మథిలుకల్
మథిలుకల్, 1990 మే 18న విడుదలైన మలయాళ సినిమా. వైకోమ్ ముహమ్మద్ బషీర్ స్వీయచరిత్ర మథిలుకల్ నవల అధారంగా అడూర్ గోపాలక్రిష్ణన్ రచించి, దర్శకత్వం వహించి, నిర్మించిన సినిమా ఇది.[1] వైకుం మహమ్మద్ బషీర్ పాత్రలో మమ్ముట్టి నటించగా, కెపిఎసి లలిత కథానాయిక నారాయణికి గాత్రదానం చేసింది. మురళి, రవి వల్లథోల్, శ్రీనాథ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా వెనిస్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 1990లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా నాలుగు అవార్డులను గెలుచుకుంది.
మథిలుకల్ | |
---|---|
దర్శకత్వం | అడూర్ గోపాలక్రిష్ణన్ |
రచన | అడూర్ గోపాలక్రిష్ణన్ |
దీనిపై ఆధారితం | వైకోమ్ ముహమ్మద్ బషీర్ మథిలుకల్ నవల అధారంగా |
నిర్మాత | అడూర్ గోపాలక్రిష్ణన్ |
తారాగణం | మమ్ముట్టి మురళి రవి వల్లథోల్ శ్రీనాథ్ |
ఛాయాగ్రహణం | మంకాడ రవివర్మ |
కూర్పు | ఎం. మణి |
సంగీతం | విజయ రామన్ |
పంపిణీదార్లు | జూబ్లీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1990, మే 18 |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
2013, ఏప్రిల్ నెలలలో జరిగిన భారతీయ సినిమా శతదినోత్సవం సందర్భంగా, ఫోర్బ్స్ పత్రిక ఈ సినిమాలోని మమ్ముట్టి నటనను "భారతీయ సినిమాలోని 25 గొప్ప నటనా ప్రదర్శనల" జాబితాలో చేర్చింది.[2]
కథా నేపథ్యం
మార్చువైకం ముహమ్మద్ బషీర్ జైలు జీవితం, జైలులోని మహిళా ఖైదీ నారాయణి మధ్య ప్రేమపై నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. ఆమె సినిమా అంతటా కనిపించకుండా ఉంటుంది.[3]
నటవర్గం
మార్చుఅవార్డులు
మార్చుఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఈ క్రింది అవార్డులను గెలుచుకుంది:
- 1989 వెనిస్ చలన చిత్రోత్సవం (ఇటలీ )
- ఎఫ్.ఐ.పి.ఆర్.ఈ.ఎస్.సి.ఐ. అవార్డు - అడూర్ గోపాలక్రిష్ణన్
- యునిసెఫ్ అవార్డు - అడూర్ గోపాలక్రిష్ణన్
- జాతీయ ఉత్తమ దర్శకుడు - అడూర్ గోపాలకృష్ణన్
- జాతీయ ఉత్తమ నటుడు - మమ్ముట్టి (ఒరు వడక్కన్ వీరగాథ) సినిమాకి కూడా
- జాతీయ ఉత్తమ ఆడియోగ్రఫీ - ఎన్. హరికుమార్
- ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం)
- 1990 కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు[6]
- ఉత్తమ కథ - వైకోమ్ మహమ్మద్ బషీర్
- ఓసిఐసి అవార్డు - అడూర్ గోపాలక్రిష్ణన్
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకుడికి గ్రాండ్ ప్రైజ్ - అడూర్ గోపాలక్రిష్ణన్
మూలాలు
మార్చు- ↑ P.K.Ajith Kumar. "Romantic interlude". The Hindu. 14 May 2010.
- ↑ Prasad, Shishir; Ramnath, N. S.; Mitter, Sohini (27 April 2013). "25 Greatest Acting Performances of Indian Cinema". Archived from the original on 12 జనవరి 2016. Retrieved 21 August 2021.
- ↑ P.M.Girish. "A Brief Examination of Three Widely-Acclaimed Malayalam Novels". Languageinindia.com. 3 March 2008.
- ↑ "37th National Film Awards". International Film Festival of India. Archived from the original on 5 May 2014. Retrieved 21 August 2021.
- ↑ "37th National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 2 అక్టోబరు 2013. Retrieved 21 August 2021.
- ↑ "Kerala State Film Awards" Archived 3 మార్చి 2016 at the Wayback Machine
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/malayalam/movies/Must-Watch-International-Award-Winning-Malayalam-Films/Must-Watch-International-Award-Winning-Malayalam-Films/photostory/52255804.cms
- ↑ "Adoor Gopalakrishnan wins Best Director Award in France". Rediff.com. 21 November 2002. Retrieved 21 August 2021.
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/malayalam/movies/Must-Watch-International-Award-Winning-Malayalam-Films/Must-Watch-International-Award-Winning-Malayalam-Films/photostory/52255804.cms