మంగళ్ ధిల్లాన్
మంగళ్ ధిల్లాన్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత.[1]
మంగళ్ ధిల్లాన్ | |
---|---|
జననం | వాండర్ జటానా, ఫరీద్‌కోట్ జిల్లా, పంజాబ్ |
మరణం | 2023, జూన్ 11 |
విద్య | ఇండియన్ థియేటర్ (ఎంఏ) , పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్ |
వృత్తి | నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత |
ఎత్తు | 178 cమీ. (5 అ. 10 అం.) |
జననం
మార్చుమంగళ్ ధిల్లాన్ పంజాబ్ రాష్ట్రం, ఫరీద్‌కోట్ జిల్లాలోని వాండర్ జటానా గ్రామంలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. 4వ తరగతి వరకు పంజ్ గ్రేయిన్ కలాన్ ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. తర్వాత ఉత్తరప్రదేశ్‌కు వెళ్ళాడు. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని నిఘసన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత పంజాబ్‌కు తిరిగి వచ్చి, అక్కడ కోట్ కాపురా నుండి తన హయ్యర్ సెకండరీ పూర్తి చేశాడు. ముక్త్సార్ ప్రభుత్వ కళాశాలలో పట్టభద్రుడయ్యాడు.[2]
నటనారంగం
మార్చుఢిల్లీ నాటకరంగంలో పనిచేశాడు. 1979లో చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ థియేటర్ విభాగంలో చేరాడు. 1980లో నటనలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును పూర్తి చేశాడు.
1986లో కథా సాగర్ అనే టీవీ కార్యక్రమంతో నటనారంగంలోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది బునియాద్ అనే మరో టీవీ కార్యక్రమంలో నటించాడు. జునూన్, కిస్మత్, గ్రేట్ మరాఠా, గుటన్, సాహిల్, మౌలానా ఆజాద్ వంటి టీవీ కార్యక్రమాలల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఖూన్ భారీ మాంగ్, జక్మి ఔరత్, దయావన్, కహన్ హై కానూన్, నాకా బందీ, అంబ, అకల్య, జనషీన్, ట్రైన్ టూ పాకిస్తాన్, దలాల్ వంటి సినిమాల్లోనూ నటించాడు. చివరిసారిగా 2017లో తూఫాన్ సింగ్ సినిమాలో నటించాడు.[3]
నటించినవి
మార్చుటెలివిజన్
మార్చుసీరియల్ | పాత్ర | సంవత్సరం |
---|---|---|
కథా సాగర్ | 1986 | |
బునియాద్ | లుభయ రామ్ | 1986 |
జునూన్[4] | సుమేర్ రాజ్‌వంశ్ | 1993 |
కిస్మత్ | ||
గ్రేట్ మరాఠా | దత్తాజీ సింధియా | 1994-95 |
పాంథర్ | పాంథర్ | 1996-1998 |
ఘుటాన్ | ||
సాహిల్ | ||
మౌలానా ఆజాద్ | మౌలానా ఆజాద్ | |
ముజ్రిమ్ హజీర్ | ||
రిష్ట | ||
లాహూ కే ఫూల్ | డెకోయిట్ | |
పరమ వీర చక్ర | కల్నల్. హోషియార్ సింగ్ | 1988 |
అపనే పరాయే | ||
యుగ్ (టీవీ సిరీస్) | రాజు | 1996-98 |
నూర్జహాన్ (టీవి సిరీస్) | అక్బర్ చక్రవర్తి | 2000 |
సినిమాలు
మార్చుసినిమా | పాత్ర | సంవత్సరం |
---|---|---|
ఖూన్ భారీ మాంగ్ | న్యాయవాది | 1988 |
జఖ్మీ ఔరత్ | మెహతా | |
దయావాన్ | ఛోటే అన్నా | |
కహాన్ హై కానూన్ | పీటర్ | 1989 |
అప్నా దేశ్ పరాయే లాగ్ | న్యాయవాది శర్మ | |
భ్రష్టాచార్ | మంగళ్ | |
నాకా బండి | పోలీస్ ఇన్‌స్పెక్టర్ సత్యప్రకాష్ | 1990 |
ఆజాద్ దేశ్ కే గులాం | మంగళ్ | |
అంబా | ఠాకూర్ షంషేర్ సింగ్ | |
న్యాయ్ అన్యాయ్ | ఇన్‌స్పెక్టర్ ఖాన్ | |
ప్యార్ కా దేవతా | మురళీ ఎం రాయ్ | 1991 |
రణభూమి | చందన్ హెంచ్‌మన్ | |
అకైలా | న్యాయవాది | |
స్వర్గ్ యహాన్ నరక్ యహాన్ | ఇన్‌స్పెక్టర్ అస్లాం | |
లక్ష్మణరేఖ | జబ్బార్ ఖాన్ | |
విశ్వాత్మ | మదన్ భరద్వాజ్ | 1992 |
జిందగీ ఏక్ జువా | మంగళ్ జగ్జిత్ సింగ్ జెజె అసిస్టెంట్ | |
యుగంధర్ | గోరా ఠాకూర్ | 1993 |
సాహిబాన్ | పోలీస్ ఇన్‌స్పెక్టర్/దరోగా | |
దిల్ తేరా ఆషిక్ | మిస్టర్ జేమ్స్ | |
దలాల్ | జగ్గా సేథ్ | |
నిషానా | పోలీసు అధికారి | 1995 |
యష్ | విక్రమ్ రాయ్ | 1996 |
నాగమణి | పాములు ఆడించేవాడు | |
ట్రైన్ టు పాకిస్థాన్ | పంజాబ్ పోలీస్ ఏఎస్ఐ | 1998 |
జనశీన్ | జైచంద్ | 2003 |
తూఫాన్ సింగ్ | లఖా | 2017 |
అవార్డులు
మార్చు- 1998లో టెలివిజన్ సీరియల్ జునూన్ లోని పాత్రకు, ఉత్తమ నటుడిగా రేడియో-టెలివిజన్ అడ్వర్టైజింగ్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అవార్డు
- ఖల్సా సినిమాగానూ పంజాబ్ ప్రభుత్వం నుండి బాబా ఫరీద్ అవార్డు
- 2006లో పంజాబ్ ముఖ్యమంత్రి నుండి అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు
- ఉత్తమ నటుడిగా మోహన్ రాకేష్ గోల్డ్ మెడల్
మరణం
మార్చుదీర్ఘకాలంగా క్యాన్సర్‌తో బాధపడిన మంగళ్ థిల్లాన్, లూధియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023, జూన్ 11న మరణించాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "Made in Chandigarh: 'Don't let the city decay' says actor Mangal Dhillon". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-09-28. Retrieved 2023-02-20.
- ↑ "Actor Mangal Dhillon passes away after battling cancer". Business Today (in ఇంగ్లీష్). 2023-06-11. Archived from the original on 2023-06-11. Retrieved 2023-06-11.
- ↑ telugu, NT News (2023-06-11). "Mangal Dhillon | ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 2023-06-11. Retrieved 2023-06-11.
- ↑ "The Tribune, Chandigarh, India - Amritsar PLUS". www.tribuneindia.com. Retrieved 2017-11-27.
- ↑ "Actor-director Mangal Dhillon passes away after battling cancer". India Today (in ఇంగ్లీష్). 2023-06-11. Archived from the original on 2023-06-11. Retrieved 2023-06-11.