మన్నం మాలకొండయ్య

మన్నం మాలకొండయ్య (జ.1959) ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ.

ప్రాథమిక జీవితం మార్చు

మన్నం మాలకొండయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ నెల్లూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశం జిల్లా) లోని కందుకూరు తాలూకా నలదలపూరు గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మన్నం శ్రీరాములు , రుక్మిణమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. అతను ప్రాథమిక విద్యను నలదలపూరు గ్రామంలో పూర్తి చేసి ఇంటర్మీడియట్ ను గుంటూరు పట్టణంలో ఉన్న జేకేసి కళాశాలలో, బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాడు. అనంతరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఏం. ఏ, న్యాయ శాస్త్రంలో ఎల్.ఎల్.బి, నేరపరిశోధన లో పి.హెచ్.డి పూర్తి చేశాడు.

వృత్తి జీవితం మార్చు

ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం అతను కార్పొరేషన్ బ్యాంక్ లో వ్యవసాయ అధికారిగా వరంగల్ జిల్లాలో 1984 వరకు పనిచేశాడు. 1985 లో సివిల్స్ తొలి ప్రయత్నం లోనే సాధించి ఐపీఎస్ సాధించి ములుగు ఏ ఎస్పీగా పోస్టింగ్ రావడం తో అక్కడ భాద్యతలు స్వీకరించాడు. ములుగు ఏఎస్పీ గా మావోయిస్టుల కార్యక్రమాలు తగ్గించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత వరంగల్ అదనపు ఎస్పీగా, కాకినాడ బెటాలియన్ కామెండెంట్ గా, ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా, ఎస్పీగా , మెదక్ జిల్లా ఎస్పీగా ఇసుక అక్రమ రవాణా, మావోయిస్టుల కార్యక్రమాలు తగ్గుముఖం పట్టడంలో కీలకంగా పనిచేశాడు. గుంటూరు జిల్లా ఎస్పీగా 1994, 1995, 1996లలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, సహకార, పార్లిమెంట్ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమర్థవంతంగా పనిచేశాడు.

అతను కేంద్ర ప్రభుత్వానికి డెప్యూటషన్ మీద విశాఖపట్నం పోర్టు విజిలెన్స్ అధికారికగా భాద్యతలు నిర్వహించిన తరువాత 2001లో గుంటూరు రేంజ్ డి.ఐ. జి గా భాద్యతలు చేపట్టి రేంజ్ పరిధిలో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టించాడు. ఆ తరువాత ఏలూరు రేంజ్ డి.ఐ. జి గా, ఏ.పి ట్రాన్సకో విజిలెన్స్ అధికారిగా, హైదరాబాద్ పేట్ల బూరుజు లోని పోలీసు రవాణా విజిలెన్స్ అధికారిగా , స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ యం.డి గా, పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ గా పనిచేసాడు. పోలీసు శిక్షణ సంస్థ అధికారిగా సమర్థవంతంగా పనిచేసిన వీరు 2014లో రాష్ట్ర విభిజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడటంతో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్ అండ్ యం.డి గా పనిచేసాడు. అనంతరం అతను 2017 -2018 వరకు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో డీజీపీ గా పనిచేశాడు.[1] 2018 లో డీజీపీగా పదవి విరమణ పొందాడు. 33 సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన మాలకొండయ్య చివరి వరకు తన కార్యనిర్వహణ లో ఎటువంటి పక్షపాతం చూపకుండా నిజాయితీగా వ్యవహరించారు.

వ్యక్తిగత జీవితం మార్చు

మాలకొండయ్య గారి సతీమణి ప్రముఖ ఐ. ఏ.ఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య గారు, వీరికి ఇద్దరు సంతానం.

మూలాలు మార్చు

  1. "Dr M Malakondaiah is new Andhra Pradesh police cheif". Deccan Chronicle. 2017-12-31.