మావా బాగున్నావా?
మామా బాగున్నావా 1997 లో విడుదలైన కామెడీ చిత్రం, దీనిని జయకృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థ [1] పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో జయకృష్ణ నిర్మించాడు.[2] ఇందులో రాజేంద్ర ప్రసాద్, నరేష్, రంభ, మోహిని, భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం అందించాడు.[3] ఇది 1994 లో వచ్చిన తమిళ చిత్రం వనజా గిరిజాకు రీమేక్, ఇది 1974 తమిళ చిత్రం ఎంగమ్మ సపతంకు రీమేక్, ఇది అప్పటికే 1975 లో తెలుగులో అమ్మాయిల శపథం పేరుతో పునర్నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.[4]
మావా బాగున్నావా? (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
నిర్మాణం | జయకృష్ణ |
కథ | పంజు అరుణాచలం |
చిత్రానువాదం | కోడి రామకృష్ణ |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్ నరేష్ రంభ మోహిని కోట శ్రీనివాసరావు తనికెళ్ళ భరణి |
సంగీతం | రాజ్ - కోటి |
సంభాషణలు | తోటపల్లి మధు |
ఛాయాగ్రహణం | బి.ఎన్.రావు |
కూర్పు | తాతా సురేష్ |
భాష | తెలుగు |
కథ
మార్చుధనంజయం (కోట శ్రీనివాస రావు) కోటీశ్వరుడు. అతని భార్య సుందరాంబాళ్ అయ్యర్ (కోవై సరళ), ఇద్దరు కుమారులు గోపాల కృష్ణ (రాజేంద్ర ప్రసాద్) పశువైద్యుడు & జానకిరామ్ (నరేష్), డాక్టర్ లతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నాడు. గతంలో ధనుంజయం, తన మేనేజరు ప్రకాశరావు (ఈశ్వర్ రావు) కార్మికుల బోనస్ మొత్తం తీసుకుని పారిపోయాడని ప్రచారం చేస్తాడు. ఆ కారణంగా, ప్రకాశ రావు భార్య పార్వతమ్మ (శుభ) & ఇద్దరు కుమార్తెలను ప్రజలు అవమానిస్తారు. ప్రస్తుతం, ప్రకాశ రావు కుమార్తెలు జయ (రంభ) & విజయ (మోహిని) లు అతడి ఇద్దరు అమాయక కుమారులతో కలిసి అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. జయ విజయలు ధనుంజయంకు ఎలా పాఠం నేర్పుతారు, తమ తండ్రి నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపిస్తారు అనేది మిగతా కథ.
తారాగణం
మార్చు- గోపాల కృష్ణ పాత్రలో రాజేంద్ర ప్రసాద్
- జానకి రామ్‌గా నరేష్
- జయగా రంభ
- విజయగా మోహిని
- ధనుజయంగా కోట శ్రీనివాసరావు
- కాంపౌండర్‌గా బ్రహ్మానందం
- తోకు పాత్రలో కృష్ణుడు
- ప్రీస్ట్‌గా తనికెళ్ళ భరణి
- పోలీస్ ఇన్స్పెక్టర్గా రాళ్ళపల్లి
- తాలిపులుగా సుత్తివేలు
- ప్రకాష్ రావుగా ఈశ్వరరావు
- గౌరీగా భానుప్రియ
- సుందరంబల్ అయ్యర్‌గా కోవై సరళ
- పార్వతమ్మగా శుభ
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "రాముడు మెచ్చిన ఉడత" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్. జానకి | 4:16 |
2. | "చిన్నారి చీకటేళ" | శివ గణేష్ | మనో, చిత్ర | 4:13 |
3. | "ఉద్యోగమిస్తాను" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:17 |
4. | "గాజుల చేతికి మీసం" | వడ్డేపల్లి కృష్ణ | చిత్ర, గాయత్రి | 4:27 |
5. | "ఇది తీరని తీయని దాహం" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, గాయత్రి | 5:00 |
మొత్తం నిడివి: | 22:13 |
మూలాలు
మార్చు- ↑ "Mama Bagunnava (Banner)". Tollywood Times.com. Archived from the original on 2018-10-05. Retrieved 2020-08-20.
- ↑ "Mama Bagunnava (Direction)". Know Your Films.[dead link]
- ↑ "Mama Bagunnava (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-05. Retrieved 2020-08-20.
- ↑ "Mama Bagunnava (Review)". The Cine Bay. Archived from the original on 2018-10-05. Retrieved 2020-08-20.