మహబూబ్ మాన్షన్
మహబూబ్ మాన్షన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేట లో ఉన్న భవనం. ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీ ఖాన్ పేరుమాదుగా ఈ రాజభవనంకు మహబూబ్ మాన్షన్ గా పేరు వచ్చింది.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
మహబూబ్ మాన్షన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాజభవనం |
చిరునామా | మలక్‌పేట , హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
ప్రారంభం | 1902 |
యజమాని | నిజాం |
చరిత్ర
మార్చు19వ శతాబ్దం చివరలో నిర్మించబడిన ఆ భవనం సాంప్రదాయ ఐరోపా, మొఘల్ శైలిలో నిర్మించబడింది. కింగ్ కోఠి ప్యాలెస్ లోని ముబారక్ మాన్షన్ యొక్క తూర్పు బ్లాక్ మాదిరిగా ఉన్న ఈ భవనం 19వ శతాబ్దంలో ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీ ఖాన్ చే కొనుగోలు చేయబడింది.[2]
ఇతర వివరాలు
మార్చుమహబూబ్ అలీ ఖాన్ భార్య సర్దార్ బేగం రాజభవనం నుండి బయటికి చూడడంకోసం కిటీకీలకు బంగారు దారంతో తయారుచేసిన పరదాలను ఏర్పాటుచేశారు. బంగారు పరదాలపై సూర్యరశ్మి ప్రతిబింబిస్తుండడంవల్ల ఎవరినైనా రాణి వైపు చూడడానికి అసాధ్యమయ్యేది.[2]
ప్రస్తుతం
మార్చు1983 లో, ఉస్మాన్ గంజ్ యొక్క సుగంధ ద్రవ్యాల మార్కెట్ అధికారికంగా మహబూబ్ భవనంలోని బహిరంగ ప్రదేశానికి మార్చబడింది.[3] ఈ పాలెస్ నిషేధించబడింది, చాలా అనారోగ్య పరిస్థితిలో ఉంది, భారత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ భవనం శిధిలావస్థకు చేరింది,, గృహ, వాణిజ్య అవసరాల దృష్ట్యా భవనం చుట్టుప్రక్కల ఉన్న భూమి పూర్తిగా ఆక్రమించబడింది.[4][5]
మూలాలు
మార్చు- ↑ Rohit P S. "A mansion goen to the dogs". Times of India. Retrieved 28 January 2019.
- ↑ 2.0 2.1 Telangana Today, SundayScape,Telangana Diaries (3 December 2017). "Pit stop of the royals". Dr. Anand Raj Varma. Archived from the original on 28 January 2019. Retrieved 28 January 2019.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Fire in cracker shop triggers panic". The Hindu. Archived from the original on 13 అక్టోబరు 2010. Retrieved 28 January 2019.
- ↑ "The 116-year-old Mahbub Mansion in a state of neglect". The New Indian Express. Retrieved 28 January 2019.
- ↑ "A time when it was the icon of luxury". The New Indian Express. Retrieved 28 January 2019.