మందాడి సత్యనారాయణ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు

మందాడి సత్యనారాయణ రెడ్డి (1936 సెప్టెంబరు 2 - 2022 నవంబరు 13) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల నేత. అలాగే హన్మకొండ మాజీ ఎమ్మెల్యే.

మందాడి సత్యనారాయణ రెడ్డి
జననం1936 సెప్టెంబరు 2
మరణం2022 నవంబరు 13
హనుమకొండ, తెలంగాణ
పౌరసత్వంభారతీయుడు
వృత్తిబీజేపీ నేత, హన్మకొండ శాసనసభ్యుడు (2004-2009)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాజకీయ నేత, గాయకుడు, రచయిత, కవి, తెలంగాణ ఉద్యమం
జీవిత భాగస్వామితారమ్మ

ప్రారంభ జీవితం

మార్చు

ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇప్పగూడెంలో 1936 సెప్టెంబరు 2న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. 9వ తరగతి వరకు చదువుకున్న ఆయన హనుమకొండలో నివాసం ఏర్పరచుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

1952 నుండి అర్ఎస్ఎస్ స్వయంసేవక్ గా, 1957 సంవత్సరంలో జనసంఘ్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసి హన్మకొండ నియోజకవర్గ శాసనసభ్యుడిగా విజయం సాధించాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి మారాడు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రెండు పర్యాయాలు విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత ప్రత్యేక అహ్వానితులుగా పార్టీకి సేవలందిస్తున్నాడు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ల మందాడి సత్యనారాయణ రెడ్డి హన్మకొండలోని స్వగృహంలో 2022 నవంబరు 13న తుదిశ్వాస విడిచాడు.[1] ఆయనకు భార్య తారమ్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[2][3]

మూలాలు

మార్చు
  1. "తెలంగాణ బీజేపీలో విషాదం.. సీనియర్ నేత మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూత". web.archive.org. 2022-11-13. Archived from the original on 2022-11-13. Retrieved 2022-11-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. V6 Velugu (14 November 2022). "మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూత". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (14 November 2022). "మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి కన్నుమూత". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.