మహబూబాబాదు పురపాలక సంఘము

మహబూబాబాదు పురపాలక సంఘము వరంగల్ జిల్లాకు చెందిన పురపాలక సంఘము. 1954లో ఏర్పడిన ఈ పురపాలక సంఘము 1964లో గ్రామపంచాయతీగా మార్పుచేయబడింది. 2011లో మళ్ళీ పురపాలక సంఘంగా హోదా పెంచబడింది. ప్రసుతం రెండో గ్రేడ్‌లో ఉన్న ఈ పురపాలక సంఘం పరిధిలో 28 వార్డులు ఉన్నాయి.

చరిత్రసవరించు

1954లో పురపాలక సంఘంగా మార్పు చేసిన పిదప కొండపల్లి గోపాలరావు 2సార్లు చైర్మెన్‌గా పనిచేశారు. 1964లో ఈ సంఘం హోదాను తగ్గించి మేజర్ గ్రామపంచాయతీగా చేసిన తర్వాత కూడా ఆయన సర్పంచిగా ఎన్నికయ్యారు. 2005-2010 కాలంలో భూక్యానాయక్ చైర్మెన్‌గా పనిచేయగ ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగించి. 2014 మాచి 30న ఎన్నికలు జరగనున్నాయి.