ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

ఆంధ్రప్రదేశ్ లో రెండవ స్థాయి పరిపాలన విభాగమైన జిల్లాలు
(ఆంధ్రప్రదేశ్ జిల్లాలు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటం
రకంజిల్లాలు
స్థానంఆంధ్రప్రదేశ్
సంఖ్య26 జిల్లాలు
జనాభా వ్యాప్తిపార్వతీపురం మన్యం – 9,25,340 (అత్యల్ప); నెల్లూరు – 24,69,712 (అత్యధిక)
విస్తీర్ణాల వ్యాప్తివిశాఖపట్నం – 1,048 చ.కి.మీ. (చిన్నది); ప్రకాశం – 14,322 చ.కి.మీ. (అతిపెద్ద)
ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఉప విభజనఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు

విశాఖపట్నం జిల్లా విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా కాగా, ప్రకాశం జిల్లా పెద్దది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అత్యధికజనాభా కలిగిన జిల్లా అయితే, పార్వతీపురం మన్యం జిల్లా అత్యల్పజనాభా కలిగిన జిల్లాగా గుర్తించబడ్డాయి. ప్రతి జిల్లాను రెండు లేదా అంతకంటే తక్కువ రెవెన్యూ డివిజన్‌లుగా విభజించబడ్డాయి. రెవెన్యూ డివిజన్లును పరిపాలనా ప్రయోజనాల కోసం మండలాలుగా ఉపవిభజన చేయబడ్డాయి.

చరిత్ర

మార్చు

స్వాతంత్ర్యం వచ్చేనాటికినేటి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో భాగంగాఉండేది. తెలుగు మాట్లాడే ఆధిపత్య ప్రాంతాలైన కోస్తాాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడింది.[1]

ఆంధ్రరాష్ట్రంగా ఇది అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి అనే 11 జిల్లాలను కలిగి ఉంది.[2][3]

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ఫలితంగా రాష్ట్ర సరిహద్దులు భాషాపరమైన మార్గాలను అనుసరించి పునర్వ్యవస్థీకరించబడ్డాయి.1956 నవంబరు 1న ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. దీనిని పునరాలోచనలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌గా సూచిస్తారు.

ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలతో కలిపి ఆంధ్రరాష్ట్రం లోని 11 జిల్లాల కలిపి మొత్తం 21 జిల్లాలతో ఏర్పడింది. 1959 సంవత్సరంలో, గోదావరి నదికి అవతలి వైపున ఉన్న తూర్పు గోదావరి జిల్లా లోని భద్రాచలం, నూగూరు వెంకటాపురం తాలూకాలు భౌగోళిక సామీప్యత, పరిపాలనా సాధ్యత దృష్ట్యా ఖమ్మం జిల్లాలో విలీనం చేయబడ్డాయి. అదే సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా లోని అశ్వారావుపేట కొంత భాగాన్ని ఖమ్మం జిల్లాకు, కృష్ణా జిల్లాకు చెందిన మునగాల తాలూకాను నల్గొండ జిల్లా లోకి చేర్చారు.[4] 1970లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా, 1979లో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విజయనగరం జిల్లా ఏర్పడడంతో జిల్లాల సంఖ్య 21 నుండి 23కు పెరిగింది.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా విభజించబడిన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌గా పిలవబడే ఆంధ్రప్రాంతం 13 జిల్లాలతో మిగిలిపోయింది. అయితే పోలవరం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుండి అనేక గిరిజన ప్రాబల్య మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమయ్యాయి. ఈ మండలాలు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో చేర్చబడ్డాయి.[5][6][7][8]

2022 జనవరి 26న, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం, 1974, సెక్షన్ 3 (5) ప్రకారం ప్రాథమిక ప్రకటన జారీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఆధారంగా ప్రతిపాదించింది.[9][10] దీనికి మినహాయింపు విశాలంగా వున్న అరకు లోకసభ నియోజక వర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చటం. ప్రజల అభ్యర్ధనల మేరకు, మిగతా చోట్ల 12 అసెంబ్లీ నియోజకవర్గాలను లోక్‌సభనియోజకవర్గం ప్రధానంగా గల జిల్లాలో కాక, ఇతర జిల్లాలలో వుంచారు.[11][12] ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, ప్రభుత్వం 2022 ఏప్రిల్ 3న 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌ను ప్రచురించింది. దాని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులోని షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలు 2022 ఏప్రిల్ 4 నుండి అమలులోకి వచ్చాయి.[13][14][15] ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 సాంస్కృతిక ప్రాంతాలలో 26 జిల్లాలు ఉన్నాయి

కాలక్రమ స్థితి పటాలు

మార్చు

పునర్య్వస్థీకరణ వివరాలు

మార్చు

2022 పునర్య్వస్థీకరణ, తదనంతర సవరణల ప్రకారం రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు గణాంకాలు.[16]

  • జిల్లాల సంఖ్య: 26 (మరిన్ని వివరాలకు దిగువ గణాంకాలతో జిల్లాల జాబితా చూడండి.)
  • మొత్తం మండలాలు: 679

2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న మండలాలకు జరిగిన మార్పులు

వివరణ:2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న 670 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం, విజయవాడ పట్టణ మండలం, గుంటూరు మండలం, నెల్లూరు మండలం, కర్నూలు మండలం ఈ 5 మండలాలు రద్దై, వాటిస్థానంలో పైన వివరించిన ప్రకారం 14 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వాటితో రాష్ట్రం లోని మండలాల సంఖ్య 679కి చేరుకుంది.[17]

2023 లో జరిగిన మార్పులు

మార్చు

గణపవరం మండలం 16 ఫిబ్రవరి 2023 తేదీన, తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చబడింది.[18]

జిల్లాల గణాంకాలు

మార్చు
వ.సంఖ్య కోడ్[19] అధికారిక పేరు ప్రధాన కార్యాలయం రెవెన్యూ డివిజన్లు మండలాలు సంఖ్య జనాభా విస్తీర్ణం చ.కి.మీ. జనసాంద్రత చ.కి.మీ.1కి
స్థితిని తెలిపే పటం
1 SR శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 3 30 21,91,471 4,591 477.34  
2 PM పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం 2 15 9,25,340 3,659 252.89  
3 VZ విజయనగరం జిల్లా విజయనగరం 3 27 19,30,811 4,122 468.42  
4 VS విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 2 11 19,59,544 1,048 1869.79  
5 AS అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు 2 22 9,53,960 12,251 77.87  
6 AK అనకాపల్లి జిల్లా అనకాపల్లి 2 24 17,26,998 4,292 402.38  
7 KK కాకినాడ జిల్లా కాకినాడ 2 21 20,92,374 3,019 693.07  
8 EG తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం 2 19 18,32,332 2,561 715.48  
9 KN డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం 3 22 17,19,093 2,083 825.30  
10 EL ఏలూరు జిల్లా ఏలూరు 3 27 20,06,737 6,579 305.02
11 WG పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 20 18,44,898 2,278 809.88
12 NT ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 3 20 22,18,591 3,316 669.06  
13 KR కృష్ణా జిల్లా మచిలీపట్నం 3 25 17,35,079 3,775 459.62  
14 PL పల్నాడు జిల్లా నరసరావుపేట 3 28 20,41,723 7,298 279.76  
15 GU గుంటూరు జిల్లా గుంటూరు 2 18 20,91,075 2,443 855.95  
16 BP బాపట్ల జిల్లా బాపట్ల 2 25 15,86,918 3,829 414.45  
17 PR ప్రకాశం జిల్లా ఒంగోలు 3 38 22,88,026 14,322 159.76  
18 NE శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు 4 38 24,69,712 10,441 236.54  
19 KU కర్నూలు జిల్లా కర్నూలు 3 26 22,71,686 7,980 284.67  
20 NN నంద్యాల జిల్లా నంద్యాల 3 29 17,81,777 9,682 184.03  
21 AN అనంతపురం జిల్లా అనంతపురం 3 31 22,41,105 10,205 219.61  
22 SS శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి 4 32 18,40,043 8,925 206.17  
23 CU వైఎస్ఆర్ జిల్లా కడప 4 36 20,60,654 11,228 183.53  
24 AM అన్నమయ్య జిల్లా రాయచోటి 3 30 16,97,308 7,954 213.39  
25 TR తిరుపతి జిల్లా తిరుపతి 4 34 21,96,984 8,231 266.92  
26 CH చిత్తూరు జిల్లా చిత్తూరు 4 31 18,72,951 6,855 273.22  

జిల్లాల విశేషాలు

మార్చు

వ్యక్తుల పేరుతో ఉన్న జిల్లాలు

మార్చు

రాష్ట్రంలో 2022 పునర్య్వస్థీకరణ తరువాత ఈ దిగివ వివరించిన 7 జిల్లాలు వ్యక్తుల పేరుతో ఉన్నాయి.[20][21]

ఆరు జోన్లు

మార్చు

1.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి

2.పాడేరు, రాజమండ్రి, కాకినాడ, కోనసీమ,

3. ఏలూరు, విజయవాడ, బందరు

4.గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు

5.తిరుపతి, చిత్తూరు, రాయచోటి, కడప

6.నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి, కర్నూలు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "History of Andhra Pradesh". The Hans India (in ఇంగ్లీష్). 1 November 2020. Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
  2. "AP new districts: First formed under the empire, Andhra Pradesh's map shaped and reshaped over two centuries". The Times of India (in ఇంగ్లీష్). 30 March 2022. Retrieved 3 April 2022.
  3. "New districts in AP: Experts want the government to walk the talk". The Hindu (in ఇంగ్లీష్). 2 April 2022. Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
  4. ANI (2013-11-12). "GoM on Andhra bifurcation to elicit views of political parties". Business Standard India. Retrieved 2023-03-14.
  5. "Andhra Pradesh takes control of seven mandals in Khammam". Deccan Chronicle (in ఇంగ్లీష్). 3 September 2014. Retrieved 3 April 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "List of seven mandals to be included in AP". The Hans India (in ఇంగ్లీష్). 11 July 2014. Retrieved 3 April 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "TS gives up on 7 transferred mandals". The Hindu (in Indian English). 2014-08-19. ISSN 0971-751X. Retrieved 2023-03-14.
  8. "Parliament passes bill on Polavaram project". The Hindu (in Indian English). 2014-07-14. ISSN 0971-751X. Retrieved 2023-03-14.
  9. "Doubling the number of districts in Andhra Pradesh: The proposal and the criticism". The Indian Express (in ఇంగ్లీష్). 2022-01-31. Retrieved 2023-03-11.
  10. Raghavendra, V. (26 January 2022). "With creation of 13 new districts, AP now has 26 districts". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  11. "AP New Districts: కొత్త కళ.. గడప వద్దకే పాలన". 2022-04-05. Retrieved 2022-04-22.
  12. "Andhra news:అందుబాటులో జిల్లా కేంద్రం". ఈనాడు. 2022-04-04. Retrieved 2022-04-04.
  13. "New districts to come into force on April 4". The Hindu. 30 March 2022. Retrieved 3 April 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "Here's how new ap map looks after districts reorganisation". 2022-04-03. Retrieved 2023-04-17.
  15. "Andhra Pradesh to have 13 new districts from April 4". india.com (in ఇంగ్లీష్). 31 March 2022. Retrieved 3 April 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  17. DOP (2023). Socio economic survey 2022-23 (PDF). Government of AP. p. 431. Archived from the original (PDF) on 2024-03-28. Retrieved 2024-02-25.
  18. AP GO Number 158, Part-I, Extraordinary dated 16-Feb-2023 for GO MS No:54, Revenue (Lands IV), dated 16-02-2023
  19. "NIC Policy on format of e-mail Address" (PDF). www.mail.nic.in. 2008-09-11. Archived from the original (PDF) on 11 September 2008. Retrieved 2021-02-15.
  20. Desk, HT Telugu. "New Districts In AP | ఏపీలో వ్యక్తుల పేర్లతో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? విస్తీర్ణంలో పెద్ద జిల్లా ఏది?". Hindustantimes Telugu. Retrieved 2023-08-01.
  21. "ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో 26‌ జిల్లాలు... పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు - BBC News తెలుగు". web.archive.org. 2023-08-01. Archived from the original on 2023-08-01. Retrieved 2023-08-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

మార్చు