మధుమిత (జ. ఆగస్టు 20, 1981) ఒక నటి. ఆమె అసలు పేరు స్వప్న మాధురి. దక్షిణాది సినిమాలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. పుట్టింటికి రా చెల్లీ, మన్మథుడు లాంటి గుర్తింపదగ్గ పాత్రలు ధరించింది. ప్రముఖ నటుడు శివ బాలాజీ ని వివాహమాడింది.

మధుమిత
జననం
స్వప్న మాధురి

20 ఆగస్టు 1981
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002–ఇప్పటివరకు
జీవిత భాగస్వామిశివబాలాజీ

కెరీర్

మార్చు

మధుమిత స్వప్నమాధురి అనే పేరుతో 2002 లో విడుదలైన సందడే సందడి అనే చిత్రంలో ముఖ్యమైన సహాయపాత్రతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. తరువాత మన్మథుడు, అమ్మాయిలు అబ్బాయిలు, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలలో సహాయపాత్రలు చేసింది. అర్జున్ కు చెల్లెలుగా నటించిన పుట్టింటికి రా చెల్లీ సినిమా 275 రోజులు ఆడి సంచలన విజయాన్ని నమోదు చేసింది. [1]

తరువాత ఆమెను పార్తిబన్ కుడైకుళ్ మళై అనే సినిమాతో తమిళ సినీపరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించింది. ఆ పాత్ర పేరైన మధుమిత ను తన అసలు పేరుగా మార్చుకున్నది. ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా ఆమెను తమిళంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆముదే, ఇంగ్లిష్ కారన్ అనే తమిళ సినిమాల్లో నటించింది.

మూలాలు

మార్చు
  1. "Having a ball". The Hindu. Chennai, India. 18 April 2008. Archived from the original on 9 నవంబరు 2012. Retrieved 19 మే 2016.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మధుమిత&oldid=3798889" నుండి వెలికితీశారు