మహాత్మా గాంధీ రోడ్డు (సికింద్రాబాదు)
మహాత్మా గాంధీ రోడ్డు, హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల మధ్య ఉన్న ప్రాంతం.[1] నిరంతరం అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతం 2 కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. సికింద్రాబాదులోని షాపింగ్ ప్రాంతాలలో ఇదీ ఒకటి.
మహాత్మా గాంధీ రోడ్డు | |
---|---|
సమీపప్రాంతం | |
![]() జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషను | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 003 |
Vehicle registration | టిఎస్ |
లోకసభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఇక్కడికి సమీపంలో పొగాకు బజార్, పాట్ మార్కెట్ ఉన్నాయి. ప్యారడైజ్ హోటల్, కబ్రా జ్యువెలర్స్, గాంధీ విగ్రహం, చర్మాస్, అస్రానీ హోటల్, ప్యారడైజ్ ఎక్స్ రోడ్డు, కెఎఫ్‌సీ, రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్, మలాని భవనం వంటివి ఇక్కడ ముఖ్యమైన ప్రాంతాలు.[2]
చరిత్ర సవరించు
రెసిడెంట్ జేమ్స్ కిర్క్‌పాట్రిక్ పేరు మీద ఈ ప్రాంతానికి (రహదారికి) జేమ్స్ స్ట్రీట్ అని పేరు పెట్టారు.[3] స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఇది మహాత్మా గాంధీ రోడ్డుగా మార్చబడింది.
సమీప ప్రాంతాలు సవరించు
ఇక్కడికి సమీపంలో భాస్కర్ రెసిడెన్సీ, కలాసిగుడ, సంధు అపార్ట్మెంట్, సుభాష్ రోడ్, పారడైజ్ సర్కిల్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
వాణిజ్య ప్రాంతం సవరించు
సికింద్రాబాద్‌లోని షాపింగ్ ప్రాంతాలలో ఎంజి రోడ్డు ప్రాంతం ఒకటి. ఇక్కడికి దూరంగా ఉన్న జనరల్ బజార్, క్లాత్ మార్కెటులలో దుకాణు ఉన్నాయి. ఇటీవలికాలంలో ఇక్కడ తిరుపతికి చెందిన హోటల్ భీమాతో సహా ఇతర హోటళ్ళు కూడా వచ్చాయి. ఇక్కడ అనేక ప్రపంచ బ్రాండ్ల వస్తువులు లభిస్తాయి. ఆయా బ్రాండ్లకు చెందిన వారి షోరూమ్‌లు కూడా ఇక్కడ ఉన్నాయి.
- చర్మాస్: సికింద్రాబాదులోని పురాతన దుస్తుల రిటైల్ దుకాణాల్లో ఇదీ ఒకటి.
- హోండా కార్స్: సుందరం మోటార్స్, ఇది సికింద్రాబాదులోని అతిపెద్ద హోండా కార్ డీలర్‌షిప్.
- ఫిలిప్స్ లైట్ లాంజ్, ఫిలిప్స్ లైట్ స్టూడియో: వేద్ ఎలక్ట్రికల్స్ (వేద్ గ్రూప్), ఇది తెలంగాణలో అతిపెద్ద ఫిలిప్స్ లైట్ లాంజ్, ఫిలిప్స్ లైట్ స్టూడియో.
- థియేటర్లు: ఇక్కడ అలాంకర్, చిత్రాని, ప్యారడైజ్ వంటి అనేక థియేటర్లు ఉండేవి. ప్రస్తుతం అవి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్‌లుగా మార్చబడ్డాయి.
- బంగారం: ఈ ప్రాంతం బంగారం, ఆభరణాల దుకాణాలకు పేరొందింది. ఇక్కడ అనేక బంగారం దుకాణాలు ఉన్నాయి. చేతితో తయారు చేసిన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. 150 సంవత్సరాల నుండి ఇక్కడ బంగారం మార్కెట్ అభివృద్ధి చెందుతోంది.
- చీరలు: ఈ ప్రాంతంలో జరి/కంచి చీరల దుకాణాలు, వివాహ సంబంధిత వస్త్రాభరణాల దుకాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి బొమ్మనా బ్రదర్స్, చందన బ్రదర్స్ వంటి పెద్ద షాపింగ్ పేర్లు కూడా ఉన్నాయి.
ఈ ప్రాంతం నుండి పడమటి వైపు ఒక ఆఫ్‌షూట్ రహదారి ఉంది, ఈ రహదారి గుండా బేగంపేట విమానాశ్రయంకు వెళ్ళవచ్చు. సర్ రోనాల్డ్ రాస్ మలేరియాకు కారణాన్ని కనుగొన్నట్లు చెబుతున్న ప్రదేశం ఈ రహదారి.
రవాణా సవరించు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఎంజి రోడ్డు మీదుగా కోఠి, మేడ్చల్, ఎన్జీఓస్ కాలనీ, అఫ్జల్‌గంజ్, సికింద్రాబాద్, మెహదీపట్నం, బాపు ఘాట్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[4] ఇక్కడికి సమీపంలో రాణిగంజ్ బస్ డిపో ఉంది. జేమ్స్ స్ట్రీట్ ప్రాంతంలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.
పోలీసు స్టేషన్ సవరించు
గతంలో దీనిని జేమ్స్ స్ట్రీట్ అని పిలిచేవారు. పోలీస్ స్టేషన్ కోసం ఉపయోగిస్తున్న భవనం, దేవాన్ బహదూర్ రామ్‌గోపాల్ మలాని చేత నిర్మించబడింది. అతడు ఈ భవనాన్ని పోలీసు శాఖకు విరాళంగా ఇచ్చాడు. 1998, మార్చి 23న అనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గడియారం భవనం, పోలీస్ స్టేషన్ భవనాన్ని వారసత్వ భవనాలుగా గుర్తించబడ్డాయి.
మూలాలు సవరించు
- ↑ "Mahatma Gandhi Road". www.onefivenine.com. Retrieved 2021-02-08.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ The oldest fire temple in city
- ↑ "AHow Secunderabad evolved into a multicultural crucible". Deccan Chronicle. Hyderabad. 2017-06-05. Retrieved 2021-02-08.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-08.
{{cite web}}
: CS1 maint: url-status (link)