మహాదేవ జాతర - సాలెవాడ(ఖుర్ద్)

మహాదేవ జాతర తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లోని సాలెవాడ (ఖుర్ద్) గ్రామంలో హరిహర మహాదేవుని అతి పురాతన ఆలయం ఉంది.ప్రతి సంవత్సరం పుష్య మాసంలో ఇచట తొమ్మిది రోజుల పాటు జాతర జరుగుతుంది[1].

హరిహరి మహాదేవ జాతర- సాలెవాడ-(కే) ఉట్నూర్
మహాదేవ జాతర సాలెవాడ (కే)
మహాదేవ జాతర సాలెవాడ (కే)
హరిహరి మహాదేవ జాతర- సాలెవాడ-(కే) ఉట్నూర్ is located in Telangana
హరిహరి మహాదేవ జాతర- సాలెవాడ-(కే) ఉట్నూర్
హరిహరి మహాదేవ జాతర- సాలెవాడ-(కే) ఉట్నూర్
తెలంగాణ లో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :19°22′N 78°46′E / 19.36°N 78.77°E / 19.36; 78.77
పేరు
ఇతర పేర్లు:శివాలయం ఆలయం
ప్రధాన పేరు :సాలెవాడ కే శివాలయం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్
దేవనాగరి :माहदेव मंदिर सालेवाडा , उटनुर तहसील आदिलाबाद जिला, तेलंगाना।
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్ జిల్లా
ప్రదేశం:ఉట్నూర్ ,మండలం , సాలెవాడ కే
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ప్రధాన దేవత:పార్వతి
ముఖ్య_ఉత్సవాలు:మహాశివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారత దేశ హిందూ దేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:01
ఇతిహాసం
నిర్మాణ తేదీ:13 వ శతాబ్దం
సృష్టికర్త:కాకతీయులు

స్థలపురాణం

మార్చు

వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన శివాలయం కాకతీయులు కాలం నాటిది అని చరిత్ర చెబుతోంది.ఇచట ఉన్న మర్రిచెట్టు క్రింద ఒక పూజారి ఉంటు శివలింగాన్ని పూజలు చేసేవాడని, అనంతరం ఆలయ ప్రచారంలో రావడంతో భక్తులు పూజలు చేయడం ప్రారంభించారట. సాలెవాడ కే తాండా నాయక్ ఆధ్వర్యంలో ఇచట 1970 నుండి జాతర ప్రారంభించారని గ్రామ పెద్దలు అంటారు.

పునర్నిర్మాణం

మార్చు

వందేళ్ల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయం శిధిలావస్థకు చేరుకోవడంతో ఆలయం కమిటీ ఆలయ నిర్మాణానికి కంకణం కట్టుకుంది. గ్రామస్థులు చందాలు వేసుకుని పురాతన ఆలయ స్థానంలో గుడి నిర్మాణం చేపట్టి దాతల నుంచి విరాళాలు సేకరించి అన్ని హంగులతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతంగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయ వేనుక భాగంలో ఎత్తైన కొండకు చేరుకోవడానికి 108 మెట్లు ఏర్పాటు చేశారు. ఆలయ కుడి వైపున విశాలమైన స్థలంలో భక్తుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేశారు. అలనాటి పురాతన కోటకు సంబంధించిన శిల్పాలను ఆలయ రెండు వైపులా చూడముచ్చటగా అర్చించారు. ఆలయ ముందు నందీశ్వరుడు, ఆలయ గర్భగుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.ఇచట జాతర సందర్భంగా, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

ఈ హరిహర మహాదేవుని ఆలయంలో ప్రతి సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం శిశిర ఋతువు ముగింపు సందర్భంగా తొమ్మిది రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.ఆలయం ముందు భాగంలో విశాలమైన ప్రాంగణంలో జాతర నిర్వహిస్తారు. ప్రకృతి రమణీయతా కనిపించే ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో పచ్చని కొబ్బరి చెట్లు ఆలయ వెనుక భాగంలో ఎత్తైన కొండ చూట్టు ప్రక్కల ప్రకృతి సుందరమైన దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామి వారికి ఆలయ కమిటీ చైర్మన్ ప్రత్యేక పూజలు చేసి ఆటల పోటీలు నిర్వహిస్తారు. జాతరలో తినుబండారాలు, పూజా సామాగ్రి, వివిధ రకాల వస్త్రాలు, ఆభరణాలు చిన్న పిల్లల ఆటవస్తువులు తో పాటు అన్ని రకాల వ్యాపార దుకాణాలు మనకు దర్శనమిస్తాయి.భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి జాతరలో పాల్గొంటారు.

మహాశివరాత్రి

మార్చు

ఈ హరిహర మహాదేవుని ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా స్థానికులు ఆలయంలో ఉత్సవాలు, ఆలయ అలంకరణ, ముస్తాబు ఘనంగా నిర్వహిస్తారు. ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన భక్తులతో పాటు పరిసరా గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోని పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు[2].

కుస్తీ పోటీలు

మార్చు

ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడలేని విధంగా ఇచ్చట కుస్తీ పోటీలు,కబ్బడ్డి పోటీలు, క్రీకెట్ పోటీలు మొదలగు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. హారహర మహాదేవుడి ప్రత్యేక పూజలు అనంతం ఈ కుస్తీ పోటీలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కుస్తీ పోటీలో పాల్గొనడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర లోని యవత్మాల్, నాందేడ్, పర్భని ,డిగ్రెస్ , చంద్రపూర్ , నుండి మల్లయోధులు అధిక సంఖ్యలో వస్తారు. కుస్తీ పోటీలో విజేతగా నిలిచిన మల్లయోధులకు ఆలయ కమిటీ సన్మానతో ముఖ్య అతిథి వారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఎలా చేరుకోవచ్చు

మార్చు

ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇతర ప్రాంతాలు మహారాష్ట్ర నుండి వచ్చే భక్తులు,మల్లయోధులు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి.అచటి నుండి బస్సుస్టేషన్ ఆదిలాబాద్ కు చేరుకొని బస్సులో నేరుగా ఉట్నూర్ మండలంలోని పులిమడుగు చేసుకొవాలి. ఆదిలాబాద్ జిల్లా నుంచి 47 కిలోమీటర్ల, ఉట్నూర్ మండల కేంద్రం నుంచి 14 కిలోమీటర్ల దూరం పులి మడుగు గ్రామం నుండి 4 కిలోమీటర్ల దూరంలో సాలేవాడ జాతర ఉంటుంది. ఆటోలో,ప్రైయివేయటు వాహనాల్లో కూడా చేరుకోవచ్చు.

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2023-02-18). "Maha Shivaratri | శివపూజకు వేళాయె.. ఆదిలాబాద్‌ జిల్లాలో ముస్తాబైన శైవక్షేత్రాలు". www.ntnews.com. Retrieved 2024-12-27.
  2. telugu, NT News (2022-03-03). "ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు". www.ntnews.com. Retrieved 2024-12-27.