మహబూబ్ ఘాట్ నిర్మల్

(మహబూబ్ ఘాట్స్ నిర్మల్ నుండి దారిమార్పు చెందింది)

మహబూబ్ ఘాట్ నిర్మల్ తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా, నిర్మల్ కి 8 కి.మీ దూరంలో ఈ మహబూబ్ ఘాట్ ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణిలో భాగమైన ఈ ఘాట్లు ఎన్నో మెలికలు కలగి ఉంది. సూఫీ తత్వవేత్త షేక్ మహబుబ్ పేరుతో దీనిని నామకరణం చేశారు[1][2].

మహబూబ్ ఘాట్ నిర్మల్
నిర్మల్ జిల్లాలోని మహబూబ్ ఘాట్ రోడ్డు
అత్యంత ఎత్తైన బిందువు
శిఖరంసహ్యాద్రి కొండలు, నిర్మల్
ఎత్తు150 మీ. (490 అ.)
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్190 మీ. (620 అ.)
భౌగోళికం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ and నిర్మల్
ప్రాంతందక్షిణ భారత దేశం
జిల్లాలునిర్మల్
Settlementనిర్మల్
Biomeఅడవులు

ఘాట్ అందాలు

మార్చు

నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే మార్గంలో సారంగాపూర్ మండలంలోని రాణాపూర్ తండా దాటగానే ఈ మహబూబ్ ఘాట్ ప్రాతం మొదలవుతుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కొండల మధ్య ఈ ఘాట్ రోడ్డు 4 కి.మీ పాముల వలె వంకర్లు తిరుగుతు చుపురులను అబ్బురపరుస్తుంది. ఈ అందమైన ప్రకృతి దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు, వాహనదారులు ఎంతో ఉత్సహలను ప్రదర్శిస్తారు.ఎత్తైన కొండలు, పచ్చని అడవులు ఆ అడవుల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు కొండపై నుండి జాలువారే జలపాతాలు ఈ అద్బుత అందమైన ప్రదేశంలో మార్గమంత పొగమంచు అలముకోవడంతో ఇది ఊటీని తలపిస్తోంది. వర్షాకాలంలో మరింత శోభను సంతరించుకుంటుంది.చుట్టంత అడవే ఆకుపచ్చని చిర కట్టినట్లు ఆ దృశ్యాలు మదిని దోచుకుంటాయి. రోడ్డు ఇరువైపులా అందమైన లోయలు,సెలయోరులు, అగాధాలు దృశ్యాలు పర్యాటకులను అమితంగా ఆకట్టు కుంటోంది[3].

వాచ్ టవర్

మార్చు

మహబూబ్ ఘాట్ అందాల దృశ్యాలను తిలకించడానికి అటవి శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ వాచ్ టవర్ నుండి నిర్మల్ జిల్లా యస్ ఆర్ ఎస్ పి రిజర్వాయర్ అందాలా ప్రకృతి సోయగాలు చూడడానికి ప్రకృతి ప్రేమికులు ఈ వాచ్ టవర్ ఎక్కి మొబైల్ యందు చక్కటి దృశ్యాలను బందించిస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. Bharat, E. T. V. (2021-08-20). "MAHABUB GHAT: పర్యాటకుల మదిని దోస్తున్న 'మహబూబ్​ ఘాట్​' అందాలు". ETV Bharat News. Retrieved 2024-10-12. {{cite web}}: zero width space character in |title= at position 48 (help)
  2. Velugu, V6 (2024-02-25). "మహబూబ్ ఘాట్ : నేచర్ టూరిజం కేరాఫ్​". V6 Velugu. Retrieved 2024-10-12. {{cite web}}: zero width space character in |title= at position 34 (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "Waterfalls: ఆ ఘాట్ అందాలకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే". News18 తెలుగు. 2024-07-26. Retrieved 2024-10-12.