కోళికోడ్

కేరళలోని నగరం
(కాలికట్ నుండి దారిమార్పు చెందింది)
  ?Calicut
Kozhikode
കോഴിക്കോട്

కేరళ • భారతదేశం
Kozhikode city.jpg
అక్షాంశరేఖాంశాలు: 11°15′N 75°46′E / 11.25°N 75.77°E / 11.25; 75.77Coordinates: 11°15′N 75°46′E / 11.25°N 75.77°E / 11.25; 75.77
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
82.68 కి.మీ² (32 sq mi)
• 1 మీ (3 అడుగులు)
జిల్లా(లు) Kozhikode జిల్లా
జనాభా
జనసాంద్రత
ఆడ-మగ నిష్పత్తి
4,36,556 (2001 నాటికి)
• 5,280/కి.మీ² (13,675/చ.మై)
• 1.061
Mayor M. Bhaskaran
Collector P. B. Salim
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 673 0xx
• +91 (0)495
• KL 11
వెబ్‌సైటు: www.kozhikodecorporation.org/

ఇదే పేరు గల జిల్లా కొరకు కోళికోడ్ జిల్లా చూడండి.

కోళికోడ్ (మలయాళం:കോഴിക്കോട്, pronounced [koːɻikːoːɖ]). కాలికట్ అని కూడా పిలవబడే ఈ నగరము దక్షిణ భారత దేశములో కేరళ రాష్ట్రములో ఉంది.

ఇది కేరళలోనే మూడవ అతి పెద్ద నరగరము మరియు కోళికోడ్ జిల్లా యొక్క ప్రధాన కేంద్రము. సాంప్రదాయ పురాతన పద్ధతులు మరియు మధ్య యుగపు "మసాలా దినుసుల నగరము"గా పేర్కొనబడిన కాలికట్ తూర్పు విభాగపు మసాలా దినుసులకు ఒక ప్రధాన వాణిజ్య నగరంగా పిలువబడింది.[1] కోళికోడ్ అదే పేరు కల ఒక స్వతంత్ర రాజ్యానికి ఒకపట్టి రాజధాని. తరువాత కాలంలో మలబార్ జిల్లాగా ఆ రాజ్యం వ్యవహరించబడింది.

కోళికోడ్ 2001 సంవత్సరపు జనాభా పట్టిక ప్రకారం 436,556 మంది ప్రజలు కలిగి ఉంది.మహానగరపు జనాభా 0.9 మిలియన్ గా నమోదు కావటంతో అది మూడవ అతి పెద్ద నగర సముదాయము మరియు కేరళలోని మూడవ పెద్ద నగరంగా నమోదు అయింది. నివాసాలు,ఆదాయాలు మరియు పెట్టుబడులు మీద ఆధారపడి ఎకనామిక్స్ రీసర్చ్ ఫర్మ్ ఇండికస్ ఎనలైటికా తయారు చేసిన పట్టికలోని వివరాల బట్టి ఇండియాలో కోళికోడ్ రెండవ ఉత్తమ నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది.ఇండికస్ ఆరు విషయాలను దృష్టిలో నిలుకుంది. అవి ఆరోగ్యము,విద్య,వాతావరణము,రక్షణ,ప్రజా సౌలభ్యాలు మరియు వినోద కార్యక్రమాలు.[2] అస్సోచం వారు 2007 లో [3] నిర్వహించిన విచారణ ప్రకారం కోళికోడ్ ఇండియాలోని టయర్-II నగరాలలో ఉద్యోగ సృష్టిలో పదకొండవ స్థానంలో ఉంది. 2004 సంవత్సరములో[4] కోళికోడ్ ఇండియాలోని ప్రథమ చెత్తలేని నగరముగా నిర్ణయించబడింది. "ఆకలిరహిత కోళికోడ్" పధకం జనవరి 2009 లో మొదలయిన తరువాత కోళికోడ్ దేశంలోని ప్ర ప్రథమ ఆకలిరహిత నగరంగా ఖ్యాతికెక్కింది[5]. కేరళ ప్రభుత్వము వారు తలపెట్టిన సైబర్ పార్క్ అభివృద్ధితో IT పరిశ్రమ వారి రాడార్ పరిధిలోనికి కోళికోడ్ వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో తిరువనంతపురం టేక్నోపార్క్ మరియు కొచ్చి ఇన్ఫోపార్క్ బాటలోనే అభివృద్ధి పరచిన మూడవ IT 'హబ్' గా నిలిచిన ఈ పరిశ్రమ 2011 మధ్య కాలంలో [6] మొదలయ్యే అవకాశం ఉంది.

పద చరిత్రసవరించు

కోళికోడ్ అను పేరు, ప్రొఫెసరు కే.వి.కృష్ణ అయ్యర్ ప్రకారం, కోయిల్ (అంతఃపురం) + కోట (కోట) నుండి అనగా 'కోట వంటి అంతఃపురం' నుండి వచ్చింది. ఆ ప్రదేశాన్ని చుల్లిక్కడ్ అని కూడా అంటారు. దాని అర్ధం 'గుబురుగా ఉన్న అడవి' అని. బహుశా బురదగా ఉండే నేల అని కూడా అర్ధమేమో. భాషాపరంగా, మరియు మలయాళంలో మారుతూ ఉంటాయి. కోడ్ అంటే కోట (కొట్ట)అని. ఇతరులు ఆ నగరాన్ని అనేక పేర్లతో పిలిచారు. అరబ్లు దానిని కాలికూత్ అని,తమిళులు ఆ నగరాన్ని కల్లికోట్టై అని, చైనీయులు దానిని కాలిఫో అని పిలిచినా మలయాళీలకు అది ఎప్పుడూ కోళికోడ్ యే. కాలికట్ అనే పదం చేనేత వస్త్రాలలోని ఒక నాణ్యమైన రకమని,అది కోళికోడ్ నుండి బయటకు ఎగుమతి చేయటం జరిగేదని, అందువలెనే ఆ పేరు అలా వచ్చిందని అంటారు. ఇప్పుడు ఆ నగరం యొక్క అధికారిక పేరు కోళికోడ్ అయినా కూడా దానిని సామాన్యంగా ఇంగ్లీషు విధానంలో కాలికట్[7] అని అంటారు.

చరిత్రసవరించు

 
కాలికట్ యొక్క దృశ్యం 1572 నాటి జియార్జ్ బ్రాన్ అండ్ ఫ్రాన్స్ హోగేన్బెర్గ్స్ అట్లాస్ సివిటటేస్ ఆర్బిస్ టెర్రారం నుండి

కోళికోడ్ నగరం ఒక చిత్తడి బాటన అరేబియా తీరాన 1034 A.D.లో నెలకొల్పబడింది.[8] శక్తిమంతమైన చేర రాజ్యం కూలిపోయిన తరువాత అనేక మంది సామంత రాజులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. వారిలో శక్తిమంతులైన వారిలో ఒకడు సామంత రాజు నేడియిరిప్పు యందలి ఇరాడిస్.[9] ఆ నగరం పోలండు చెందిన పోర్లాతిరిస్ తో దీర్ఘకాలం యుద్ధానంతరం ఎరాడిస్ చే స్థాపించబడింది. సముద్రానికి అందుబాటులో ఉండటం ఎరాడి అధినేతకు సహకరించింది.అతను అప్పటికే సమూతిరి (జమోరిన్) గా పిలువబడి, ఆ నగరాన్ని తూర్పు ప్రపంచంలో ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా అభివృద్ధి చేసి, మిరియాలు, వస్త్రాలు, లక్క, అల్లం, దాచెన చెక్క, మైరోబలన్స్ మరియు జేడియోరి వంటి పలు రకాలా వస్తువులతో వ్యాపారం చేశాడు.[10] ప్రపంచంలో అన్ని వైపుల నుండి పెద్దవి, చిన్నవి అనేక రకాల నౌకలు, జంక్ వంటివి కాలికట్ తీరం చేరేవి.[10] రెండు శతాబ్దాల తరువాత వాస్కో డ గామా చే నేతృత్వం వహించబడిన పోర్చుగీస్ నౌకా దళం మే 1498 లో కాలికట్ కు చేరింది.ఇది అంతకు ముందు వచ్చిన వేలాది వానికేమీ భిన్నంగా లేదు.[11] పోర్చుగీస్ జమోరిన్ తో ఏ విలువైన ఒప్పందాన్ని సాధించటంలో విఫలమయ్యి, వారు అరబ్బు వర్తకులతో మరియు జమోరిన్ తో కూడా ప్రత్యక్ష వివాదం ఎదుర్కొన్నారు.[12] స్టీవెన్ వాన్ దర్ హగెన్ చే నేతృత్వం వహించబడిన డచ్చి నౌకా దళం నవంబరు 1604 లో కాలికట్ కు చేరి, ఇండియా తీరంలో డచ్చి వారి ప్రాధాన్యం ఆరంభంలోకి వచ్చింది.[12] డచ్చి వారికి కాలికట్ తో సత్సంబంధాలు ఉండటంతో వారి వ్యాపారం సజావుగా సాగింది.[12] బ్రిటీషు వారు 1615 లో కాలికట్ కు కెప్టెన్ విలియం కీలింగ్ నేతృత్వంలో చేరారు.

1663 లో పోర్చుగీస్ వారి ఆధిపత్యం బలహీనపడటంతో వారు భారత జలాల నుండి తిరోగామించారు. డచ్చి వారు 1795 లో నెపోలియోనిక్ యుద్ధాలలో భాగంగా బ్రిటీషు వారు వారిని కొచ్చిన్లో ఎదుర్కొనేసరికి తుది రోజులకు చేరారు. కొంత కాలం హైదర్ ఆలీ మరియు టిపు సుల్తాన్ ఆధ్వర్యంలో మైసూర్ రాష్ట్రం నుండి ఫిబ్రవరీ 1766 లో దండ యాత్రలు ఎదుర్కొన్నారు. మలబార్ లో వర్ధిల్లుతున్న వాణిజ్య రేవులను యుక్తిగా, ఎలాగయినా తమ స్వాధీనములోకి తెచ్చుకోవాలని ఆ రాజులు తీవ్రముగా ప్రయత్నించారు.[13] 1792 లో బ్రిటీషు వారి చేతిలో ఓడిన తరువాత మైసూర్ యొక్క ప్రతిఘటన అణిగింది. మెడ్రాస్ రాష్ట్రం ఆధీనంలో కోళికోడ్ మలబార్ జిల్లా యొక్క ప్రధాన కేంద్రంగా మిగిలింది. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, మద్రాసు రాజ్య విభాగము మద్రాసు రాష్ట్రంగా మారింది. 1956 లో భాషాపరంగా ఇండియాలో రాష్ట్రాలను విభజించినప్పుడు మలబార్ జిల్లా ట్రావెన్కోర్-కొచ్చిన్ రాష్ట్రంతో కలపబడి క్రొత్త రాష్ట్రమైన కేరళాగా 1956 నవంబరు 1 వ తారీఖున అవతరించింది. మలబార్ జిల్లాను కన్నూర్, కోళికోడ్ మరియు పాలక్కాడ్ గా జనవరి 1 న 1957 లో విభజించారు.

విదేశీ వివరాల ప్రకారం కాలికట్ తొలి రోజులుసవరించు

ఆ రేవు నగరాన్ని దర్శించిన అనేక యాత్రికులు తమ అనుభవాల ప్రకారం ఆ నగరంలో ఉండే పరిస్థితులు చాలా ఆసక్తితో కూడిన విధముగా వర్ణించటం జరిగింది. ఇబెన్ బట్టుట (1342-1347) ఈ నగరాన్ని ఆరు సార్లు దర్శించి, అక్కడి జీవన విధానాల గురించి తన తొలి అనుభూతులు మనకు తెలియచెప్పాడు. అతని ప్రకారం కాలికట్ "మలబార్ జిల్లాలోని గొప్ప రేవులలో ఒకటి" మరియు అక్కడ "ప్రపంచం లోని అన్ని ప్రాంతాల వ్యాపారులు కనిపిస్తారు". అతని ప్రకారం ఆ ప్రాంతపు రాజు "ఒక మతద్రోహి అని అతను రోమ్ లోని హైదారి ఫకీర్ల మాదిరిగా గడ్డం చేసుకుంటాడని....... మహమ్మదీయ వర్తకులలో అధిక భాగం మంది సంపన్నులని వారిలో ఒకరికి ఆ మొత్తం నౌకాదళం కొనగలిగే శక్తి ఉంది". చెంగ్ హొ ఝేంగ్ హీ [14] నాయకత్వంలోని రాజవంశపు చైనీయ నౌకాదళములో భాగమైన మా హువాంగ్ (1403 A.D.)అనే ఒక చైనీయ ముస్లిం నావికుడు ఈ నగరాన్ని ఒక ప్రసిద్ధ వాణిజ్య ప్రధర్శనశాలగా భాసిల్లిందని ప్రపంచము మొత్తం నుండి వర్తకులు వ్యాపారరీత్యా ఇక్కడకు తరచూ వచ్చేవారని ప్రశంసించేవాడు. ముస్లింల యొక్క మతపరమైన అవసరాలు తీర్చటానికి 20 నుండి 30 మసీదులు నిర్మించారని, వర్తకులకు గణాంకన కొరకు తమ చేతి వేళ్ళు, కాలి వేళ్ళు ఉపయోగించే ప్రత్యేక పద్ధతి వాడుకలో ఉండేదని (ఇప్పటికీ ఆ పద్ధతిని ఉపయోగిస్తున్నారు) మరియు వివాహసంబంధంగా వారసత్వం అనుభవించటం కూడా ప్రత్యేకతలుగా అతను అభివర్ణించాడు. అబ్దుర్ రజ్జక్ (1442-43) అను పెర్షియా దేశపు చక్రవర్తి అయిన ష-రోహ్క్ యొక్క దూత, ఆ నగర ఓడ రేవు సమర్ధవంతంగా రక్షింపబడటమే కాక అక్కడ అబిస్సినియా, జిర్బాద్ మరియు జంజిబార్ వంటి పెక్కు దేశాల నుండి తెచ్చిన అత్యంత విలువైన వస్తువులు కూడా ఉండేవి అని పేర్కొన్నాడు. ఇటాలియన్ దేశస్థుడైన నికొలో డే'కోంటి (1445) యే బహుశా కాలికట్ ను దర్శించి, మిరియాలు, లక్క, అల్లం,పెద్ద దాచెన చెక్క, మైరోబలన్స్ మరియు జేదారీ కలిగిన నగరముగా అభివర్ణించిన మొదటి క్రైస్తవ యాత్రికుడు. అతను మొత్తం ఇండియాలోనే, దానిని ఎనిమిది మైళ్ళ చుట్టు కొలత కలిగిన ఒక గౌరవనీయమైన ప్రధర్శనశాలగా అభివర్ణించాడు. ఎతనేశియాస్ నికిట్న్ లేక అఫనేసి నికిట్న్ (1468-74) అను రష్యా యాత్రికుడు 'కాలికట్' ను మొత్తం హిందూ మహాసముద్రానికే రేవుగా వర్ణించి, కాలికట్ ను ఒక పెద్ద బజారుగా చిత్రీకరించాడు. కాలికట్మిని దర్శించిన మిగిలిన యాత్రికులలో ఇటాలియన్ లుడోవిసో డి వార్తేమ[15] (1503-1508) మరియు ద్యుఅర్టే బార్బోసా[16]లు ఉన్నారు.

ఈ యాత్రికుల పూర్తి వివరాలు నిశితమైన విచారణదారునికి ఎంతో విలువైనవి సత్యాలు.ఎందుకంటే అవి మాత్రమే ఇవాళ రోజు రోడ్లు మరియు పెద్ద అంగడుల క్రింద పాతిపెట్టబడిన ఆనాటి ఘనమైన నగరము యొక్క కోటలు, అంతఃపురాలు, గిడ్డంగులు మరియు వ్యాపారాత్మక కేంద్రాల గురించి సమాచారము ఈయగలదు. కోట ఉన్న ప్రాంతంలో ప్రస్తుతము పాత బస్ స్టాండ్ (పాళయం), కూరగాయల మార్కెట్, కార్యాలయాలు, చిన్న చిన్న దుకాణాలు మొదలగువానితో కిక్కిరిసి ఉండి, వాటి క్రింద ఏమి సమాధి చేయబడి ఉందో తెలుసుకోవటం అసాధ్యం చేశాయి.

భౌగోళిక స్థితిసవరించు

కోళికోడ్ దాదాపుగా{0/} నెలకొని ఉంది. {1/} అది ఒక మీటరు (3 అడుగులు) ఎత్తులో తీరం వెంట ఉండి, నగర తూర్పు అంచున 15 మీటర్ల ఎత్తుకు పెరిగి, తీరము వెంట ఇసుకతో అంచులు కలిగిన మధ్య భాగముతో ఉంటుంది. ఆ నగరము తూర్పు మరియు మధ్య భాగాలలో 15 మీటర్ల పొడవు తీరము మరియు చిన్న కొండలు ఉన్న ప్రాంతము ఉంది. కోళికోడ్ కేరళా లోని ఐదు మునిసిపల్ కార్పొరేషన్లలో ఒకటి. అది 1866 సంవత్సరము జూలై 3 వ తారీఖున మునిసిపాలిటీగా అయింది. ఆ ప్రాంతపు జనాభా అప్పట్లో 36,602 మందిగా ఉండేది. వైశాల్యం 28.48 చదరపు కిలోమీటర్లగా ఉండేది. 1962 లో దానిని మునిసిపల్ కార్పోరేషన్ గా మార్చారు. ప్రస్తుతం ఆ కార్పోరేషన్ పరిధి 84.232 చదరపు కిలోమీటర్లు. ఆ నగరానికి పశ్చిమాన అరేబియా సముద్రము ఉండగా, దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో తూర్పున సహ్యాద్రి కనుమలు ఆరంభమౌతాయి.

నగరమంతా సరస్సులు, కాలువలు,సాగర సంగమాలు మరియు చిత్తడి భూములు వ్యాపించి ఉంటాయి. 1848 లో ఉత్తరాన కోరపుళ నదిని దక్షిణాన కళ్లాయి నదితో కలిపే ఉద్ద్యేశంతో నిర్మింపబడిన కానోలి కాలువ వీటిలో ముఖ్యమైనది. ఒక విశాలమైన చిత్తడి నేలలో పెరిగే (వృక్షాల) అడవులు నగరంలోని కళ్ళై నది నుండి ఉత్తరాన ఎరంజిక్కల్ వరకు విస్తరించి నగరానికి జీవనాదారంయ్యాయి. ఈ సందర్భంలో కోటూలి తడి భూములు ముఖ్యమైనవి. ప్రాణులలోని వైవిధ్యము, వాతావరణం యొక్క సమతలము, భూమిలోని జలము మరియు వరదలను అదుపులో ఉంచుకోవటం వంటివాటి వలన, అసమర్ధ నిర్వాహణ వలన, స్వార్ధపూరిత వ్యాపారత్మక దురాశలు మరియు చిత్తడి భూముల ప్రాంతీయ ప్రజల యొక్క అలక్ష్యం వలన కూడా ప్రమాదం అధికమవుతూ వచ్చింది.

సహ్యాద్రి నుండి ఉద్భవించే అనేక నదులు కోళికోడ్ బయట ప్రక్కల ప్రవహిస్తాయి. అవి చలియార్ పుళ, కళ్ళయి పుళ, కోరపుళ, పూనూర్, పుళ (నది) మరియు ఇరవంజ్హి పుళ . వీటిలో దక్షిణ ప్రాంతంలో ప్రవహించే కళ్ళై నది చారిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా కోళికోడ్ కు అత్యంత ముఖ్యమైనవి.


ఆ నగరానికి ఎక్కువ తేమతో కూడిన ఉష్ణ వాతావరణం కలిగి ఉండి, మార్చి నుండి మే నెలల మధ్య ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఒక తాత్కాలిక ఋతుపవనాల ముందు వచ్చే మామిడి చిరుజల్లులు ఏప్రియల్ నెలలో నగరాన్ని తడుపుతాయి. జూన్ మొదటి వారంలో మొదలయిన నైరుతి ఋతుపవనాలు సెప్టెంబరు ఆఖరి వరకు కొనసాగి, నగరానికి ప్రాథమిక వర్షాధారంగా వ్యవహరిస్తాయి. ఆ నగరం ఈశాన్య ఋతుపవనాలు ద్వారా అక్టోబరు రెండవ భాగంలో వర్షం ఆస్వాదిస్తుంది. వార్షిక వర్శాపాతం సుమారు 3,266 మిమి ఉంటుంది. డిసెంబరు ఆఖరిలో, జనవరి మరియు మార్చి నెల చివరిదాకా వాతావరణం అనుకూలంగా ఉండి, ఆకాశం నిర్మలంగా ఉండి, గాలి వేగంగా వీస్తుంది. శీతాకాలం ఎప్పుడైనా చలిగా ఉంటుంది. వాతావరణ పట్టికల ప్రకారం, భారతదేశములోని 12 ప్రాంతాలలో చల్లగానూ,26 ప్రాంతాలలో వెచ్చగానూ, 37 ప్రాంతాలు పొడిగానూ మరియు ఒక ప్రాంతం కోళికోడ్ కంటే తడిగానూ[17] ఉంటుంది. 39.4 డిగ్రీల సెల్సియస్ మార్చి 1975 లో ఇక్కడ నమోదయిన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత. అత్యంత తక్కువగా నమోదయిన ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్. అది 1975 డిసెంబరు 26 లో నమోదయింది.

పౌర పరిపాలనసవరించు

కోళికోడ్ నగరాన్ని కోళికోడ్ కార్పోరేషన్ పరిపాలిస్తుంది. దీనికి మేయర్ అధ్యక్షుడు. దీనికి ప్రధాన కేంద్రము కోళికోడ్.

కోళికోడ్ నగర అధికారులు
మేయర్
శ్రీ ఎం. భాస్కరన్
జిల్లా కలెక్టర్
శ్రీ ఫై.బి. సలీం

కోళికోడ్ లో రెండు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి: కోళికోడ్ ఉత్తరం మరియు కోళికోడ్ దక్షిణం. ఈ రెండూ కూడా కోళికోడ్ (లోక్ సభా నియోజకవర్గం)లో భాగములు.[19]

రవాణాసవరించు

నగరము లోపలకు, వివిధ నగరాలకు, దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణానికి గాను నగరములో సుమారైన రవాణ వ్యవస్థ ఉంది. నగరము లోపల ప్రయాణాలకు ప్రైవేట్ బస్సులు నడుపబడుతున్నాయి. 'సిటి బస్సులు' అని పిలవబడే ఈ బస్సులు ఆకుపచ్చ రంగులో పెయింట్ చేయబడి ఉంటాయి. కార్పరేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలకు క్రమమైన బస్సు సేవలు ఉన్నాయి. నగరములోని మెడికల్ కాలేజ్, బెయ్పోర్, ఫెరోక్, ఎలాతుర్, కక్కోడి మొదలైన వాని నుండి వచ్చే ముఖ్య దారులు మనంచిరలో కలుస్తాయి. నగర బస్సులకు విడిగా బస్సు స్టాండ్ లేదు. అయితే నగరములో మూడు బస్సు స్టాండ్ లు ఉన్నాయి. నగరము చుట్టూ ప్రక్కల ప్రాంతాలకు మరియు పరిసర పట్టణాలకు వెళ్లే అన్ని ప్రైవేట్ బస్సులు పాలయం బస్సు స్టాండ్ నుండి బయిలుదేరుతాయి. పరిసర జిల్లాలకు మరియు పాలక్కాడ్, త్రిస్సూర్, కన్నూర్, కాసర్గోడ్, ఎర్నాకుళం, సుల్తాన్ బతేరి, మలప్పురం వంటి నగరాలకు వెళ్లే బస్సులు ఇందిరా గాంధి రోడ్ లో (మావూర్ రోడ్) ఉన్న క్రొత్త బస్సు స్టాండ్ లో ఉంటాయి. కేరళ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (KSRTC) నడిపే బస్సులు ఇందిరా గాంధి రోడ్ లో (మావూర్ రోడ్) ఉన్న KSRTC బస్సు స్టాండ్ నుండి నడుస్తాయి. చుట్టూ పక్కన ఉన్న పట్టణాలకు, నగరాలకు మరియు ఎర్నాకుళం, కొట్టయం, పతనంతిట్ట, తిరువనంతపురం, కోయంబతూర్, ఊటీ,మధురై, బెంగుళూరు, మైసూరు వంటి నగరాలకు క్రమమైన రీతిలో KSRTC బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ వారు బెంగుళూరు, ఊటీ, మధురై వంటి నగరాలకు క్రమేణా లగ్షరీ బస్సు సేవలు అందిస్తున్నారు. ఈ బస్సులు ప్రధానంగా పాల్యం నుండి బయిలుదేరుతాయి.

మలబార్ ప్రాంతానికి రైళ్ళు 1861 నుండి నడుస్తున్నాయి. అప్పుడే తిరూర్, బెయ్పోర్ మధ్య మొదటి సారిగా రైల్ పట్టాలు వేయబడ్డాయి.[20] దక్షిణ దిశలో తిరువనంతపురం, ఎర్నాకులం, కోయంబతూర్, చెన్నై వంటి నగరాలకు మరియు ఉత్తర దిశలో మంగలూర్, ముంబై, న్యూ ఢిల్లీ వంటి నగారాలకు కోళికోడ్ నుండి రైలు సేవలు ఉన్నాయి. కాలికట్, కన్నూర్ మధ్య రైల్ ట్రాక్ రెట్టింపు చేయడం పూర్తి అయినది. కాలికట్, శోరానూర్ మధ్య పని జరుగుతూ ఉంది.

కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నగరము నుండి 22 కిమీ దూరములో, కొందోట్టి (మాలపురం జిల్లా) లో కరిపూర్ లో ఉంది.

ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండియన్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ మరియు కింగ్ఫిషేర్ వంటి విమాన సంస్థలు ఇక్కడ నుండి చెన్నై, కోయంబతూర్, గోవా, కోచి, ముంబై, తిరువనంతపురానికి క్రమమైన విమాన సేవలు నడుపుతున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్ష్ప్రెస్స్, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, ఒమన్ ఎయిర్, కతార్ ఎయిర్వేస్, బహ్రెయిన్ ఎయిర్, నాస్ ఎయిర్, సౌది అరబియన్ ఎయిర్లైన్స్ మరియు ఎతిహాడ్ ఎయిర్వేస్ ఇక్కడనుండి అబూ ధాబి, అల-ఐన్, బహ్రెయిన్, దోహ, దుబాయ్, మస్కట్, సలలః, షార్జా, దంమం, జెడ్డా, కువైట్, టెల్ అవివ్ లకు అంతర్జాతీయ విమానసేవలు నడుతున్నాయి.

ఆర్థిక వ్యవస్థసవరించు

కేరళలోని ముఖ్య వాణిజ్య కేంద్రాలలో కాలికట్ ఒకటి. ఈ నగర ఆర్థిక వ్యవస్థ వ్యాపారము మీద ఆధారపడి ఉంది.

నగరములోని పురుషుల జనాభాలో ఎక్కువ మంది మధ్య తూర్పు దేశాలలో ఉద్యోగం చేస్తూ, తమ సంపాదనను తమ సొంత ఇంటికి పంపించటమే ఈ నగరము యొక్క ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర వహిస్తుంది.

ఇటీవల కాలములో కాలికట్లో భవన నిర్మాణ రంగము గొప్ప పురోగతి సాధించింది. ఈ మధ్య సంవత్సరాలలో మాల్ ల సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనము.

(మావూర్ లో) బిర్లా IT పార్క్, సైబర్ పార్క్, (కినలూర్ లో) మలేషియన్ శాటిలైట్ నగరము నగరములో నిర్మించనున్న ఇతర పథకాలలో కొన్ని. 400 ఎకరాలు విస్తీర్ణములో ఒక పారిశ్రామిక పార్క్ స్థాపించడానికి KINFRA పధకం వేస్తూ ఉంది.

జనాభా వివరాలుసవరించు

As of 2001భారత దేశపు జనగణన,[21] ప్రకారం కోళికోడ్ జనాభా 436,530 గా ఉంది. ఈ నగరము కేరళలో మూడవ అతి పెద్ద నగరముగా ఉంది. 2010 నాటికి నగర జనాభా 440,367 కు పెరుగుతుందని అంచనా. కోళికోడ్ లో ప్రతి 1000 పురుషులకు సుమారు 1055 మహిళలు ఉన్నారు. జనాభాలో 53% పురుషులు కాగా, మిగిలిన 47% స్త్రీలు ఉన్నారు. కోళికోడ్ లో సగటు అక్షరాస్యత శాతం 92.24%గా ఉంది (దేశీయ సగటు 59.5%). పురుషుల అక్షరాస్యత శాతం 96.6%గా ఉంటె, మహిళల అక్షరాస్యత శాతం 90.6%గా ఉంది. నగర జనాభాలో 11% మంది 6 సంవత్సరాలంటే తక్కువ వయస్సు గల వారు.

ప్రజలుసవరించు

కోళికోడ్ లో బహుళజాతి, బహుళమత సంస్కృతి మధ్యయుగ కాలము నుండే ఉంది. హిందువులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తరువాత ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు.[22]

హిందువులలో అన్నిరకాల ఆస్తిక మరియు నాస్తిక నమ్మకాలు కలిగినవారు ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, శివ మరియు ఇతర హిందూ దేవుళ్లు, దేవతలని పూజిస్తారు. చాలా ప్రదేశాలలో స్థానిక దేవుళ్లు, ఎక్కువగా దేవతల (దేవి) ఆలయాలు ఉన్నాయి. తెయ్యం, తిర వంటి పండగలు మరియు ఒట్టంతుల్లాల్, కథాకళి వంటి కళాప్రదర్శనలు వరుస క్రమంలో ఆలయ ప్రాంగణాలలో జరుగుతాయి. అనేక ఆలయాలలో వేలిచప్పాడ్ అని పిలవబడే దేవస్థానాలు ఉన్నాయి. పాముని పూజించడం మరియు పూర్వికులని పూజించడము కూడా ఆచరించబడతాయి.

కోళికోడ్ లో ముస్లింలు మాప్పిల లని పిలవబడుతారు. కోళికోడ్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం "వీరిలో అత్యధిక మంది షాఫీ సిద్ధాంతాన్ని పాటిస్తున్న సున్నీలు".[22] ముస్లీం లలో దావూది బొహ్ర ల వంటి చిన్న మత సమాజాలు కూడా ఉన్నాయి.[23] నగరములోని చారిత్రాత్మిక ప్రాంతాలలో నివసిస్తున్న అనేక ముస్లింలు స్త్రీ వంశావళిని పాటిస్తున్నారు. వీరు మిక్కిలి దైవభక్తి కల వారు.[24] కేరళలో 52 CE లోనే క్రైస్తవమతం ప్రవేశించిందని నమ్మబడుతున్నప్పటికి, 15వ శతాబ్దములో పోర్చుగల్ వారు రాక తరువాతనే క్రైస్తువుల సంఖ్య పెరగడం మొదలయింది. ట్రావన్కోర్, కోచ్చిన్ నుండి కొందరు క్రైస్తవలు జిల్లాలోని కొండ ప్రాంతాలకు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు.[24]

ఆధునిక కాలానికి ముందు నుండే కోళికోడ్ లో అనేక జాతుల వారు, ప్రాంతాలవారూ ఉండేవారు. వీరిలో అనేక మతాల వారు తమ యొక్క సాంప్రదాయక వృత్తులని, ఆచారాల్ని 20వ శతాబ్దము వరకు కూడా పాటిస్తూ ఉండేవారు. వీటిలో కొన్ని:కోసవన్ (కుమ్మరివాడు), మన్నన్ లేక వన్నాన్ (ధోబి), పులయన్ (రైతు కూలి), చలియన్ (నేతపనివాడు), చెట్టి (వర్తకుడు), తియ్య (తాటి చెట్లుపెంపకందారుడు), గనక (జ్యోతిష్యుడు), వేట్టువన్ (ఉప్పు తయారు చేసేవాడు), పానన్ (మాంత్రికుడు), ఎరావల్లన్ (కట్టెలు, గడ్డి మోసేవాడు), కమ్మలలు, పరయన్ మొదలగువారు[25]. నగరంలోని హిందూ దేవాలయాల చుట్టూ అనేక మంది బ్రాహ్మణులు కూడా నివసించేవారు. తమిళ బ్రాహ్మణులు, గుజరాతీలు, మార్వాడీ జైన్లు వంటి వివిధ మతస్తులు వివిధ కాలాలలో ప్రాంతీయులుగా మారి, నగరములోని వారి యొక్క ఆలయాల చుట్టూ నివసించేవారు. కోళికోడ్ యొక్క చరిత్ర అన్ని మతాల యొక్క చరిత్ర. అయితే, కాలికట్ చరిత్రపై అత్యధిక ప్రభావం చూపిన సామాజిక వర్గాలు, నాయర్లు మరియు మప్పిలాలు.

కాలికట్ లో నాయర్లు పరిపాలకులుగా, పోరాట యోధులుగా మరియు భూస్వాములుగా ఉండడం ఆరంభించారు. జమోరిన్ వద్ద కోళిక్కొట్టు పతినాయిరం (కోళికోడ్ కు చెందిన పది వేలమంది) అని పిలవబడ్డ పదివేల మంది నాయర్ల బలగం ఉండేది.వీరు రాజధానిని పరిరక్షిస్తూ, నగర పరిపాలనకు సహాయ పడేవారు. ఎరానాడ్ యువరాజుగా అతని ఆధీనంలో, కోళిక్కొట్టు ముప్పతినాయిరం (కోళికోడ్ కు చెందిన ముప్పైవేలమంది) అని పిలువబడ్డ 30,000 నాయర్లు కలిగిన బలగం కూడా ఉండేది. ఆత్మహత్య బలగాల (చావేర్) సభ్యులుగా కూడా నాయర్లే ఏర్పడ్డారు. రాజధానిలోను దాని పరిసరాలలోనూ సంపన్నపరులైన నాయర్లు తరవాడ్ గృహాలను నిర్మించుకున్నారు. నగరములోని అనేక నాయర్లు వ్యాపారస్తులుగా కూడా ఉండేవారు. ఆవులని చంపడం, రాజుని విమర్శించడం వంటి పెద్ద నేరాలకు తప్ప నాయర్లను కారాగారంలో వేయడం గాని దండించడానికిగానీ వీలు ఉండేది కాదు.[26] కోళికోడ్ లోని మాప్పిల వర్గం వారు నగరము యొక్క సైన్య, ఆర్థిక మరియు రాజకీయ వ్యహరాలలో ముఖ్య పాత్ర వహించేవారు. వీరు ముఖ్యంగా కుట్టిచిర, ఇడియాన్గర ప్రాంతాలలో స్థిరపడ్డారు. వీరి యొక్క విలాసవంతమైన నివాస గృహాలు నాయర్ల, తియ్యాల తరవాడ్ గృహాల మాదిరిగానే ఉండేవి. ఇద్దరు ఘాజీలు ఆధ్యాత్మిక గురువులుగా గుర్తింపు పొందారు. మాప్పిలు ఇంత గొప్పగా స్థానిక సమాజంతో కలిసి పోవడం బార్బోసా వంటి పర్యాటకులకు వింతగా తోచింది. మాప్పిలు నాయర్ల భాష మాట్లాడి వారి మాదిరిగానే ఉండేవారు (గుండ్రంగా ఉండే టోపీలు మరియు పొడవాటి గడ్డాలు తప్ప)[25].

తమిళ బ్రాహ్మణులు (పట్టార్) ప్రధానంగా తలి శివ ఆలయం పరిసరాలలో స్థిరపడి ఉన్నారు. రాజుల మీద ఆధారపడి వంటవావారిగా, దూతలుగా, బట్టల వ్యాపారులుగా మరియు వడ్డీ వ్యాపారులగా వీరు కాలికట్ చేరారు.[12] వారు తమ తమిళ భాషను మరియు ఉచ్చారణను, కులాచారాలను ఇప్పటికీ నిలుపుకున్నారు. గుజరాతి సమాజం వారు ఎక్కువగా బిగ్ బజార్ (వేల్లియంగడి) లోని జైన్ ఆలయ పరిసరాలలో స్థిరపడ్డారు. అధిక సంఖ్యలో సంస్థలు ముఖ్యంగా బట్టలు మరియు మిటాయి దుకాణాలకి వారు స్వంతదారులు. వారు 14వ శతాబ్ద ప్రారంభములోనే కాలికట్ కు వచ్చి ఉండవచ్చు. వీరు హిందూ మతమునకు లేదా జైన మతమునకు చెందినవారు. వడ్డీ వ్యాపారం చేస్తున్న కొన్ని మార్వాడీ కుటుంబాలు కూడా కాలికట్ లో ఉన్నాయి.

సందర్శనాసక్తి మరియు చారిత్రాత్మిక ప్రాముఖ్యత కలిగిన స్థలాలుసవరించు

కోళికోడ్ సముద్ర తీరం
 
దక్షిణం వైపు నుండి కాలికట్ సముద్రపు తీర దృశ్యం

స్థానికలకు అత్యంత ఆకర్షణీయమైన ఆటవిడుపు స్థలము, సముద్ర తీరం. తీరాన్ని అందంగా మార్చే పనులు, సరిగా లేని తీర ప్రాంత నిర్వాహణ వంటి అంశాలు ఉన్నప్పటికి, ఆ సముద్ర తీరం చూడాటానికి ఆకర్షనీయంగా ఇంకా నాశనం చేయబడకుండా ఉంది. బీకరమైన నౌకా యుద్ధాలు, సుదూర ప్రాంతాలనుండి నౌకల రాక వంటి అనేక చారిత్రాతిమిక సంఘటనలు ఈ తీరములో జరిగాయి. జామోరిన్ సభలో సంస్కృత కవి అయిన ఉద్దండా ఈ విధంగా చెప్పారు: "ఐశ్వర్యానికి దేవత యొక్క తండ్రి అయిన సముద్రము [లక్ష్మికి మరో పేరు ఇందిరా], తన కూతురు కుక్కటక్రోడ లో [కోళికోడ్ కు సంస్కృత పధం] స్థిరపడినది చూసి, ఈ స్థలానికి విచ్చేసి ఒక నౌకలో నగలు తీసుకువచ్చి బహుకరించాడు."[27]మహాత్మా గాంధీ, ఖాన్ అబ్దుల్ ఘఫ్ఫార్ ఖాన్, ఇందిరా గాంధీ మరియు కృష్ణ మీనన్ వంటి దేశ నేతలు ఇక్కడనుండి జనమును ఉద్దేశించి ప్రసంగించారు.

'బీచ్ రోడ్' అని పిలవబడే ఇవాన్స్ రోడ్ పేరుని జనవరి 1934లో మాహాత్మ గాంధీ పర్యటన అనంతరం, గాంధి రోడ్ గా మార్చబడింది. శిథిలమైన స్థితిలో ఉన్న రెండు రేవులు సముద్రము లోపల చొచ్చుకు పోతూ కనపడుతున్నాయి. ఉత్తర దిక్కులో ఉన్న 'ఇరన్ స్క్రూ-పైల్' రేవు 1871లో నిర్మించబడింది400 ft long (120 m). ఇది 'T' ఆకారములో ముగిస్తుంది. ఈ రేవులలో ఎన్నో క్రేన్ లు సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర ద్రవ్యాలను ఆడెన్, జినోవ, ఓస్లో, లండన్, బ్రేమేన్, హంబర్గ్, న్యూ యార్క్ వంటి విదేశీ వాడరేవులకు వెళ్తున్న నౌకలలో ఎక్కించేవారు. ఉత్తర రేవుకు సమీపములో ఒక పిల్లల పార్కు, నావికుల స్మారక చిహ్నం కలిగి ఉన్న ఒక దీపస్తంభం, సముద్రచేపల ప్రదర్శన మరియు లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న ఒక ఉద్యానవనం ఉన్నాయి. లయన్స్ పార్క్ కు మరింత ఉత్తర దిశలో మురికిగా ఉన్న ఒక చేపలు పట్టే స్థలము ఉంది. ఇక్కడే ఒకప్పుడు ఫ్రెంచ్ స్థావరాలు, కర్మాగారాలు కలిగి ఉన్న ఒక ఫ్రెంచ్ లోగే ఉండేది. దక్షిణాన ఉన్న రేవు సమీపములో 'గుర్రము ఎగిరే స్థలము' అనే ఒక స్థలము ఉంది. ఇక్కడ గుజరాత్, అరబియా నుండి తీసురాబడిన గుర్రాలు నీటిలో దూకి, ఈతకొట్టి తీరానికి చేరుకొని తమ ప్రతిభ చూపిస్తూ అమ్మడానికి ప్రదర్శించబడేవి. జాలర్లు తమ చిన్న పడవలలో సముద్రము లోపల వెళ్ళడం, అలలతో పోట్లాడి, చేపలతో తిరిగి రావడం వంటి దృశ్యాలతో ఈ తీరం చూడ ముచ్చటగా ఉంటుంది.

వేలియంగడి (బిగ్బజార్)

వేలియంగడి అనునది పర్యాటకులకు 'ఆసక్తికరమైన ప్రదేశాలలో' ఒకటి కాదు. ఆ రొద హడావిడి మరియు వేడిమి కలిగిన ఇరుకు దారులు ఏ పర్యాటకునినైనా ఇబ్బంది పెట్టక మానవు. అయినా కూడా 600 సంవత్సరాల చరిత్ర[7] కలిగిన ఆ ప్రాంతపు దారి ఇంకా కూడా నగరం లోని ప్రధాన వ్యాపార కేంద్రాలలో ఒకటిగా ఉపయోగింపబడుతూ గర్వించదగిన రీతిలో ఉంది. వందల సంవత్సరాల కాలంలో ఉత్పన్నమైన క్రొత్త తరహా చిహ్నాలు ఉన్నా కూడా, నగరంలోని ఈ రద్దీ ప్రదేశము మధ్య యుగంలోని ఆర్థిక కేంద్రమైన కాలికట్ అందలి రోజు వారీ మనుగడను గమనించటానికి మంచి అవకాశం ఇస్తుంది. ముస్లింలు, జైనులు మరియు హిందు సేట్లు, గుజరాతి మరియు మార్వాడీ వడ్డీ వ్యాపారులు, తమిళ మరియు ఆంధ్రా చెట్టిలు అందరూ తమ తమ వ్యాపారాలతో హడావిడిగా, శతాబ్దాల క్రితం వలెనే ఉండటం మనకు కనిపిస్తుంది. 1403 సంవత్సరములో జ్హేంగ్ హి నావికా దళం లోని మా హువాంగ్ గమనించిన విధముగా వర్తకులు మరియు లెక్కలు వ్రాయువారు కూడా ఒక ప్రత్యేకమైన చేతి వేళ్ళ ద్వారా లెక్కించు ఒక ప్రక్రియను ఇప్పటికీ ఉపయోగిస్తారు. కథనాల ప్రక్రారం మంగట్ అచన్ అనబడే జమోరిన్ యొక్క తొలి ప్రధాన కార్యదర్శి, సుదీర్ఘ కాలం తపస్సు ఒనరించిన తరువాత సంపదకు దేవతైన లక్ష్మీ దేవి అతనికి ప్రత్యక్షమైనదట. అప్పుడతను తాను తిరిగి వచ్చే దాక ఆమెను అక్కడే ఉండటానికి ఒప్పించి, ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడట. తాను అతనికిచ్చిన వాగ్దానం భంగపరచలేక ఆమె వేలియంగడిలోనే ఎప్పటకీ ఉండిపోయిందట.

మనంచిర మరియు పరిసరాలలోని సంస్థలు

 
మనంచిర స్క్వేర్ యొక్క ప్రధాన ప్రవేశ మార్గం
 
కాం ట్రస్ట్ నుండి మనంచిర యొక్క దృశ్యం

మనంచిర నగర మధ్య భాగంలో ఉండే ఒక పెద్ద చెరువు. మనంచిర లేక మన విక్రమన్ చెరువు (మనం లేక మన విక్రమన్ అనేది జమోర్న్ల యొక్క పట్టాభిషేకం పేరు) మొత్తం అంతఃపుర భావన సముదాయానికి (ఇదివరలో కొట్టపరంబు స్త్రీల మరియు పిల్లల ఆసుపత్రి వద్ద ఉన్నది) ఉన్న త్రాగు నీటి సరఫరా చేస్తుంది. మనంచిర యొక్క పరిసరాలలో అనేక ముఖ్యమైన సంస్థలు ఉన్నాయి. టౌన్ హాల్ (సాల్ట్ అక్బరీ టౌన్ హాల్ ఇన్ గతంలో పిలువబడినది) ఉప్పు వర్తకులచే 1891 లో నిర్మింపబడి, తదుపరి కాలమైన స్వాతంత్ర్య సమరంలోనూ, తరువాత్ కూడా అనేక ప్రముఖ అలజడులకు మరియు వేడుకలకు నెలవుగా నిలిచింది. పట్టలపల్లి లేక 'మిలటరీ మసీదు'ను మొదట్లో మైసూరు సైనికులు 'మైసూరు దాడి' సందర్భంగా మైసూరు అంతఃపురాన్ని ముట్టడి చేసినప్పుడు కట్టించారు. జర్మనీకి చెందిన బేసెల్ మిషన్ 1884 లో కాంట్రస్ట్ టెక్స్టైల్ ఫాక్టరీ (గతంలో కామన్వెల్త్ చేనేత కర్మాగారము)ని స్థాపించింది. మనంచిరకు పశ్చిమాన C.S.I. చర్చి, బేసెల్ మిషన్ కాంప్లెక్స్ మరియు BEM (బేసెల్ ఎవాన్జలికల్ మిషన్) అమ్మాయిల స్కూలు (1848) ఉన్నాయి. జమోరిన్ రాజు యొక్క అంతఃపురం యొక్క ప్రాంగణం అయిన మనంచిర మైదానంతో పాటు పాతదైన అన్సారీ తోట (స్వాతంత్ర్య సమరయోధుడు అన్సారీ పేరు పెట్టబడిన)ను జత చేసి 'మనంచిర స్క్వేర్' అనబడు చక్కని నిర్వాహణ కల ఒక ఉద్యానవనమును అభివృద్ధి పరచారు. దానికి ఒక పచ్చటి తివాచీ వంటి పచ్చిక బయలు ఉండి కంచె వలె లతెరైట్ తో చెక్కిన గోడలు ఉన్నాయి. ఆ మొత్తం భావన సముదాయము చుట్టూతా 'కాలనీ వారి పద్ధతిలో' రూపొందించిన 250 దీపస్తంభాలు ఉన్నాయి. ఆ 'స్క్వేర్' కు ఒక కృత్రిమమైన సెలయేరు, ఒక సంగీతపు ఫౌంటైను, ఒక ఓపెన్-అయిర్ థియేటర్ మరియు ఒక సంగీతపు వేదిక ఉన్నాయి.

SM రహదారి

S.M. రహదారి ఒక సందడిగల వాణిజ్య మరియు వ్యాపార బాట.అది మనంచిర స్క్వేర్ కు ఉత్తరాన ఉంది. స్వీట్ మీట్ అను పేరు ఒక రకమైన మిటాయి (ప్రాంతీయంగా 'హల్వా' అని పిలుస్తారు) నుండి ఉత్పన్నమయిందని అంటారు. ఐరోపా వర్తకులు దానిని 'స్వీట్ మీట్' అని పిలిచేవారు.[28] S.M. రహదారి వేలియంగడి దారుల వలే దాదాపు 600 సంవత్సరాల క్రితము ప్రారంభించబడి, బహుశా నివాస గృహాలు మరియు గుజరాత్ నుండి వచ్చిన మిటాయి తయారీదార్ల దుకాణాలతో నిండి ఉండేది. అంజుమాన్ అనబడు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న పార్సీ శ్మశానము బహుశా 17 వ శతాబ్దములో నిర్మించబడి ఉంటుంది. అది ఇక్కడే నెలకొల్పబడి విలియం లోగాన్ యొక్క మలబార్లో వివరించబడింది.[29]

సరోవరం పార్క్

సరోవరం అనబడేది కానోలీ కెనాల్ ప్రక్కనే పర్యావరణమునకు అనుకూలముగా అభివృద్ధి చేయబడింది. ఇది పర్యావరణము దెబ్బ తినకుండా రూపొందించబడిన పార్కు. ఇక్కడ నిర్మాణము సాంప్రదాయక కేరళ శైలిలో ఉంటుంది. సాయంకాల సమయాల్లో ఉల్లాసంగా గడపడానికి ఇది నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ స్థలము.

తలి శివ ఆలయం

జామోరిన్ పోషించిన రెండు బ్రాహ్మణుల శైలి ఆలయాలలో ఒకటి ఈ తలి శివ ఆలయం (ఇంకొకటి వలయనాట్టు కవు ). ఈ రోజు కూడా ఈ ఆలయం ప్రసిద్ధ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా ఉంటుంది. ఆలయం ఏ నాటికి చెందినదనే విషయము అనిశ్చయంగా ఉన్నప్పిటికి, ఈ ఆలయము బహుశా నగరము స్థాపించబడినప్పుడే అనగా 12వ శతాబ్దము లోగాని దానికి ముందు గాని స్థాపించబడి ఉండవచ్చు. ఆలయము చుట్టూ అతి పెద్ద గోడలు ఉన్నాయి. ఈ గోడలు 'ఏనుగు బొజ్జ' (ఆన పల్ల) మాదిరిగా, అడుగు భాగము వెడల్పుగాను పై భాగం సన్నగాను ఉంటాయి. ఈ ఆలయము యొక్క రెండు చెరువులలో ఒకటి ఆలయానికి కుడి వైపు ఉంది. భారతీయ మీమాంస, ప్రభాకర మీమాంస, వేదాంత మీమాంస మరియు వ్యాకరణకు చెందిన గొప్ప పండితులు మరియు తత్వవేత్తలు హాజరయ్యే రేవతి పట్టాథనం అనే వార్షిక 'పండితుల పోటి' ఈ ఆలయములోనే జరుగుతుంది. కృష్ణ ఒకిల్ (మితవాది పత్రిక సంపాదకుడు) మరియు న్యాయవాది మంజేరి రామ అయ్యర్ నిర్వహించిన 1911 నాటి కుల-వెతిరేక ఉద్యమం ఈ ఆలయములో జరిగింది. ఆలయానికీ చెరువుకు మధ్య ఉన్న రోడ్డుని 'తక్కువ కులానికి చెందినవారు' వాడటానికి హక్కు కోరుతూ ఈ ఉద్యమం జరిగింది.

పన్నియంకర భగవతి ఆలయం

కల్లాయి నదికి దక్షిణం వైపు ఉన్న కొండ మీద ఉన్న భగవతి ఆలయం, చరిత్రకారులకు తెలిసిన కాలికట్ కాలానికి ముందునుండే ఉన్న రెండు ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం నగర స్థాపనకు కనీసం రెండు శతాబ్దాల ముందే నిర్మించబడింది. సేరిమాన్ పెరుమాళ్ పాలన సమయములో పోలతిరి పరిధిలోకి ఈ ప్రాంతం వచ్చి ఉంటుంది. చేర కాలపు భవనం మాదిరిగానే, ఒక చదరపు గర్భగృహ మరియు మండప ఈ ఆలయములో ఉన్నాయి. ఒక కుర్రంబలం మరియు ప్రకార (బయటి గోడలు) కూడా ఉండి ఉండవచ్చు. అయితే అవి ఇప్పుడు లేవు. 10-11వ శతాబ్దము A.D.కు చెందిన రెండు నల్లరాళ్ళు ఇటీవల లభ్యమయ్యాయి. వీటిలో పాత మలయాళం భాష అయిన వట్టెళుతులో మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయి. వీటిలో ఒకటి, 1021 A.D.లో పట్టాభిషేకం చేసుకున్న చేర రాజు రవి కోట భూమిని దానముగా ఇచ్చిన విషయము గురించినది.[30] ఈ శాసనములో వాడబడిన కొన్ని పదాలు: అధికారార్ (అధికారులు), అల్కొయిల్ (రాజు యొక్క ప్రతినిధి), పోడువాల్ (ఆలయ కార్యకర్త) అవిరోధం (ఏకగ్రీవ పరిష్కార విధానము), కలం (పాత కొలత) మొదలగునవి. రెండవ శాసనం 883-913 A.D.కు చెందినది. దీంట్లో 'పరియంకారై' కు చెందిన తలియార్ మరియు తలి అధికారికల్ వారు పటారి (దేవత) ఆలయములో ఏడు తిరువక్కిరం (పవిత్ర విందు) నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం గురించినది. చేరమాన్ పెరుమాళ్ యొక్క ప్రధాన రాణి యోక్కన్ కూతురుకు చెందిన కొంత భూమిని తిరు అమ్రిటు (పవిత్ర విందు) జరపడానికి ఇవ్వడం గురించినది మూడవ శాసనం.

తిరువన్నుర్ శివ ఆలయం

ఈ పురాతనమైన మరియు సుందరమైన శివాలయం అప్సైడల్ గర్భగ్రిహ కలిగి ఉండి చోళుల శైలి స్తంభాలు, పిలాస్టర్ లు, పంజరలు మరియు వ్యలిముఖాలు కలిగి ఉంది. గర్భగుడిలో ఏ మార్పు గాని రిపేర్లు గాని చేయకుండా అలాగే మంచిగా కాపాడబడుతున్నది. రాజ రాజ చేర యొక్క ఎనిమిదో పాలనా సంవత్సరములో తిరుమన్నుర్ పతరాకర్ కు భూదానం ఇచ్చినట్లు ఒక శాసనం సూచిస్తుంది. ఈ శాసనం, 1044 A.D. నాటిదని గుర్తించబడింది. ఆలయములో దేవుడు ఒక జైన తీర్ధంకరుడుగా అనిపిస్తుంది. (కేరళ లోని కొడున్గాల్లూర్ లో ఉన్న ముఖ్యమైన జైన గుడి అయిన తిరుక్కునవాయే యొక్క శిక్షకు అర్హమైన అంశాలు సూచించబడ్డాయి కనుక). 11వ శతాబ్దములో, జామోరిన్ ల రాకకు ముందు ఈ జైన ఆలయం శివాలయముగా మార్చబడి ఉండవచ్చు.[31] అప్సైడల్ నిర్మాణం మరియు ఇతర అంశాలు ఈ కాలానికి చెందినవే.

కప్పాడ్ సముద్రపు తీరం
 
కప్పడ్ సముద్రపు తీరం
దస్త్రం:Kappkadavu pookkayil.jpg
1498లో వాస్కో డా గామా కప్పడ్ లో ఇక్కడే దిగాడు.

కప్పాడ్ (కప్పక్కడవు) సముద్రపు తీరం, కోళికోడ్ కు ఉత్తరానా 16 కిమీ దూరములో కన్నూర్ రోడును ఆనుకుని తిరువాంగూర్ లో ఉంది. ఇది ఒక రాళ్ళతో కూడిన సుందరమైన సముద్రపు తీరము. పర్యాటకులకు మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. 1498 మే 27 నాడు వాస్కో డా గామా మూడు ఓడలు, 170 మందితో ఇక్కడే దిగాడు. ఈ 'చారిత్రాత్మిక రాక' కు గుర్తుగా ఇక్కడ ఒక స్మారక చిహ్నం నిర్మించారు. అయితే పోర్చుగల్ కు చెందిన ఈ నావికుడుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వ దాన్ని పలువురు చరిత్ర రచయితులు ప్రశ్నిస్తున్నారు. కాలికట్ తీరానికి చేరుకున్న వందలాది వర్తకులలో ఆతను కూడా ఒకడు అని వీరందరికీ పోర్చుగీస్ మాట్లాడే ఒక అరబ్ దారి చూపించాడని వారు చెపుతున్నారు.[32][33] సముద్రాన్ని చూస్తూ కొండ మీద ఉన్న ఒక పురాతనమైన ఆలయం ఈ ప్రాంతానికి మరొక ఆకర్షణ.

బెయ్పూర్

కాలికట్ కు 10 కిమీ దూరాన చలియార్ నది ముఖద్వారములో ఉన్న ఒక చిన్న వాడరేవు పట్టణము, బెయ్పూర్. పురానతనమైన నౌక-నిర్మాణ పరిశ్రమకు బెయ్పూర్ ప్రసిద్ధి. ఇక్కడే మధ్య కాలములో ప్రసిద్ధంగా ఉన్న ఉరు అనబడే వాణిజ్య నౌకలు నిర్మించబడ్డాయి. వీటిని ఇప్పటికి అరాబులు వాణిజ్యానికి మరియు పర్యాటనలకు వాడుతూ ఉన్నారు. ఈ స్థలము పూర్వము వయ్పుర మరియు వదపరప్పనాద్ అనే పేర్లతో పిలవబడేది. తిప్పు సుల్తాన్ ఈ పట్టాణానికి "సుల్తాన్ పట్టణం" అని పేరు పెట్టాడు. ఇది కేరళ లోని ముఖ్య వాడరేవులో ఒకటి. కొన్ని శతాబ్దాలపాటు ఇది ఒక ప్రసిద్ధ వాణిజ్య కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం శితిలమైన స్థితిలో ఉన్న పరప్పనాద్ రాజుల యొక్క కోవిలకం (రాజభవనం) మరియు ఒక చిన్న బషీర్ మ్యుజియం (రచయిత వైకొం ముహమ్మద్ బషీర్ యొక్క పూర్వ నివాస ఇల్లు) ఇక్కడ ఉన్నాయి. సముద్ర తీరం వైపు ఒక పెద్ద భవన సముదాయం ఉంది. ఇక్కడ ఒక వాడరేవు, ఒక పడవలు నిలుపు స్థలము, ఒక చేపలు దించే ప్లాట్ఫారము, ఒక బ్రేక్వాటర్ పధకము, సాగరసంభందమైన వస్తువల దుకాణము మరియు నౌకలని పగలకొట్టే సదుపాయం ఉన్నాయి. చేపలు పట్టే పడవలకు వీలుగా ఉండటానికి మానవులు నిర్మించిన రెండు సముద్ర-పొడిగింపు స్థలాలు ఉన్నాయి. రాళ్ళతో నిర్మించిన 2 కిమీ బ్రేక్వాటర్ మరొక ఆకర్షణ. చాలియార్ కు దక్షిణ దిశలో బెయ్పూర్ లైట్ హౌస్ ఉంది.

సందర్శించదగిన ఇతర స్థలాలు
 • ఈస్ట్ హిల్, కోళికోడ్ లో ఉన్న ఆర్ట్ గ్యాలరీ మరియు కృష్ణ మీనన్ మ్యూజియం
 • కోళికోడ్ లో నగర మంటపం వెనుక ఉన్న లలిత కళా అకాడమి
 • జవహర్లాల్ నెహ్రూ ప్లానెటేరియం
 • 650 సంవత్సరాల క్రితం నిర్మించబడిన మిశ్కల్ మసీదు, అనే ఒక చారిత్రాత్మిక మసీదు
 • మేముండలో ఉన్న దుర్గ ఆలయం లోకనర్కావు ఆలయం. ఈ ఆలయం వదకర నుండి 4 కిమీ దూరములో ఉంది. కలరిప్పయట్టు అనే ఒక మార్షియల్ కళతో ఈ ఆలయానికి సంబంధం ఉంది.
 • తుషరగిరి ఫాల్స్: కాలికట్ రైల్వే స్టేషను నుండి 55 కిమీ దూరములో ఉన్న ఒక జలపాతం.
 • కొలిప్పార జలపాతం జిల్లా యొక్క తూర్పు దిశలో ఉంది. ఇది పర్వతారోహణలో మంచి అనుభవాన్ని ఏర్పరుస్తుంది.
 • పెరువన్నముళి ఆనకట్ట. ఇక్కడ పడవలు నడపబడుతున్నాయి. ఒక మొసలి అభయారణ్యం కూడా ఉంది.[ఉల్లేఖన అవసరం]
 • కక్కయం ఆనకట్ట మరియు జలవిద్యుత్ కేంద్రము. పర్వతారోహణకు కూడా ఇది ఒక మంచి ప్రదేశము.[ఉల్లేఖన అవసరం]

సంస్కృతిసవరించు

మలయాళం భాష మరియు సాహిత్యంలో కోళికోడ్ ముఖ్య పాత్ర వహించిది. వడక్కన్ పాట్టుకళ్ అనే గ్రామీణ పాటలకు ఈ జిల్లా ప్రసిద్ధి. తచోలి ఒతేనన్ మరియు ఉన్నియర్చ యొక్క సాధనలని కొనియాడే పాటలు వీటిలో అత్యధిక జానాధరణ పొందినవి. మాప్పిల పాట్టు, ఒప్పన పాటలని ఈ జిల్లా ముస్లీంలు తరచూ పాడుతూ ఉంటారు. ఈ పాటలు అరబిక్, మలయాళం రెండు భాషలు కలిసిన ఒక మిశ్రమ భాషలో ఉంటాయి. పట్టాతనం అనే గొప్ప బిరుదు కొరకు వేద పండితుల మధ్య జరిగే ప్రసిద్ధ వివేచనాత్మక తర్కం తులం నెలలో తలి ఆలయములో జరుగుతుంది. ఘజల్, ఫుట్బాల్ లతో కూడా కోళికోడ్ కు గట్టి అనుబంధాలు ఉన్నాయి.

నగరానికి బలమైన వాణిజ్య సంస్కృతి ఉంది. ఒకప్పుడు రైల్వే స్టేషను సమీపములో ఉన్న వలియంగాడి (బిగ్ బజార్) నగరములో ముఖ్య వ్యాపార కేంద్రముgaa ఉండేది. కాల క్రమేణా, అది నగరములోని ఇతర ప్రాంతాలకు మారింది. ఈ మధ్య కాలములో నగరము యోక్క వ్యాపార కేంద్రము మిట్టాయి తెరువు (మిటాయి వీధి) కు మారింది. ఈ వీధి చాలా సన్నగా ఉండి, చీర నుండి అలంకరణ సామగ్రి వరకు అన్ని వస్తువులు అమ్మే అనేక కోట్లు ఉన్నాయి. ఇక్కడ హోటల్ లు మరియు మిటాయి కోట్లు కూడా ఉన్నాయి. మిట్టాయి తెరువు లేదా S.M. వీధి అనే పేరు ప్రసిద్ధ కోళికోడ్ హల్వా నుండి వచ్చింది. ఈ హల్వాని మిటాయి అని కూడా పిలుస్తారు.[34] బహుళ మతాలు వారు అందరు కలిసి ఉన్న కోళికోడ్ లో, ఓనం, క్రిస్మస్, ఇడ్-ఉల్-ఫైటర్ ( హిందువుల, క్రైస్తువల మరియు ముస్లీంల పండగలు) పండగలని సమాన కోలాకలంగా జరుగుతాయి.

వంటకాలు

కోళికోడ్ ప్రతి ఒక్క యాత్రికుడి రుచికి తగ్గట్టుగా వంటలను అందిస్తుంది. శాకాహార ఆహార్యములో సాధ్య కూడా ఉంది. మాంసాహార ఆహార్యములో నగరములో ప్రత్యేక ముస్లిముల మరియు హిందువుల పద్ధతులు కలగపిన వంటలు లభ్యమౌతాయి. వానిలో ముఖ్యమైనవి బిరియాణీ, నేతి అన్నంతో కూడిన మాంసం కూర, సముద్రపు ఆహారం (రొయ్యలు, నత్తలు, మేకరెల్ లు) మరియు కాగితమంత సన్నటి పథిరిస్ మసాలా రసంతో జతచేసి లభ్యమౌతుంది. మరొక ప్రాచుర్యం చెందిన కోళీకోడ్ వంటకం అయిన అరటికాయ చిప్స్ కరకరలాడుతూ ఉంది, పలుచని వేఫర్ల మాదిరిగా ఉంటాయి. వేరొక కోజ్హికోడ్ లోనూ, విదేశాలలోనూ కూడా ప్రసిద్ధి చెందిన వంటకం 'కోళీకోడ్ హల్వా' వంటకం .

ప్రసార మాధ్యమాలుసవరించు

చిత్ర పరిశ్రమ

మమ్ముకొయ మరియు కుతిరవట్టం పప్పు వంటి గొప్ప నటులు మలయాళ చిత్ర పరిశ్రమ మీద పెద్ద ప్రభావం చూపారు. రచయితలకు ఆహారానికి మాత్రమే కాలికట్ ప్రసిద్ధి కాదు, గొప్ప నటులకు కూడా అని వీరు చూపించారు. ఇటీవల మరణించిన గిరీష్ పుతేన్చేరి కూడా కాలికట్ కు చెందిన వారే. అతను మాలయాళ చిత్ర పరిశ్రమలోని ఉత్తమ గీత రచయితలలో ఒకరు.

వార్తపత్రికలు

మలయాళ పత్రికారంగములో కోళికోడ్ ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ జిల్లాలో పత్రికారంగం 1880 నుండే మొదలియింది. కోళికోడ్ నుండి ప్రచురించబడ్డ మొట్ట మొదటి వార్తాపత్రిక కేరళ పత్రిక అయి ఉంటుంది. 1893కు ముందే కోళికోడ్ నుండి ప్రచురించబడ్డ పత్రికలలో కొన్ని, కేరళం, కేరళ సంచారి మరియు భరత్ విలాసం . మాతృభూమి మరియు మాధ్యమం వంటి ప్రసిద్ధ మలయాళ దినపత్రికల జన్మస్థలము కూడా కోళికోడే.

రచయితలు

అనేక ప్రముఖ మలయాళ సాహిత్య రచయితలు ఈ నగరానికి చెందిన వారే. వారిలో కొందరు: ఎం.టి. వాసుదేవన్ నాయర్, ఎస్. కే. పోట్టేక్కట్, తిక్కోడియాన్. సుకుమార్ అళికోడ్, ఎన్ పి ముహంమేడ్ మరియు యురూబ్ వంటి రచయితలు కోళికోడ్ ని తమ రెండో ఇల్లు లాగ చేసుకున్నారు. వైకోమ్ ముహమ్మద్ బషీర్ అనే మరో ప్రముఖ రచయిత ఈ నగర శివారిలోని బెయ్పోర్ లో నివసించేవారు. ఈయినని "బెయ్పోర్ సుల్తాన్" అని ప్రేమగా పిలిచేవారు.

రేడియో

ఆల్ ఇండియా రేడియో వారి కోళికోడ్ కేంద్రము 1950 మే 14 నాడు ప్రారంబించబడింది. అక్కడ రెండు ట్రాన్స్మిటర్ లు ఉన్నాయి - 100 కిలోవాట్ శక్తి గల కోళికోడ్ AM మరియు 10 కిలోవాట్ శక్తి గల కోళికోడ్ FM (వివిధ్ భారతి). కోళికోడ్ లో ఒక టెలివిజన్ ట్రాన్స్మిటర్ 1984 జూలై 3 నుండి ఢిల్లీ మరియు తిరువనంతపురం దూరదర్శన్ నుండి కార్కక్రామాలని ప్రసారణ చేస్తూ ఉంది.

ప్రైవేట్ FM రేడియో కేంద్రాలు: రేడియో మాంగో 91.9 (మలయాళ మనోరమ కం.లి.), సన్ FM 93.5 (SUN నెట్వర్క్).

AIR FM రేడియో కేంద్రాలు:కోళికోడ్ -103.6,

AIR AM/MW రేడియో కేంద్రాలు:కోళికోడ్ -684

బుల్లితెర

ACV అని పిలవబడే ఆసియానెట్ కేబుల్ విషన్ రోజూ నగర వార్తలని ప్రసారణ చేస్తుంది. కోళికోడ్ నగరములో జరుగుతున్న కార్యక్రమాలని ACV న్యూస్ చూపిస్తుంది. స్పైడర్నెట్ అనునది మరొక స్థానిక చానెల్. నగరములో ప్రాసరణ చేస్తున్న ఇతర చానెల్ లు KCL మరియు సిటినేట్. ఆసియానెట్, సూర్య, కైరాలి, అమ్రిత, జీవన్, ఇండియావిషన్, జైహింద్ వంటి అన్ని పెద్ద చానెల్ లకు కాలికట్ లో స్టూడియోలు, కార్యాలయాలు ఉన్నాయి. దూరదర్శన్ యొక్క ప్రసారణ కేంద్రము కాలికట్ మెడికల్ కాలేజీలో ఉంది.

విద్యసవరించు

కోళికోడ్ లో దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన రెండు ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి - ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్, కోళికోడ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, కాలికట్ (NITC). కోళికోడ్ లో ఉన్న ఇతర పెద్ద సంస్థలు: కాలికట్ మెడికల్ కాలేజీ, యునివెర్సిటీ అఫ్ కాలికట్, కాలికట్ యునివెర్సిటీ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CUIET), గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ (GEC), మలబార్ క్రిస్టియన్ కాలేజీ, జమోరిన్స్ గురువాయురప్పన్ కాలేజీ, సెయింట్ జోసెఫ్స్ కాలేజీ, దేవగిరి, ఫరూక్ కాలేజీ, గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ, ప్రొవిడెన్స్ ఉమెన్స్ కాలేజీ, గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ లా కాలేజీ, గవర్నమెంట్ కాలేజీ అఫ్ టీచర్ ఎడ్యుకేషన్, కేరళ స్కూల్ అఫ్ మాథమేటిక్స్, DOEACC కాలికట్, పూర్వం CEDTI.

పరిశోధనా సంస్థలుసవరించు

నగరము లోను చుట్టూ ఉన్న కొన్ని పరిశోధన సంస్థలు ఉన్నాయి.

అవి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ స్పైసాస్ రిసెర్చ్, సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మానేజ్మెంట్, వెస్ట్రన్ ఘాట్స్ ఫీల్డ్ రిసెర్చ్ స్టేషను (జూలోజికల్ సర్వే అఫ్ ఇండియా), రీజనల్ ఫైలేరియ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ కమ్మునికెబుల్ డిసీసెస్).

నగర ప్రముఖులుసవరించు

కోళికోడ్ నగరంలో జన్మించి ప్రముఖులైన కొందరు:

ఇవి కూడా చూడండిసవరించు

సూచనలుసవరించు

 1. "Lectures 26-27". Purdue University. మూలం నుండి 2009-07-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-23. Cite web requires |website= (help)
 2. "Best cities to live, invest and earn in". Ibnlive.com. Retrieved 2009-09-23. Cite web requires |website= (help)
 3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-07-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-06-21. Cite web requires |website= (help)
 4. http://www.indianexpress.com/oldStory/76119/
 5. http://www.livemint.com/2009/01/04220607/HungerFree-Kozhikode-project.html
 6. http://www.thehindubusinessline.com/2010/02/01/stories/2010020153161900.htm
 7. 7.0 7.1 నారాయణన్.ఎం.జి.ఎస్., కాలికట్:ది సిటీ అఫ్ ట్రూత్ (2006) కాలికట్ యూనివర్సిటీ ప్రెస్, కాలికట్.
 8. అయ్యర్, కే. వి. కృష్ణ, ది జామోరిన్స్ అఫ్ కాలికట్- ఫ్రం ది ఎర్లియస్ట్ టైమ్స్ తో A.D. 1806 (1938), కాలికట్.
 9. దివాకరన్, కట్టకడ (2005). కేరళ సంచారం. ట్రివెండ్రం: Z లైబ్రరీ
 10. 10.0 10.1 "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2001-08-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2001-08-18. Cite web requires |website= (help)
 11. పణిక్కర్. కే. ఎం., ఎ హిస్టరీ అఫ్ కేరళ (1959), అన్నామలై యూనివర్సిటీ
 12. 12.0 12.1 12.2 12.3 నారాయణన్.ఎం.జి.ఎస్.,కాలికట్: ది సిటీ అఫ్ ట్రూత్(2006) కాలికట్ యూనివర్సిటీ పబ్లికేషన్స్
 13. శ్రీధర మీనన్. ఎ సర్వే అఫ్ కేరళ హిస్టరీ (1967), పే.152. డి. సి. బుక్స్ కొట్టాయం.
 14. మా హువాన్: యింగ్ యై షెంగ్ లాన్, ది ఓవరాల్ సర్వే అఫ్ ది ఒషన్స్ షోర్స్ , జే.వి.జి. మిల్స్ చే అనువదించబడినది, 1970 హక్లుయ్ట్ సొసైటీ, పునఃప్రచురణ 1997 వైట్ లోటస్ ప్రెస్. ISBN 0-15-506372-3
 15. వర్తేమ, లుడోవికో డి, ది ట్రావెల్స్ అఫ్ లుడోవికో డి వర్తేమ, A.D.1503-08, మూలం 1510 ఇటాలియన్ ప్రచురణ నుండి జాన్ వింటర్ జోన్స్ చే అనువదించబడినది, హక్లుయ్ట్ సొసైటీ, లండన్
 16. గంగాధరన్. ఎం., ది ల్యాండ్ అఫ్ మలబార్:ది బుక్ అఫ్ బార్బోస (2000),వాల్ II, ఎం.జి యూనివర్సిటీ, కొట్టాయం.
 17. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-09-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-06-21. Cite web requires |website= (help)
 18. "Annual Weather Kozhikode, India". climate Charts. మూలం నుండి 2010-09-14 న ఆర్కైవు చేసారు. Retrieved November 27, 2008. Unknown parameter |dateformat= ignored (help); Cite web requires |website= (help)
 19. కోళికోడ్ లోక్ సభ నియోజకవర్గం డిలిమీటేషన్ ప్రభావం - ది హిందు ఫెబ్ 5; 2008
 20. [1]
 21. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)
 22. 22.0 22.1 "Official Website of Kozhikode". Kkd.kerala.gov.in. 1975-12-26. మూలం నుండి 2009-10-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-23. Cite web requires |website= (help)
 23. "'Bohras in Calicut'". Hinduonnet.com. 2006-05-19. మూలం నుండి 2009-07-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-23. Cite news requires |newspaper= (help)
 24. 24.0 24.1 "Official website of Kozhikode, Govt. of Kerala". Kkd.kerala.gov.in. 1975-12-26. మూలం నుండి 2009-10-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-23. Cite web requires |website= (help)
 25. 25.0 25.1 బార్బోస, దువార్టే, ది బుక్ అఫ్ దువార్టే బార్బోస:ఏన్ అకౌంట్ అఫ్ కంట్రీస్ బార్దేరింగ్ ఆన్ ది ఇండియన్ ఓషన్ అండ్ దేర్ ఇంహబిటన్ట్స్, డెంస్,ఎం.ఎల్,(అనువాదకర్త మరియు సంపాధకడు), 2 వాల్., తొలి ప్రచురణ 1918. న్యూ ఢిల్లీ,AES పునః ప్రచురణ, 1989.
 26. నారాయణన్.ఎం.జి.ఎస్., కాలికట్: ది సిటీ అఫ్ ట్రూత్(2006) కాలికట్ యూనివర్సిటీ పబ్లికేషన్స్
 27. కోకిలసందేశం, శ్లోక 67
 28. SM స్ట్రీట్
 29. లోగాన్, విల్లియం., మలబార్(1887), వాల్ II
 30. నారాయణన్ ఎం.జి.ఎస్., పెరుమల్స్ అఫ్ కేరళ, కాలికట్(1996)
 31. నారాయణన్ ఎం.జి.ఎస్., కాలికట్: ది సిటీ అఫ్ ట్రూత్. పే.109, కాలికట్ యూనివెర్సిటీ ప్రెస్ (2006)
 32. పణిక్కర్. కే.ఎం, ఎ హిస్టరీ అఫ్ కేరళ (1959) అన్నామలై యూనివర్సిటీ
 33. పియర్సన్, ఎం.ఎన్(ed.) ఇండియా అండ్ ది ఇండియన్ ఓషన్ 1500-1800 , కాల్చుట్ట యునివర్సిటీ: ఓక్ష్ఫొర్ద యునివర్సిటీ ప్రెస్, 1987.
 34. "Kozhikode Attractions". indialine.com. Retrieved 2009-10-04. Cite web requires |website= (help)

బాహ్య లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కోళికోడ్&oldid=2828825" నుండి వెలికితీశారు