తెలంగాణ జిల్లాలు

తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి.

చరిత్రసవరించు

భారత స్వాతంత్ర్యం తరువాత 1948లో భారతదేశంలోని డొమినియన్‌లో చేర్చబడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి 8 జిల్లాలు ఉన్నాయి.[1] 1953, అక్టోబరు 1న వరంగల్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా ఏర్పాటుచేయబడింది.[2] 1956, నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మెరుగైన పరిపాలన కోసం భద్రాచలం డివిజన్, అశ్వారావుపేట తాలూకా భాగాలను గోదావరి జిల్లాల నుండి ఖమ్మం జిల్లాలో కలుపబడ్డాయి.[2] 1978, ఆగస్టు 15న హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్ అర్బన్ జిల్లా, హైదరాబాద్ రూరల్ జిల్లాగా విభజించారు. హైదరాబాద్ అర్బన్ జిల్లాను చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్, సికింద్రాబాద్ తాలూకాలు అనే 4 తాలూకాలుగా ఉన్నాయి. వీటిలో ఎంసిహెచ్ ప్రాంతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ రూరల్ జిల్లాను రంగారెడ్డి జిల్లాగా మార్చారు.[3]

ఆంధ్రప్రదేశ్ నుండి 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పడింది. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను తిరిగి తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చారు.[4][5] 2016, అక్టోబరు 11న 21 కొత్త జిల్లాలు సృష్టించబడ్డాయి. దాంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలు కనిష్టంగా 2 నుండి గరిష్టంగా 5 జిల్లాలుగా విభజించబడ్డాయి.[6] 2019, ఫిబ్రవరి 17న 9 మండలాలతో ములుగు, 11 మండలాలతో నారాయణపేట కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. అప్పుడు మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరుకుంది.[7]

2016లో వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు. ఆ తరువాత 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[8][9][10]

గణాంకాలుసవరించు

 
Location of Telangana in India

భద్రాద్రి జిల్లా 8,062 km2 (3,113 sq mi) వైశాల్యంతో అతిపెద్ద జిల్లా కాగా, 2,019 km2 (780 sq mi) వైశాల్యం కలిగిన రాజన్నసిరిసిల్ల అతి చిన్న జిల్లా. హైదరాబాద్, 35,269,257 మందితో అత్యధిక జనాభా కలిగి ఉన్న జిల్లా.[11]

తెలంగాణ జిల్లాల పటంసవరించు

 
తెలంగాణ జిల్లాలు (రంగు పూయబడిన)

జాబితాసవరించు

వ.సంఖ్య జిల్లా జిల్లా ప్రధాన

కార్యాలయం

రెవెన్యూ

డివిజన్లు సంఖ్య

మండలాలు మొత్తం రెవెన్యూ గ్రామాలు అందులో నిర్జన గ్రామాలు నిర్జన గ్రామాలు పోగా మిగిలిన రెవెన్యూ గ్రామాలు జనాభా (2011) వైశాల్యం (చ.కి) జిల్లా పటాలు
1 ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ 2 18 505 31 474 7,08,952 4,185.97  
2 కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ 2 15 419 17 402 5,15,835 4,300.16  
3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2 23 377 32 345 13,04,811 8,951.00  
4 జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి 1 11 223 23 200 7,12,257 6,361.70  
5 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ 1 12 196 0 196 6,64,971 2,928.00  
6 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 2 16 34,41,992 4,325.29
7 జగిత్యాల జిల్లా జగిత్యాల 3 18 286 4 282 9,83,414 3,043.23  
8 జనగామ జిల్లా జనగామ 2 12 176 1 175 5,82,457 2,187.50  
9 కామారెడ్డి జిల్లా కామారెడ్డి 3 22 473 32 441 9,72,625 3,651.00  
10 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 2 16 210 5 205 10,16,063 2,379.07  
11 ఖమ్మం జిల్లా ఖమ్మం 2 21 380 10 370 14,01,639 4,453.00  
12 మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ 2 16 287 15 272 7,70,170 2,876.70  
13 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 1 16 310 2 308 13,18,110 4,037.00  
14 మంచిర్యాల జిల్లా మంచిర్యాల 2 18 362 18 344 807,037 4,056.36  
15 మెదక్ జిల్లా మెదక్ 3 21 381 8 373 767,428 2,740.89  
16 మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ 2 15 163 7 156 2,542,203 5,005.98  
17 నల్గొండ జిల్లా నల్గొండ 3 31 566 15 551 1,631,399 2,449.79  
18 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ 4 20 349 9 340 893,308 6,545.00  
19 నిర్మల జిల్లా నిర్మల 2 19 429 32 397 709,415 3,562.51  
20 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 3 29 450 33 417 1,534,428 4,153.00  
21 రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి 5 27 604 32 572 2,551,731 1,038.00  
22 పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి 2 14 215 8 207 795,332 4,614.74  
23 సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి 4 27 600 16 584 1,527,628 4,464.87  
24 సిద్దిపేట జిల్లా సిద్దిపేట 3 24 381 6 375 993,376 3,425.19  
25 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల 2 13 171 4 167 546,121 2,030.89  
26 సూర్యాపేట జిల్లా సూర్యాపేట 2 23 279 9 270 1,099,560 1,415.68  
27 వికారాబాదు జిల్లా వికారాబాద్ 2 19 503 19 484 881,250 3,385.00  
28 వనపర్తి జిల్లా వనపర్తి 1 14 216 1 215 751,553 2,938.00  
29 హన్మకొండ జిల్లా వరంగల్ 2 14 163 1,135,707 1,304.50  
30 వరంగల్ జిల్లా వరంగల్ 2 13 192 716,457 2,175.50  
31 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి 2 17 321 3 318 726,465 3,091.48  
32 ములుగు జిల్లా [12] ములుగు 1 9 336 109 277 2,94,000
33 నారాయణపేట జిల్లా[12] నారాయణపేట 1 11 252 2 250 5,04,000
మొత్తం 73 594 35,003,694 112,077.00

మూలం: తెలంగాణ జిల్లాలు [13]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Yazdani, Ghulam (1937). "Hyderabad State". Atlantic Publishers & Distri – via Google Books.
  2. 2.0 2.1 "Know Your Corporation".
  3. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2021-10-31.
  4. "The Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2014" Accessed 13 July 2014
  5. "Protests against Centre, Andhra Pradesh in Khammam over Polavaram Bill". Deccan Chronicle, 12 July 2014. Accessed 2021-10-31.
  6. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Retrieved 2021-10-31.
  7. "Telangana gets two new districts: Narayanpet and Mulugu". The New Indian Express. Retrieved 2021-10-31.
  8. Namasthe Telangana (12 July 2021). "అర్బన్‌.. హన్మకొండ రూరల్‌.. వరంగల్‌". Namasthe Telangana. Archived from the original on 13 July 2021. Retrieved 2021-10-31.
  9. "Hanamkonda Reorganization: State Government issues final notice". Deccan News. 2021-08-12. Retrieved 2021-10-31.
  10. "Hanamkonda, Warangal in Telangana to be new districts now- The New Indian Express". web.archive.org. 2021-10-27. Retrieved 2021-10-31.
  11. "Telangana gets 31 districts to spruce up adminstration". Deccan Chronicle. 11 October 2016. Retrieved 11 October 2016.
  12. 12.0 12.1 "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 ఫిబ్రవరి 2019. Retrieved 17 ఫిబ్రవరి 2019. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help); More than one of |accessdate= and |access-date= specified (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  13. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Retrieved 8 October 2016.

వెలుపలి లంకెలుసవరించు