృత్తి | నటి డాన్సర్ |
క్రియాశీలక సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
కెరీర్
మార్చుభావనా పాణి 1985 జూలై 6న జన్మించింది. ఆమె ముంబైలో పెరిగింది.[1] ఆమె చిత్రనిర్మాత ఉదయ్ శంకర్ పాణి కుమార్తె.[2] ఆమెకు ఒక చెల్లెలు దేవ్నా పాణి ఉంది, ఆమె కూడా ఫ్యాషన్ డిజైనర్, నటి.[3] ఆమె ముంబైలోని మిథిబాయి కళాశాల నుండి సైకాలజీ, ఫిలాసఫీలలో బిఎ చేసింది.[2]
ఆమె కేలూచరణ్ మహాపాత్ర, బిర్జు మహారాజులచే ఒడిస్సీ, కథక్ లలో శిక్షణ పొందింది.[1] ఆమె టెర్రెన్స్ లూయిస్ కాంటెంపరరీ డాన్స్ కంపెనీలో సమకాలీన నృత్యం నేర్చుకుంది. జాజ్, బ్యాలెట్లలో కూడా శిక్షణ పొందింది.[2]
ఆమె తన మొదటి బాలీవుడ్ చిత్రం తేరే లియేతో 16 సంవత్సరాల వయస్సులో తన వృత్తిని ప్రారంభించింది.[1][4] ఆ తరువాత, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం యువరాజా (2001), ఆర్. శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం నినుచూడక నేనుండలేను (2002), ప్రియదర్శన్ మలయాళ హాస్య చిత్రం వేట్టం వంటి అనేక చిత్రాలలో ఆమె నటించింది. వేట్టం చిత్రంలో వీణ పాత్ర పోషించినందుకు ఆమెకు మలయాళీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం టీవీ విడుదల తర్వాత కల్ట్ హోదాను సాధించింది.[1] తనకు రొమాంటిక్ కామెడీ సినిమాలు చేయడం ఎక్కువ ఇష్టమని కూడా ఆమె వ్యక్తం చేసింది.
సహారా ఇండియా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ భారతి లో ఆమె పదేళ్లుగా ప్రధాన నర్తకిగా ప్రదర్శన ఇస్తున్నది.[5][6] సో మెనీ సాక్స్ చిత్రానికి గాను ఆమె ఉత్తమ సహాయ నటిగా మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డును గెలుచుకుంది.[7]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనిక |
---|---|---|---|---|
2001 | తెరే లియే | పియా ఆనంద్/పియా బోస్ | హిందీ | తొలి సినిమా |
2001 | యువరాజ | జానకి | కన్నడ | |
2001 | లవ్ మ్యారేజ్ | శోభా | తమిళ భాష | |
2002 | నినాగోస్కారా | అపూర్వ | కన్నడ | |
2002 | దిల్ విల్ ప్యార్ వ్యార్ | రాచ్నా | హిందీ | |
2002 | నిను చూడక నేనుండలేను | కావేరి | తెలుగు | |
2004 | వెట్టమ్ | వీణా | మలయాళం | |
2005 | గిల్లీ గిల్లీ అట్టా | ఉపాధ్యాయురాలు దీదీ | హిందీ | |
2009 | ఫాస్ట్ ఫార్వర్డ్ | జీల్ | హిందీ | |
2012 | తేజ్ | రాధికా | హిందీ | |
2013 | ది గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ | హిందీ | ||
2014 | ఆమయం ముయాలుమ్ | నర్తకి | మలయాళం | "కానకోంబిలే" పాటలో ప్రత్యేక ప్రదర్శన |
2015 | హవాయిజాడా | రాణి | హిందీ | |
2017 | ది బిగ్ ఫ్యాట్ సిటీ (నెట్ఫ్లిక్స్) | అను | హిందీ | |
2018 | ఫ్రాడ్ సైయాన్ | చందా | హిందీ | |
2019 | స్పేస్ మమ్స్ | డాక్టర్ శాంతి శ్రీవాస్తవ | హిందీ |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Chakra, Shyamhari (21 August 2009). "Dance helps be a better actor". The New Indian Express. Archived from the original on 5 May 2016. Retrieved 4 July 2013.
- ↑ 2.0 2.1 2.2 "Sensation at seventeen". The Indian Express. 8 January 2001. Archived from the original on 5 July 2013. Retrieved 4 July 2013.
- ↑ "She jumped off the blast train on dad's direction - Mumbai - DNA". Daily News and Analysis. Retrieved 4 July 2013.
- ↑ "I taught dance to Esha Deol- Bhavana Pani | TopNews". Topnews.in. Retrieved 4 July 2013.
- ↑ chitta (4 June 2009). "» Blog Archive » Bhavna Pani is Bharati in "Bharati: the wonder that is India"". Orissalinks.com. Retrieved 4 July 2013.
- ↑ "Bhavna Pani talks about her lead role in Bharati-the Wonder that is India". Suhaag. 21 October 2011. Retrieved 4 July 2013.
- ↑ "The 8th Annual Mahindra Excellence in Theatre Awards Announced". Mahindra.com. 9 March 2013. Archived from the original on 7 September 2013. Retrieved 4 July 2013.