మక్కెన వారి పాలెం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
మక్కెన వారి పాలెం, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మక్కెన వారి పాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 16°1′22.800″N 79°57′25.200″E / 16.02300000°N 79.95700000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | సంతమాగులూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
మార్చుఈ పాఠశాల ప్రాంగణంలో, గ్రామస్థుల సమష్టి సహకారంతో, 2.5 లక్షల వ్యయంతో సభావేదిక నిర్మించుచున్నారు. జిల్లా పరిషత్తు నిధులు ఐదు లక్షల రూపాయలతో పాఠశాలకు ప్రహరీగోడ, సర్వశిక్షా అభియాన్ నిధులు ఏడు లక్షల రూపాయలతో మరుగుదొడ్లు నిర్మించుచున్నారు.
గ్రంథాలయం:- గ్రామానికి చెందిన కీ.శే. మక్కెన లింగయ్య శత జయంతి కానుకగా, ఈ పాఠశాలలో, ఆధునిక సౌకర్యాలతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేటందుకు, వారి సతీమణి శ్రీమతి మక్కెన తులశమ్మ, ప్రవాస భారతీయురాలైన వారి కుమార్తె డాక్టర్ మక్కెన రామాంజమ్మ, ఐదు లక్షల రూపాయల విరాళం అందజేసినారు.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఏలూరి పద్మావతి, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె తరువాత 2013 డిసెంబరు 12 నాడు, సంతమాగులూరు మండల సర్పంచుల సంఘం కార్యదర్శిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుపోలేరమ్మ గుడి
మార్చుమక్కెనవారిపాలెం గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద, 2014, మార్చి-31, సోమవారం, ఉగాది రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో పొంగళ్ళు నిర్వహించారు. గుడి ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. చిన్నపాటి ప్రభను ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయం
మార్చు- ఈ గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో రామాలయ నిర్మాణం జరుగుచున్నది. గ్రామంలో గత 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ప్రాచీన ఆలయ ప్రదేశంలో నూతనంగా తయారు చేయించిన మూలవిరాట్టులను ప్రతిష్ఠించెదరు. నూతన ఆలయంలో గర్భగుడి, ఆలయమండపం, ఆంజనేయస్వామి గుడి, ప్రవేశమార్గంలో సూర్యభగవానుడు, శ్రీకృష్ణార్జునుల రథాలతో పాటు, ఆలయం చుట్టూ దేవతా ప్రతిమలు చెక్కిన ప్రహరీ నిర్మాణం పూర్తి అయినది. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2014, మే-29న ప్రారంభమైనవి. ఈ సందర్భంగా, 2014, జూన్-1, ఆదివారం నాడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు హోమాలు, విశేషపూజలు నిర్వహించారు. మూలవిరాట్టులు, కలశాలు, ధ్వజస్తంభాన్ని, భక్తులు జలంతో శుద్ధిచేసి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వస్తిశ్రీ చాంద్రమాన జయనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పంచమి అనగా జూన్-2,2014, సోమవారం, పుష్యమీ నక్షత్రయుక్త మిధునలగ్న పుష్కరాంశమున ఉదయం 8-04 గంటలకు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళవాద్యాలనడుమ, ఆలయప్రతిష్ఠతోపాటు, ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, గ్రామంలో నాభిశిల ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నసంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు స్థానికులేగాక మండలంలోని ఇతర గ్రామాలనుండి గూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ ఆలయంలో, 2014, జూన్-17, మంగళవారం నాడు, ఆలయ ప్రతిష్ఠ, 16 రోజుల పండుగను గ్రామప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
- ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015, మే నెల-22వతేదీ, శుక్రవారంనాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. మూలవిరాట్టులను విశేషంగా అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు, గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అన్నదానం నిర్వహించారు.
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం
మార్చు- ఈ ఆలయంలో, 2015, మే నెల-13వ తేదీ బుధవారం నాడు, హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు.
- ఈ ఆలయ 52వ ప్రతిష్ఠా వార్షికోత్సవాన్ని, 2016, ఫిబ్రవరి-17వ తేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు.
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం
మార్చుశ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయం
మార్చుఈ ఆలయంలో అమ్మవారి కొలుపులు, 2015, మే నెల-20వ తేదీ బుధవారం నుండి, 24వ తేదీ ఆదివారం వరకు నిర్వహించెదరు.
శ్రీ అంకమ్మ తల్లి ఆలయం
మార్చుస్థానిక బి.సి.కాలనీలో నెలకొన్న ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక కొలుపులు, 2015, మే-20వ తేదీ బుధవారం నుండి 24వ తేదీ ఆదివారం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఆఖరిరోజైన ఆదివారం నాడు, విచ్చేసిన భక్తాదులకు అన్నసంతర్పణ నిర్వహించారు.
గ్రామ ప్రముఖులు
మార్చు- ఏలూరి పూర్ణచంద్ర రావు.
- దండా వెంకట్రామయ్య, వి ఎ ఎం సి. దండ