మధురానగరిలో

(మధురా నగరిలో నుండి దారిమార్పు చెందింది)

మధురా నగరిలో 1991 జూన్ 21న విడుదలైన తెలుగు సినిమా. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.గోపాలరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. శారత్ బాబు, నిరోషా, చిన్నా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.బాలకృష్ణ సంగీతాన్నందించాడు.[1] ఇది మళయాళంలో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్ హరిహర్ నగర్ సినిమాకు రీమేక్. తెలుగులో కూడా అత్యంత ప్రజాధరణ పొందినది.

మధురానగరిలో
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం నిరోషా,
చిన్నా
సంగీతం బాలకృష్ణన్
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • సురేష్
  • శరత్‌బాబు
  • నిరోషా
  • చిన్నా
  • రియాజ్ ఖాన్
  • వై.విజయ
  • సుభా
  • అనిత
  • సుధారాణి
  • బాబూమోహన్
  • బాలాజీ
  • వెంకట రమణ రెడ్డి
  • శ్రీకాంత్ మేకా
  • రవిశంకర్

సాంకేతిక వర్గం

మార్చు

ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు

ఇది కొంత క్రైమ్, సస్పెన్స్ కలసిన చిత్రం. ఇది తన అన్నయ్య అకస్మాత్తుగా అదృశ్యమవడంతో అతడిని వెతుకుతూ వచ్చి, కొందరి ఆకతాయి అబ్బాయిల సహాయంతొ అతడి అదృశ్యానికి కారణాలు వెతికి, అతడి మరణానికి కారణమైన వాళ్ళను పోలీసులకు అప్పగించే ఒక చెల్లెలి కథ.

విశేషాలు

మార్చు
  • మళయాళంలో నటి కనక పోషించిన పాత్రను తెలుగులో నిరోషా పోషించింది.
  • ఇది నటుడు శ్రీకాంత్ యొక్క తొలి చిత్రం.

మూలాలు

మార్చు
  1. "Maduranagarilo (1991)". Indiancine.ma. Retrieved 2021-05-07.

బాహ్య లంకెలు

మార్చు