మనోజ్ కుమార్ పాండే
కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే, PVC (25 జూన్ 1975 – 3 జూలై 1999), భారత సైనిక దళం నకు చెందిన అధికారి. ఆయన 1/11 గోర్ఖా రైఫిల్స్ కు చెందిన వారు. ఆయనకు భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమ వీర చక్ర మరణానంతరం లభించింది. ఆయన విపత్కర పరిస్థితులలో భారత సైనిక దళంలో ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ నాయకత్వం వహించాడు. ఆయన జుబర్ టాప్, ఖలుబార్ కొండలపై బటాలిక్ సెక్టారులో కార్గిల్ యుద్ధము లో వీరమరణం పొందాడు.
కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే PVC | |
---|---|
జననం | సీతాపూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1975 జూన్ 25
మరణం | 1999 జూలై 3 బంకర్ రిడ్జ్, ఖలూబార్, బటాలిక్ సెక్టార్, కార్గిల్, జమ్మూ కాశ్మీర్, భారతదేశం | (వయసు 24)
రాజభక్తి | Republic of India |
సేవలు/శాఖ | Indian Army |
ర్యాంకు | Captain |
యూనిట్ | 1/11 Gorkha Rifles |
పోరాటాలు / యుద్ధాలు | కార్గిల్ యుద్ధం ఆపరేషన్ విజయ్ (1999) |
పురస్కారాలు | పరమ వీర చక్ర |
ప్రారంభ జీవితం
మార్చుకెప్టెన్ మనోజ్ పాండే, ఉత్తర ప్రదేశ్ లోని కమలూర్ జిల్లాకూ చెందిన సీతాపూర్ గ్రామానికి చెందినవాడు. ఆయన లక్నో నివాసి అయిన చిన్న వ్యాపారవేత్త శ్రీ గోపీచంద్ పాండే కుమారుడు. ఆయనకున్న సహోదరులలో ఆయన పెద్దవాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నందలి ఉత్తరప్రదేశ్ సైనిక పాఠశాలలొ విద్యాభ్యాసం చేసాడు. మాధ్యమిక విద్యను లక్ష్మీబాయి మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూలులో చదివాడు. ఆయనకు క్రీడలలో బాక్సింగ్, బాడీ బిల్డింగ్ పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. 1990లో ఉత్తరప్రదేశ్ డైరక్టరేట్ యొక్క ఎన్.సి.సి. జూనియర్ డివిజన్ లో ఉత్తమ కాడెట్ గా గుర్తింపబడ్డాడు.[1]ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో ఉత్తీర్ణత సాధించాడు. ఆయన గోర్ఖా రైఫిల్స్ లో చేరాలని అనుకున్నాడు. ఆయన భారత సైన్యంలోని 1/11 గోర్ఖా రైఫిల్స్ లో నియమింపబడ్డాడు. ఆయన ఎంపిక కాక ముందు బి.ఎస్.ఆర్.బి ఇంటర్వ్యూకు హారైనాడు. ఇంటర్వ్యూలో ఆయనకు "ఎందుకు నీవు ఆర్మీలో చేరాలనుకుంటున్నావు?" అని అడిగారు. అందుకు ఆయన వెంటనె "నేను పరమ వీర చక్ర గెలవాలనుకుంటున్నాను" అని సమాధానమిచ్చాడు. ఆయాన చెప్పిన విధంగానే ఆయనకు పరమ వీర చక్ర పురస్కారం మరణానంతరం వచ్చింది.
కార్గిల్
మార్చుఆయనను బలవంతంగా కార్గిల్ యుద్ధము లో జూన్ 11, 1999 న బెటాలిక్ సెక్టారులో చొరబాటు కోసం పంపించారు. ఆయన కొంతమంది సైనికులకు నాయకత్వం వహించి వ్యూహాత్మక స్థానం అయిన జుబర్ టాప్ ను కైవశం చేసుకొనేందుకు బయలుదేరాడు. పరిస్థితిని త్వరగా అంచనావేసి ఈ యువ అధికారి ఇరుకైన, ప్రమాదకరమైన శిఖరం గుండా వెళ్ళి శత్రు స్థానాన్ని కనుగొనేందుకు దోహదపడ్డాడు. కొద్ది లక్ష్యంలో శత్రువులు భారత సైనికులపైకి కాల్పులు జరిపారు. సమర్థవంతంగా భారత్ ఎదుర్కొని దాడి చేసింది. అధిక ధైర్య సాహసాలతో ఆయన దళంతో ముందుకు చేరి బుల్లెట్ల మధ్యనుండి యుద్ధ కేకలు వేస్తూ ముందుకు వెళ్ళాడు. ఆయన భుజానికి, కాలికి గాయాలైనా, శత్రువుల మొదటి బంకర్ నాశనం చేయడానికొరకు ఒంటరిగా పోరాడాలనే భయంకర నిర్ణయాన్ని తీసుకున్నాడు. భయంకరమైన సమీప యుద్ధంలో ఇద్దరు శత్రు సైనికులను హతమార్చి మొదటి బంకర్ ను స్వాధీనం చేసుకున్నాడు. ఇది యుద్ధానికి ముఖ్య మలుపు. నాయకుల ప్రేరణతో ఆకస్మికంగా సైనికులు దాడిచేసి శత్రువులను తుదముట్టించారు. చాలా దారుణ గాయాలను లెక్కచేయకుండా ఆయన బంకర్ నుండి బంకర్ కు మనుషులను తరలించాడు. తీవ్రంగా గాయపడిన ఆయన చివరి బంకర్ వద్ద కుప్పకూలాడు. అప్పటికే ఆయన బంకర్ లను ఆయన మనుషులతో స్వాధీనం చేసుకున్నడు.
ఆపరేషన్ విజయ్
మార్చుకెప్టెన్ మనోజ్ కుమార్ పాండే "ఆపరేషన్ విజయ్" సమయంలో నిర్భయముగా వరుస దాడులలో పాల్గొన్నారు; బెటాలిక్ లో జుబర్ టాప్ ను అధిక నష్టంతో చొరబాటు దారులను వెనుకకు పంచించడంలో పోరాటం చేసాడు.[2]
మరణం
మార్చుమొదటి శత్రు స్థావరం పైకి ధైర్యంగా పోరాడిన ఆయన ఇద్దరు శత్రు సైనికులను హతమార్చి రెండవ స్థానంలో మరో ఇద్దరు శత్రువులను హతమార్చాడు. ఆయనకు మూడవ స్థానంలో భుజంలో, కాలికి గాయాలు అయ్యాయి. ఆయనకు అయిన గాయాలను లెక్క చేయకుండా నాల్గవ స్థానంలో పోరాటాన్ని కొనసాహించి తన మనుషులను గ్రెనేడ్ ఉపయోగించి నాశనం చేయాలని అభ్యర్థించాడు. అప్పుడు నుదురుపై కొద్ది గాయాలయ్యాయి. [2]
ఆయన ఆఖరి మాటలు "నా ఛోడ్ను" (నేపాలి భాషలో వారిని విడిచిపెట్టవద్దు అని అర్థం)[2] [2]
పరమ వీర చక్ర
మార్చుఆయన చేసిన పరక్రమాలకు భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక పురస్కారం పరమ వీర చక్ర ను అందజేసింది. దానిని అధికారిక వెబ్‌సైటులో ఈ క్రిందివిధంగా వ్రాసారు.
CITATION
(LIEUTENANT MANOJ KUMAR PANDEY)Lieutenant Manoj Kumar Pandey took part in a series of boldly led attacks during Operation Vijay, forcing back the intruders with heavy losses in Batalik including the capture of Jubar Top. On the night of 2/3 July 1999 during the advance to Khalubar as his platoon approached its final objective, it came under heavy and intense enemy fire from the surrounding heights. Lieutenant Pandey was tasked to clear the interfering enemy positions to prevent his battalion from getting day lighted, being in a vulnerable position. He quickly moved his platoon to an advantageous position under intense enemy fire, sent one section to clear the enemy positions from the right and himself proceeded to clear the enemy positions from the left. Fearlessly assaulting the first enemy position, he killed two enemy personnel and destroyed the second position by killing two more. He was injured on the shoulder and legs while clearing the third position. Undaunted and without caring for his grievous injuries, he continued to lead the assault on the fourth position urging his men and destroyed the same with a grenade, even as he got a fatal burst on his forehead. This singular daredevil act of Lieutenant Manoj Kumar Pandey provided the critical firm base for the companies, which finally led to capture of Khalubar. The officer, however, succumbed to his injuries.
Lieutenant Manoj Kumar Pandey, thus, displayed most conspicuous bravery, indomitable courage, outstanding leadership and devotion to duty and made the supreme sacrifice in the highest traditions of the Indian Army.[2]
తదనంతర పరిణామాలు
మార్చు- ఆయనకు మరణానంతరం పరమ వీర చక్ర పురస్కారం లభించింది.[2]
- ఆయన తండ్రి గోపీచంద్ అపండే భారత 52వ గణతంత్ర దినొత్సవం సందర్భంగా రాష్ట్రపతి నుండి ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.[2]
- లక్నోలోని ఉత్తర ప్రదేశ్ సైనిక స్కూలు కొత్త ఆడిటోరియం నకు ఆయన పేరు పెట్టారు. ఈ ఆడిటోరియానికి 2011లో జనరల్ వీ.కే.సింగ్ సంకుస్థాపన చేసారు.[3]
- లక్నోలోని ఉత్తర ప్రదేశ్ సైనిక స్కూలులో ఫుట్ బాల్ టోర్నమెండుకు "లేట్ కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే మెమోరియల్ ఇంటర్ స్కూల్ ఫుట్ బాల్ టోర్నమెంటు" అని నామకరణం చేసారు.[4]
- లక్నోలోని ఉత్తర ప్రదేశ్ సైనిక స్కూలు యొక్క ప్రధాన ద్వారానికి ఆయన పేరు పెట్టారు.
- ఘజియా బాద్ జిల్లా లోని నిర్మిచదలచుకున్న అపార్టుమెంటు సముదాయానికి "మనోజ్ విహారి" గా నామకరణం చేయాలని ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ సంకల్పించింది.
- పూణె లోని కార్డియో థెరపిక్ సెంటర్ హాస్పటల్ వద్ద గల ఆర్మీ క్వార్టర్ కు "కెప్టెన్ మనోజ్ పాండే ఎన్‌క్లేవ్" గా పేరును పెట్టారు.
- నేషనల్ డిఫెన్స్ అకాడమి సైన్స్ బ్లాకును "మనోజ్ పాండే బ్లాకు" గా నామకరణం చేసారు.[5]
- ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నందలి ముఖ్య కేంద్రానికి, ఆయన స్వంత గ్రామానికి "చెప్టెన్ మనోజ్ కుమార్ చౌక్" గా నామకరణం చేసారు.
- ద్రాస్ సెక్టారులోని కార్గిల్ వార్ మ్యూజియం లోని గ్యాలరీకి అయన పేరు పెట్టారు.[6]
డైరీ
మార్చు- ఆయన వ్యక్తిగత డైరీలో "కొన్ని లక్ష్యాలు చాలా విలువైనవి, అవి విఫలమైనా అద్భుతమైనవి" అని రాసాడు.
- ఆయన తల్లి యొక్క స్మృతికి ఆయన: "ఆమె చీకటిలో ప్రకాశవంతంగా మెరిసే నక్షత్రం, అంత ప్రేమను ఎవరు అందిచగలరు" అని వ్రాసాడు.
- నాలుగు వరుసలు గల కవితను పెద్ద అక్షరాలలో రాసాడు: "If death strikes before I prove my blood, I promise (swear), I will kill death."
సినిమాలలో
మార్చుఆయన పాత్రను LOC Kargil చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ నటించారు.
మూలాలు
మార్చు- ↑ National Cadet Corp,Youth in Action. New Delhi: Directorate General National Cadet Corps. 2003. ISBN 8170622980.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 The Param Vir Chakra Winners (PVC), Official Website of the Indian Army, retrieved 28 August 2014 "Profile" and "Citation" tabs.
- ↑ "Infrastructure & Facilities | U.P. SAINIK SCHOOL". www.upsainikschool.org. Archived from the original on 2016-08-13. Retrieved 2016-07-27.
- ↑ "Trophies | U.P. SAINIK SCHOOL". www.upsainikschool.org. Retrieved 2016-07-27.[permanent dead link]
- ↑ "National Defence Academy, NDA Pune | Places of Interest in and around NDA, Khadakvasala". Nda.nic.in. Archived from the original on 2011-09-29. Retrieved 2011-10-17.
- ↑ http://www.rediff.com/news/slide-show/slide-show-1-drass-memorial-invoking-memories-of-kargil-war/20110727.htm#4
ఇతర లింకులు
మార్చు- Captain Manoj Pandey's Website
- Indian Army Webpage
- Manoj Pandey Chowk is at coordinates 26°51′14″N 80°59′40″E / 26.85389°N 80.99444°E