మయూరి (2015 సినిమా)

మయూరి 2015లో విడుదలైన తెలుగు సినిమా.సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, శ్రీ శుభశ్వేత ఫిలింస్ బ్యానర్ల పై శ్వేతలానా, వరుణ్, తేజ, సివిరావు నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. నయనతార, ఆరి, అంజాద్ ఖాన్, రోబో శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘మాయ’ పేరుతో, తెలుగులో ‘మయూరి’ పేరుతో సెప్టెంబర్ 17, 2015న విడుదలైంది.

మయూరి
దర్శకత్వంఅశ్విన్ శరవణన్
రచనఅశ్విన్ శరవణన్
నిర్మాతశ్వేతలానా, వరుణ్, తేజ, సివిరావు
నటవర్గం
ఛాయాగ్రహణంసత్యన్ సూర్యన్
కూర్పుటి.ఎస్.సురేష్
సంగీతంరాన్ ఎథన్ యోహన్
నిర్మాణ
సంస్థలు
సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, శ్రీ శుభశ్వేత ఫిలింస్
పంపిణీదారులుసి. కళ్యాణ్
విడుదల తేదీలు
2015 సెప్టెంబరు 17 (2015-09-17)
నిడివి
142 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

ఒక అడ్వర్టైజింగ్ కంపనీలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసే మయూరి (నయనతార) కి అర్జున్(అరి) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లైన మూణ్నెల్లకే మయూరి గర్భవతి అవుతుంది. అది అర్జున్ కి ఇష్టం వుండదు. అర్జున్ మయూరిని అబార్షన్ చేయించుకోమంటాడు , దానికి మయూరి నిరాకరించి భర్తతో విడిపోయి జీవిస్తూ ఓ పాపకు జన్మనిస్తుంది. పాపా పుట్టాక మయూరి జీవితంలో వచ్చిన మార్పులేంటి ? చివరకు ఏం జరిగింది ? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, శ్రీ శుభశ్వేత ఫిలింస్
  • నిర్మాత: శ్వేతలానా, వరుణ్, తేజ, సివిరావు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అశ్విన్ శరవణన్
  • సంగీతం: రాన్ ఎథన్ యోహన్
  • సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
  • ఎడిటర్: టి.ఎస్.సురేష్
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోనేరు కల్పన

మూలాలుసవరించు

  1. Sakshi (19 September 2015). "కొత్త సినిమాలు గురూ!". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. The Hindu (18 September 2015). "Mayuri: Aesthetics over the scares" (in Indian English). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.