మేడ్చల్
మేడ్చల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలానికి చెందిన రెవిన్యూ గ్రామం,జనగణన పట్టణం.[1]
మేడ్చల్ | |
— రెవిన్యూ గ్రామం — | |
[[Image:|220|none|]] | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మేడ్చల్ జిల్లా |
మండలం | మేడ్చల్ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 35,611 |
- పురుషుల సంఖ్య | 47,465 |
- స్త్రీల సంఖ్య | 45,960 |
పిన్ కోడ్ | 501401 |
ఎస్.టి.డి కోడ్ |
ఇది హైదరాబాదును ఆనుకొని 44 వ నెంబరు జాతీయ రహదారి పై నాగపూర్ మార్గములో ఉంది.కిష్టాపూర్ గ్రామం మేడ్చల్ గ్రామపంచాయితీ పరిధిలోకి వస్తుంది.
విశేషాలుసవరించు
ఈ వూరికి సమీపంలో పచ్చని ప్రకృతి అందాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో, శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం, చూడముచ్చటగా విరాజిల్లుతోంది.ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శరన్నవరాత్రులలో స్వామివారికి ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగును.[2]
చరిత్రసవరించు
1830లో గ్రామ స్థితిగతులను యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో వ్రాసుకున్నారు.1830 నాటికి మేడ్చల్‌కు హైదరాబాద్ నగరం నుంచి చేరేందుకున్న దారి చాలా అనుకూలంగా ఉండేది. బాటలో ఇసుక పొర ఉండేది. బాట పక్కన సీతాఫలపు చెట్ల అడవి మనోహరంగా ఉండేది. గ్రామానికి ముందున్న రెండు వాగులను దాటి ఊరికి చేరాల్సివుంటుందని, వర్షాకాలంలో అయితే వాగులు ఉధృతిగా ఉన్నప్పుడు దాటేందుకు కనీసం ఒకటి రెండు రోజులైనా ఆగవలసివుంటుందని వ్రాశారు. అప్పటికే గ్రామంలో కావలసిన వస్తువులన్న దొరికే వీలుందని, అంగళ్ళు చాలానే ఉన్నాయని వీరాస్వామయ్య వ్రాశారు.[3]
గణాంకాలుసవరించు
2011భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 93,425 - పురుషులు 47,465 - స్త్రీలు 45,960
రవాణా సౌకర్యములుసవరించు
ఈ గ్రామములో రైల్వే స్టేషను ఉంది. ప్రధాన రైల్వే స్టేషను సికింద్రాబాదు ఇక్కడికి 24 కి.మీ. దూరములో ఉంది. ఇక్కడినుండి అన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యముండి, బస్సుల వసతి ఉంది.
గ్రామంలోని బ్యాంకులుసవరించు
ఈ గ్రామములో ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారి శాఖలు ఉన్నాయి.
గ్రామంలోని విద్యా సంస్థలుసవరించు
రెడ్ సన్ జూనియర్, కళాశాల, సిల్వర్ జూనియర్ కళాశాల, స్కాలర్స్ జూనియర్ కళాశాల, గౌతమి డిగ్రీ కళాశాల, (ఫాఠశాలలు) డి.ఆర్.ఎస్. ఇంటర్ నేషనల్ స్కూలు, గౌతమి మోడల్ స్కూలు, కింగ్స్ విక్టర్ గ్రామర్ హైస్కూలు, శ్రీ చైతన్య హై స్కూలు, నాగార్జున టేలెంట్ స్కూలు, కృష్ణవేణి టేలెంట్ స్కూలు, ఆక్స్ ఫర్డ్ టేలెంట్ స్కూలు ఉన్నాయి.
ఉపగ్రామాలుసవరించు
ఈ గ్రామానికి చాల ఉప గ్రామాలున్నవి. వాటిలో కొన్ని. అర్కలగూడ, బ్రహాజిగూడ, బాసిర గడి ఘన్ పూర్, గోసాయి గూడ, గుబ్బడి తండ, ఖాసింబాయి తండ, ఖాజీగూడ, మైసిరెడ్డి పల్లె, మురహరి పల్లె, మురారిపల్లి, మైసమ్మగూడ, రాజ్ బొల్లారం తండ, రామలింగేశ్వర నగర్, సీతారి గూడ, సహజాదిగూడ, మొదలగునవి.[4]
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ ఈనాడు జిల్లా ఎడిషన్, 17-8-2013. 13వ పేజీ.
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ http://www.onefivenine.com/india/villag/Rangareddi/Medchal