మహదేవప్ప యాద్వాడ్

మహాదేవప్ప శివలింగప్ప యాద్వాడ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రామదుర్గ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

మహాదేవప్ప శివలింగప్ప యాద్వాడ్

పదవీ కాలం
2018 – 2023
ముందు అశోక్ పట్టన్
తరువాత అశోక్ పట్టన్
నియోజకవర్గం రామదుర్గ్
పదవీ కాలం
2004 – 2008
ముందు ఎన్వీ పాటిల్
తరువాత అశోక్ పట్టన్
నియోజకవర్గం రామదుర్గ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (యునైటెడ్))

రాజకీయ జీవితం

మార్చు

మహాదేవప్ప యాద్వాడ్ జనతాదళ్ (యునైటెడ్)) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 శాసనసభ ఎన్నికలలో రామదుర్గ్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ భారతీయ జనతా పార్టీలో చేరి 2004 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ పట్టన్‌పై 25541 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మహాదేవప్ప యాద్వాడ్ 2008 2013 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ పట్టన్ చేతిలో ఓడిపోయాడు. ఆయన 2018 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ పట్టన్‌పై 2875 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయనకు 2023 ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. ABP News (12 April 2023). "Karnataka Election: Uproar In Ramdurg Constituency After BJP Denies Ticket To Sitting MLA" (in ఇంగ్లీష్). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
  3. The Hindu (5 April 2024). "Mahadevappa Yadawad, former MLA and BJP leader announces support to Jagadish Shettar" (in Indian English). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
  4. The Hindu (24 April 2023). "BJP MLA Mahadevappa Yadawad withdraws papers in favour of official party candidate in Ramdurg" (in Indian English). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.