చిన్నా

సినీ నటుడు, దర్శకుడు

చిన్నా తెలుగు నటుడు. నాగార్జున కథానాయకుడిగా నటించిన శివ సినిమాలో సహాయ పాత్రతో ప్రేక్షకులకి సుపరిచితుడు. అతని జన్మనామం అరుగుంట జితేంద్ర రెడ్డి. స్వస్థలం నెల్లూరు. [1] ఆ ఇంట్లో అనే హారర్ సినిమాకు దర్శకత్వం వహించాడు.[2]

చిన్నా
జననం
ఆరుగుంట జితేంద్ర రెడ్డి

నెల్లూరు
వృత్తినటుడు, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1989 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిశిరీష
పిల్లలుమౌనిక, భావన
తల్లిదండ్రులురామచంద్రారెడ్డి, రాజేశ్వరమ్మ

జీవిత విశేషాలు

మార్చు

చిన్నా అసలు పేరు ఆరుగుంట జితేంద్ర రెడ్డి. అతని తల్లిదండ్రులు రామచంద్రా రెడ్డి, రాజేశ్వరి. వారి స్వస్థలం నెల్లూరు. చిన్నా భార్య శిరీష (42 సంవసెప్టెంబరు 12, 2017న అనారోగ్యంతో మరణించింది.[3] చిన్నాకు మౌనిక, భావన అనే ఇద్దరు కూతుర్లున్నారు. [4]

అతని మొదటి సినిమా మధురా నగరిలో. కథానాయకుడు శ్రీకాంత్ కూడా ఇదే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. 1989లో రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో అతని పాత్ర పేరు చిన్నా. తరువాత అదే అతని అసలు పేరుగా మారింది. 1993 లో వచ్చిన అల్లరిపిల్ల సినిమాకు గాను చిన్నాకు వంశీ బర్కిలీ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.

ప్రస్తుతం కొన్ని టీవీ ధారావాహిక కార్యక్రమాల్లో కూడా నటిస్తున్నాడు.

నటించిన సినిమాల పాక్షిక జాబితా

మార్చు
  1. ఆంటీ (1995)
  2. మధురా నగరిలో
  3. శివ
  4. చైతన్య
  5. బాచి
  6. పందెం
  7. మనీ
  8. మనీ మనీ
  9. ప్రేమసందడి (2001)
  10. అల్లరిపిల్ల
  11. అన్నయ్య
  12. కబడ్డీ కబడ్డీ
  13. సొంతం
  14. గౌతమ్ ఎస్.ఎస్.సి.
  15. మీ శ్రేయోభిలాషి
  16. దూసుకెళ్తా
  17. చిన్నోడు
  18. ఆ ఇంట్లో
  19. దూకుడు
  20. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
  21. పుట్టింటి పట్టుచీర
  22. సక్సెస్ (2006)

మూలాలు

మార్చు
  1. "Aa Intlo Tollywood Movie | Aa Intlo Tollywood Movie Stills". Movies.sulekha.com. Retrieved 2012-11-10.[permanent dead link]
  2. "నాశనం చేయకండి:నటుడు చిన్నా". filmibeat.com. Retrieved 14 August 2016.[permanent dead link]
  3. "నటుడు చిన్నా సతీమణి కన్నుమూత". eenadu.net. ఈనాడు. Archived from the original on 13 September 2017. Retrieved 13 September 2017.
  4. "చిన్నా జీవిత విశేషాలు". nettv4u.com. Archived from the original on 21 ఆగస్టు 2016. Retrieved 14 August 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=చిన్నా&oldid=4094344" నుండి వెలికితీశారు