మధ్యాహ్నం హత్య

మధ్యాహ్నం హత్య 2004, సెప్టెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె. డి. చక్రవర్తి, ఆమని, ప్రియాంక కొఠారి, నర్సింగ్ యాదవ్, బ్రహ్మాజీ ముఖ్యపాత్రలలో నటించగా, శైలేంద్ర, స్వప్నిల్ సంగీతం అందించారు.[1][2] సినిమా ఉపశీర్షిక "మీ భార్యను చనిపోతే బాగుండని మీకు ఎప్పుడైనా అనిపించిందా" అనివుండడం, ఒక ప్రచార చిత్రం ఉన్న తీరు ఈ సినిమాను వివాదాస్పదం చేశాయి.

మధ్యాహ్నం హత్య
Madhyanam Hathya Movie Poster.jpg
మధ్యాహ్నం హత్య సినిమా పోస్టర్
దర్శకత్వంరాం గోపాల్ వర్మ
దృశ్య రచయితరాం గోపాల్ వర్మ
కథఅతుల్
నిర్మాతరాం గోపాల్ వర్మ
తారాగణంజె. డి. చక్రవర్తి, ఆమని, ప్రియాంక కొటారి, భానుచందర్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుభానోదయ్
సంగీతంశైలేంద్ర, స్వప్నిల్
నిర్మాణ
సంస్థ
వర్మ కార్పోరేషన్/ప్రతిమ ఫిల్మ్స్
విడుదల తేదీ
2004 సెప్టెంబరు 3 (2004-09-03)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: రాం గోపాల్ వర్మ
  • కథ: అతుల్
  • సంగీతం: శైలేంద్ర, స్వప్నిల్
  • ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు
  • కూర్పు: భానోదయ్
  • నిర్మాణ సంస్థ: వర్మ కార్పోరేషన్/ప్రతిమ ఫిల్మ్స్

వివాదాలుసవరించు

మధ్యాహ్నం హత్య సినిమా ఉపశీర్షికగానూ, ప్రచారం కోసం వాడిన "మీకు ఎప్పుడైనా మీ భార్య చనిపోతే బాగుండనిపించిందా" అన్న వాక్యం వివాదాలకు కారణమైంది.[3] మహిళలపై హింసను, ప్రత్యేకించి గృహ హింసను ప్రోత్సహించేలా, సాధారణీకరించేలా ఈ వాక్యం ఉందంటూ మహిళా సంఘాలు ఉద్యమించాయి.

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "మధ్యాహ్నం హత్య". telugu.filmibeat.com. Retrieved 14 April 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Madyahnapu Hatya". www.idlebrain.com. Retrieved 14 April 2018.
  3. Bharat, today. "వివాదంలో మరో సినిమా టైటిల్". భారత్ టుడే. Retrieved 17 April 2018.