మఖ్తల్ పురపాలకసంఘం

(మఖ్తల్‌ పురపాలకసంఘం నుండి దారిమార్పు చెందింది)

మఖ్తల్‌ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] మఖ్తల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని, మక్తల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

మఖ్తల్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా నారాయణపేట
మండలం మఖ్తల్‌
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ పావని
 - వైస్ చైర్‌పర్సన్‌ అఖిలారెడ్డి
వైశాల్యము
 - మొత్తం 25.01 km² (9.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 22,165
 - పురుషుల సంఖ్య 11,142
 - స్త్రీల సంఖ్య 11,023
 - గృహాల సంఖ్య 3,874
పిన్ కోడ్ - 509339
ఎస్.టి.డి కోడ్ - 08505
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మఖ్తల్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం మార్చు

కోస్గి చదరపు 25.01 కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16.50°N 77.50°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. జిల్లా కేంద్రం నారాయణపేట నుండి 30 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 172 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 22165 మంది కాగా, అందులో 11142 మంది పురుషులు, 11023 మంది మహిళలు ఉన్నారు. 3,874 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 16 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పావని చైర్‌పర్సన్‌గా, అఖిలారెడ్డి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు మార్చు

  1. వి. శ్వేత
  2. అఖిలారెడ్డి (వైస్ చైర్‌పర్సన్‌)
  3. జగాలి రాములు
  4. సత్యనారాయణ
  5. ఎరుకలి మొగులప్ప
  6. చిన్న నర్సింలు
  7. జ్యోతి కలాల్
  8. ప్రసన్న
  9. రాధిక
  10. గొలపల్లి శంకరమ్మ
  11. అర్చన
  12. ఇర్ఫానా సుల్తానా
  13. పావని (చైర్‌పర్సన్‌)
  14. కర్ణే లక్ష్మి
  15. ఈసరి కౌసల్య
  16. కొల్పూరి కొండయ్య

మూలాలు మార్చు

  1. "Makthal Municipality". makthalmunicipality.telangana.gov.in. Archived from the original on 16 జనవరి 2021. Retrieved 22 March 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 22 March 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 22 March 2021.
  4. "Basic Information of Municipality, Makthal Municipality". makthalmunicipality.telangana.gov.in. Archived from the original on 16 జనవరి 2021. Retrieved 22 March 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 22 March 2021.
  6. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 22 March 2021.

వెలుపలి లంకెలు మార్చు