మయాంక్ యాదవ్

భారత క్రికెటర్

మయాంక్ యాదవ్ భారతీయ క్రికెట్ ఆటగాడు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్‌కు ఆడుతున్నాడు. కుడిచేతి ఫాస్ట్ బౌలర్ గానూ, కుడిచేతి బ్యాటర్ గానూ రాణిస్తున్నాడు.[1][2]

మయాంక్ యాదవ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2002-06-17) 2002 జూన్ 17 (వయసు 21)
న్యూఢిల్లీ, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం Fast bowler
పాత్రBowler
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2022–presentఢిల్లీ
2023–presentలక్నో సూపర్ జెయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ FC List A T20
మ్యాచ్‌లు 1 7 6
చేసిన పరుగులు
బ్యాటింగు సగటు
100s/50s
అత్యధిక స్కోరు
వేసిన బంతులు
వికెట్లు
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు -/- -/- -/-
మూలం: ESPNcricinfo, 6 April 2023

కెరీర్ మార్చు

2022, అక్టోబరు 11న మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున తన ప్రొఫెషనల్, ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[3] 2022, డిసెంబరు 12న హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[4] లిస్ట్ ఎ తర్వాత ఒక రోజు, మహారాష్ట్రకు వ్యతిరేకంగా ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు.[5]

2023 ఐపిఎల్ మార్చు

2023 ఫిబ్రవరిలో, 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ద్వారా రూ. 20 లక్షలకు కొనుగోలు చేయబడ్డాడు. అయితే గాయం కారణంగా 2023 సీజన్‌కు దూరమయ్యాడు.

2024 ఐపిఎల్ మార్చు

2024 మార్చి 30న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ తో ఐపిఎల్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 155.8kphతో బౌలింగ్ చేశాడు.[6] ఆ మ్యాచ్ లో 4 ఓవర్లలో 6.75 ఎకానమీతో 27 పరుగులు ఇచ్చి, మొదటి 3 వికెట్లు తీసి, లక్నో సూపర్ జెయింట్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐపిఎల్ లో తన అరంగేట్రం మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.[7]

మూలాలు మార్చు

  1. "Mayank Yadav". Retrieved 6 April 2023.
  2. Eenadu (1 April 2024). "వచ్చాడో రాకెట్‌ బౌలర్‌". Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  3. "Mayank Yadav makes his professional and T20 debut". Retrieved 6 April 2023.
  4. "Mayank Yadav make his List A debut". Retrieved 6 April 2023.
  5. "Mayank Yadav makes his first-class debut one day after making his List A debut". Retrieved 6 April 2023.
  6. "కొత్త కుర్రాడు.. కట్టిపడేశాడు". EENADU. 2024-03-31. Archived from the original on 2024-03-31. Retrieved 2024-03-31.
  7. "ఆ డెలివరీని మరిచిపోలేను.. తొలి వికెట్‌ ఎప్పటికీ ప్రత్యేకమే: మయాంక్‌ యాదవ్". EENADU. 2024-03-31. Archived from the original on 2024-03-31. Retrieved 2024-03-31.