మహారథి (సినిమా)
మహారథి 2007లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, స్నేహ, మీరా జాస్మిన్ నాయకానాయికలుగా నటించగా, గురుకిరణ్ సంగీతం అందించారు.
మహారథి (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.వాసు |
---|---|
నిర్మాణం | వాకాడ అప్పారావు |
రచన | తోటపల్లి మధు |
తారాగణం | బాలకృష్ణ, స్నేహ, మీరా జాస్మిన్, నవనీత్ కౌర్, విజయ నరేష్, జయప్రద, ప్రదీప్ రావత్, కోవై సరళ, సుత్తివేలు, ఆలీ (నటుడు) , జయప్రకాశ్ రెడ్డి, రాళ్లపల్లి, వేణుమాధవ్, తోటపల్లి మధు |
సంగీతం | గురుకిరణ్ |
ఛాయాగ్రహణం | శేఖర్ వి జోసఫ్ |
కూర్పు | సురేశ్ ఉర్స్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతికవర్గం:పాటలు.
మార్చు- దర్శకత్వం: పి.వాసు
- నిర్మాణం: వాకాడ అప్పారావు
- రచన: తోటపల్లి మధు
- సంగీతం: గురుకిరణ్
- ఛాయాగ్రహణం: శేఖర్ వి జోసఫ్
- కూర్పు: సురేశ్ ఉర్స్
- నిర్మాణ సంస్థ: శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్
- బాలకృష్ణ, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. రాజేష్ కృష్ణన్
- వీచే గాలులలో, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. విజయ్ జేసుదాస్
- మంగమ్మ మంగమ్మ, రచన, అనంత శ్రీరామ్, గానం.గురుకిరణ్, చేతన ఆచార్య
- మజా మజా, రచన: భువన చంద్ర, గానం. ఉదిత్ నారాయణ్, మహతి
- ఉప్పు చేప పప్పు, రచన: భువన చంద్ర, గానం.శంకర్ మహదేవన్, బాంబే జయశ్రీ
- కమలా కుచ చూచుక, రచన: భువన చంద్ర, గానం.గురుకిరణ్, సుమతి
చిత్ర విషయాలు
మార్చుఈ చిత్ర దర్శకుడు పి.వాసు గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రజనీ కాంత్ తో ఈయన తీసిన చంద్రముఖి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఈ చిత్రం మాత్రం తీవ్ర పరాజయం పాలయింది. అనుభవజ్ఞుడైన దర్శకుడై ఉండీ కూడా కథాకథనాల పై దృష్టి పెట్టకపోవడం ఈ చిత్రంలో ప్రధాన లోపం. ఈ చిత్రంలో బాలకృష్ణను ఆయన సహజ శైలికి విరుద్ధంగా చూపించిన తీరు అంత బాగోలేదు. అసలు ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ఒక అగ్ర కథానాయకుడికి సరిపోయేదిగా లేదు. కళ్యాణ్ రామ్ లాంటి హీరోకి ఆ పాత్ర ఇంకా బాగా నప్పుతుంది. ఈ చిత్రం బాలకృష్ణకూ ఆయన అభిమానులకూ మరొక సారి నిరాశను మిగిల్చింది.