మహబూబ్ ఘాట్ నిర్మల్
మహబూబ్ ఘాట్ నిర్మల్ తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా, నిర్మల్ కి 8 కి.మీ దూరంలో ఈ మహబూబ్ ఘాట్ ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణిలో భాగమైన ఈ ఘాట్లు ఎన్నో మెలికలు కలగి ఉంది. సూఫీ తత్వవేత్త షేక్ మహబుబ్ పేరుతో దీనిని నామకరణం చేశారు[1][2].
మహబూబ్ ఘాట్ నిర్మల్ | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
శిఖరం | సహ్యాద్రి కొండలు, నిర్మల్ |
ఎత్తు | 150 మీ. (490 అ.) |
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ | 190 మీ. (620 అ.) |
భౌగోళికం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ and నిర్మల్ |
ప్రాంతం | దక్షిణ భారత దేశం |
జిల్లాలు | నిర్మల్ |
Settlement | నిర్మల్ |
Biome | అడవులు |
ఘాట్ అందాలు
మార్చునిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే మార్గంలో సారంగాపూర్ మండలంలోని రాణాపూర్ తండా దాటగానే ఈ మహబూబ్ ఘాట్ ప్రాతం మొదలవుతుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కొండల మధ్య ఈ ఘాట్ రోడ్డు 4 కి.మీ పాముల వలె వంకర్లు తిరుగుతు చుపురులను అబ్బురపరుస్తుంది. ఈ అందమైన ప్రకృతి దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు, వాహనదారులు ఎంతో ఉత్సహలను ప్రదర్శిస్తారు.ఎత్తైన కొండలు, పచ్చని అడవులు ఆ అడవుల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు కొండపై నుండి జాలువారే జలపాతాలు ఈ అద్బుత అందమైన ప్రదేశంలో మార్గమంత పొగమంచు అలముకోవడంతో ఇది ఊటీని తలపిస్తోంది. వర్షాకాలంలో మరింత శోభను సంతరించుకుంటుంది.చుట్టంత అడవే ఆకుపచ్చని చిర కట్టినట్లు ఆ దృశ్యాలు మదిని దోచుకుంటాయి. రోడ్డు ఇరువైపులా అందమైన లోయలు,సెలయోరులు, అగాధాలు దృశ్యాలు పర్యాటకులను అమితంగా ఆకట్టు కుంటోంది[3].
వాచ్ టవర్
మార్చుమహబూబ్ ఘాట్ అందాల దృశ్యాలను తిలకించడానికి అటవి శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ వాచ్ టవర్ నుండి నిర్మల్ జిల్లా యస్ ఆర్ ఎస్ పి రిజర్వాయర్ అందాలా ప్రకృతి సోయగాలు చూడడానికి ప్రకృతి ప్రేమికులు ఈ వాచ్ టవర్ ఎక్కి మొబైల్ యందు చక్కటి దృశ్యాలను బందించిస్తున్నారు.
మూలాలు
మార్చు- ↑ Bharat, E. T. V. (2021-08-20). "MAHABUB GHAT: పర్యాటకుల మదిని దోస్తున్న 'మహబూబ్ ఘాట్' అందాలు". ETV Bharat News. Retrieved 2024-10-12.
{{cite web}}
: zero width space character in|title=
at position 48 (help) - ↑ Velugu, V6 (2024-02-25). "మహబూబ్ ఘాట్ : నేచర్ టూరిజం కేరాఫ్". V6 Velugu. Retrieved 2024-10-12.
{{cite web}}
: zero width space character in|title=
at position 34 (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Waterfalls: ఆ ఘాట్ అందాలకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే". News18 తెలుగు. 2024-07-26. Retrieved 2024-10-12.