భూమి ధ్రువప్రాంతాలు

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

భూమి ధ్రువ ప్రాంతాలు దాని భౌగోళిక ధ్రువాల (ఉత్తర దక్షిణ ధ్రువాలు) చుట్టూ ధ్రువ చక్రాల లోపల ఉండే ప్రాంతాలు. వీటిని శీతల మండలాలు అని కూడా పిలుస్తారు. ఈ అధిక అక్షాంశాల వద్ద నీటిలో తేలే సముద్రపు ఐసే ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన అంటార్కిటికా ఖండంలో అంటార్కిటిక్ మంచు పలక ఉన్నాయి.

ధ్రువప్రాంతాలను సూచించే ప్రదేశాలు
ఉత్తరార్ధగోళం ఎల్లప్పుడూ ఘనీభవించి ఉండే ప్రాంతం (పర్పల్ రంగులో).

నిర్వచనాలుసవరించు

ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతం (ప్రస్తుతం 2010 లో 66 ° 33'44 "N వద్ద), లేదా 60 ° ఉత్తర అక్షాంశానికి ఉత్తరాన ఉన్న ప్రాంతం లేదా ఉత్తర ధ్రువం దక్షిణంగా వృక్షశ్రేణి వరకూ ఉన్న ప్రాంతం అనీ ఆర్కిటిక్కు వివిధ నిర్వచనాలు ఉన్నాయి.[1] అంటార్కిటిక్ అంటే సాధారణంగా 60 ° దక్షిణ అక్షాంశానికి దక్షిణాన ఉన్న ప్రాంతం అని నిర్వచిస్తారు. అంటార్కిటికా ఖండం అని కూడా నిర్వచిస్తారు. 1959 అంటార్కిటిక్ ఒప్పందంలో మొదటి నిర్వచనాన్ని ఉపయోగించారు.

శీతోష్ణస్థితిసవరించు

ధ్రువ ప్రాంతాల వద్ద సౌర వికిరణం, భూమి పైని ఇతర ప్రాంతాల వద్ద కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో సూర్యుడి శక్తి వాలుగా ఉన్న కోణంలో పడి, పెద్ద విస్తీర్ణంలో వ్యాపిస్తుంది. పైగా ఇది భూ వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఇందులో సౌర వికిరణం కరిగి, చెల్లాచెదురై, ప్రతిబింబింపబడి పోతుంది.

భూమి భ్రమణాక్షపు వాలు, ధ్రువ ప్రాంతాల వాతావరణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అయితే, ధ్రువ ప్రాంతాలు భూమధ్యరేఖకు చాలా దూరంలో ఉన్నందున, అవి బలహీనమైన సౌర వికిరణాన్ని పొందుతాయి. ముందే బలహీనంగా ఉండే సూర్యకాంతిలో ఎక్కువ భాగాన్ని పెద్ద మొత్తంలో ఉన్న ఐసు, మంచులు ప్రతిబింబిస్తాయి. ఇది చలికి దోహదం చేస్తుంది. ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండి, తగినంత అవపాతం ఉన్నచోట భారీ గ్లేసియేషను జరిగి శాశ్వత మంచు ఏర్పడుతుంది. పగటి వేళల్లో తీవ్రమైన వైవిధ్యాలు ఉంటాయి. వేసవిలో ఇరవై నాలుగు గంటల పగలు, శీతాకాలం మధ్యలో పూర్తి చీకటి ఉంటాయి.

ఆర్కిటిక్ వృత్త ప్రాంతంసవరించు

 
ఉత్తర[permanent dead link] ధ్రువ ప్రాంతం ధ్రువ ఎలుగుబంట్లు

భూమి ఉత్తర ధ్రువ ప్రాంతంలో అనేక స్థావరాలు ఉన్నాయి. ఆర్కిటిక్‌ ప్రాంతం తమ దేశంలో భాగంగా ఉన్న దేశాలు: యునైటెడ్ స్టేట్స్ (అలాస్కా), కెనడా (యుకాన్, వాయవ్య భూభాగాలు, నూనావట్), డెన్మార్క్ (గ్రీన్లాండ్), నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, ఐస్లాండ్, రష్యా . ఆర్కిటిక్ ధ్రువీయ ప్రాంతంలో ఉన్న జనాభా వారివారి జాతీయ సరిహద్దుల్లోని ఇతర జనాభాతో కంటే, ధ్రువీయ ప్రాంతంలో ఉన్నవారి తోటే ఎక్కువ సామ్యం ఉంటుంది. మానవ స్థావరాలు, సంస్కృతుల విషయంలో ఉత్తర ధ్రువ ప్రాంతం వైవిధ్యమైనది.

అంటార్కిటికా, దక్షిణ సముద్రంసవరించు

 
దక్షిణ[permanent dead link] ధ్రువ ప్రాంతం పెంగ్విన్

దక్షిణ ధ్రువ ప్రాంతంలో శాశ్వత మానవ నివాసం లేదు. [2] మెక్‌ముర్డో స్టేషన్ అంటార్కిటికా లోని అతిపెద్ద పరిశోధనా కేంద్రం, దీనిని యునైటెడ్ స్టేట్స్ నిర్వహిస్తుంది. పామర్ స్టేషన్, అముండ్సెన్-స్కాట్ సౌత్ పోల్ స్టేషన్ (యునైటెడ్ స్టేట్స్), ఎస్పెరంజా బేస్, మరాంబియో బేస్ (అర్జెంటీనా), స్కాట్ బేస్ (న్యూజిలాండ్), వోస్టాక్ స్టేషన్ (రష్యా), ఇతర ముఖ్యమైన స్టేషన్లు. భారతదేశం దక్షిణ గంగోత్రి,[3] మైత్రి, భారతి [4] అనే మూడు స్టేషన్లను నిర్వహిస్తోంది.

స్థానికంగా మానవ సంస్కృతులేమీ లేనప్పటికీ, సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థ ఉంది -ముఖ్యంగా అంటార్కిటికా తీర ప్రాంతాల వెంట. తీరస్థ అప్‌వెల్లింగు సమృద్ధిగా పోషకాలను అందిస్తుంది. ఇది క్రిల్ సముద్ర జీవులకు ఆహారాన్నిస్తుంది. ఈ క్రిల్, నీలి తిమింగలాలకు, పెంగ్విన్స్‌ వంటి జీవులకూ ఆహారమౌతాయి.

మూలాలుసవరించు

  1. "Arctic region". Uni of Lapland (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-06. Retrieved 2020-06-06.
  2. Matthew Teller (20 June 2014). Why do so many nations want a piece of Antarctica? (in English). BBC. URL accessed on 22 March 2019.
  3. "Annual Report 1984-1985" (PDF). Ministry of Earth Sciences (PDF). Department of Ocean Development. 1985 [1985]. Archived from the original (PDF) on 2013-04-25. Retrieved Apr 14, 2014. CS1 maint: discouraged parameter (link)
  4. "Bharti to be 3rd Indian station in Antarctica" Archived 2012-10-25 at the Wayback Machine, The Times of India, 6 August 2009