మహబూబాబాదు పురపాలకసంఘం

మహబూబాబాదు పురపాలక సంఘం, మహబూబాబాదు జిల్లాకు చెందిన పురపాలక సంఘం.[1] 1954లో ఏర్పడిన ఈ పురపాలక సంఘం, 1964లో గ్రామపంచాయతీగా మార్పుచేయబడింది. తిరిగి 2011లో పురపాలక సంఘంగా హోదా పెంచబడింది. ప్రసుతం రెండో గ్రేడ్‌లో ఉన్న ఈ పురపాలక సంఘం పరిధిలో 28 వార్డులు ఉన్నాయి. మహబూబాబాదు పట్టణం పురపాలక సంఘ పరిపాలనా కేంద్రస్థానంగా ఉంది.ఇది మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని, మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.

మహబూబాబాదు రైల్వే స్టేషన్

చరిత్ర

మార్చు

1954లో పురపాలక సంఘంగా మార్పు చేసిన పిదప కొండపల్లి గోపాలరావు 2 సార్లు చైర్మెన్‌గా పనిచేశాడు. 1964లో ఈ సంఘం హోదాను తగ్గించి మేజర్ గ్రామపంచాయతీగా చేసిన తర్వాత కూడా కొండపల్లి గోపాలరావు సర్పంచిగా ఎన్నికయ్యాడు. 2005-2010 కాలంలో భూక్యానాయక్ చైర్మెన్‌గా పనిచేయగా, ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగింది. 2014 మార్చిలో తిరిగి ఎన్నికలు జరిగాయి.

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మహాబుబాబాదు పురపాలక సంఘం పరిధిలోలో జనాభా మొత్తం 42,851, ఇందులో 20,716 మంది పురుషులు కాగా, 22,135 మంది మహిళలు ఉన్నారు.[2].పురపాలక సంఘం ఏరియాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4170 మంది ఉన్నారు. ఇది మహాబూబాబాదు సిటి మొత్తం జనాభాలో 9.73%గా ఉంది. మహాబూబాబాదు సెన్సస్ టౌన్లో, స్త్రీల సెక్స్ నిష్పత్తి, రాష్ట్ర సగటు 993 కు వ్యతిరేకంగా 1068 గా ఉంది.మహాబుబాబాద్‌లో పురుషుల అక్షరాస్యత 86.59% కాగా, మహిళా అక్షరాస్యత 72.32% ఉంది.మహాబూబాబాదు పురపాలక సంఘం పరిధిలో గృహాలు మొత్తం 10,397 పైగా ఉన్నాయి. వీటికి మంచి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను పురపాలక సంఘం ద్వారా జరుగుతాయి.మహబూబాబాదు పరిధిలోని రహదారుల నిర్వహణ, ఇతర వసతులు సమకూర్చటానికి దాని పరిధిలో ఉన్న ఆస్తులపై పన్ను విధించడానికి పుపాలక సంఘానికి అధికారం ఉంది.[2]

ఎన్నికల వార్డులు సంఖ్య

మార్చు

పురపాలక సంఘం 36 వార్డులుగా విభజింపబడింది.[3] పాలకవర్గానికి ప్రతి 5 సంవత్సరంలకు ఎన్నికలు జరుగుతాయి.చివరిసారిగా 2020 జనవరి ఎన్నికలు జరిగాయి.[4]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా పాలువాయి రామమోహనరెడ్డి (టిఆర్ఎస్), వైస్ చైర్మన్‌గా మహమ్మద్ ఫరీద్ (టిఆర్ఎస్) పనిచేస్తున్నారు.[5]

మూలాలు

మార్చు
  1. "Mahabubabad Municipality". mahabubabadmunicipality.telangana.gov.in. Archived from the original on 2020-07-04. Retrieved 2020-07-03.
  2. 2.0 2.1 "Mahabubabad Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-07-03. Retrieved 2020-07-03.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-07-16. Retrieved 2020-07-03.
  4. www.ETGovernment.com. "Telangana Municipal elections will be held on January 22 - ET Government". ETGovernment.com. Archived from the original on 2020-07-03. Retrieved 2020-07-03.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-07-03. Retrieved 2020-07-03.

వెలుపలి లంకెలు

మార్చు