మల్లు వెంకట నరసింహారెడ్డి

మల్లు వెంకట నరసింహారెడ్డి (మే 18, 1930 - డిసెంబర్ 4, 2004) తెలంగాణ సాయుధ పోరాట దళ నాయకుడు.[1] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మార్క్సిస్టు పార్టీ అభివృద్ధిలో కీలక భూమిక పోషించి, పార్టీ కార్యకర్తగా, వ్యవసాయ కార్మిక, రైతు ఉద్యమ నాయకుడుగా, పార్టీ నాయకుడుగా పలు సేవలు అందించాడు.

మల్లు వెంకట నరసింహారెడ్డి
జననంమే 18, 1930
మరణండిసెంబర్ 4, 2004
జాతీయతభారతీయుడు
తల్లిదండ్రులుగోపాలరెడ్డి, రామనర్సమ్మ
బంధువులుమల్లు స్వరాజ్యం (భార్య)

జననం - విద్యాభ్యాసంసవరించు

వెంకట నరసింహారెడ్డి 1930, మే 18న గోపాలరెడ్డి, రామనర్సమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, నూతనకల్లు ప్రాంతంలోని మామిళ్లమడువ గ్రామంలో జన్మించాడు. ఈయనది ధనిక కుటుంబం. ఈయన తండ్రి జన్నారెడ్డి దేశ్‌ముఖ్‌ దగ్గర మునసబుగా పనిచేయడంవల్ల ఊరిలో అధికారం చెలాయించేవారు.

వివాహంసవరించు

తన ఉద్యమ సహచరిణి, తన దళంలో పనిచేసిన స్వరాజ్యం ను వివాహం చేసుకున్నాడు. స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి చెల్లెలు. 1954 మేలో హైదరాబాద్‌ ఓల్డ్‌ ఎమ్మెల్యే కార్వర్ట్స్‌లోని దేవులపల్లి వెంకటేశ్వరరావు క్వార్టరులో బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావుల సమక్షంలో రెండు దండలతో ఆ వీళ్లద్దరి వివాహం నిరాడంబరంగా జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (గౌతమ్‌, నాగార్జున), ఒక కుమార్తె (కరుణ).

ఉద్యమ జీవితంసవరించు

మరణంసవరించు

వెంకట నరసింహారెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురై 2004, డిసెంబర్ 4 న మరణించాడు.

మూలాలుసవరించు

  1. ప్రజాశక్తి, మార్క్సిస్టు (3 November 2016). "విప్లవ యోధుడు మల్లు వెంకట నరసింహారెడ్డి". యు రామకృష్ణ. Archived from the original on 29 అక్టోబరు 2017. Retrieved 9 November 2017.