అహల్యా బాయి హోల్కర్

(మహారాణి అహల్యాబాయి నుండి దారిమార్పు చెందింది)

మహారాణి అహల్యా బాయి హోల్కర్ (1725 మే 31 - 1795 ఆగస్టు 13), మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి. రాజమాత అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో జన్మించారు. ఆమె తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరొందారు.అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ 1754లో కుంభేర్ యుద్ధంలో మరణించారు. పన్నెండు సంవత్సరాల తర్వాత, ఆమె మామ మల్హర్ రావు హోల్కర్ మరణించారు. ఒక సంవత్సరం గడిచాకా ఆమె మాల్వా రాజ్యపు రాణిగా సింహాసనాన్ని అధిష్టించారు. ఆమె రాజ్యాన్ని థగ్గులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించే ప్రయత్నాలు చేశారు. ఆమె యుద్ధాలలోకి వ్యక్తిగతంగా సైన్యాన్ని నాయకత్వం వహించి ముందుకు నడిపారు. తుకోజీరావ్ హోల్కర్‌ను సేనానాయకునిగా నియమించారు.
రాణీ అహల్యాబాయి ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ ఆలయాలను నిర్మించి ప్రసిద్ధికెక్కింది. ఆమె రాజ్యాలకు ఆవల ఉన్న అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు నిర్మించారు. వాటిలో తూర్పున ద్వారక (గుజరాత్) నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారు. సోమనాథ్‌లో పాడుబడి, అపవిత్రమైవున్న సుప్రఖ్యాత సోమనాథేశ్వరాలయాన్ని ఆమె పునర్నిర్మించారు.

మహారాణి అహల్యా బాయి హోల్కర్
మాన్య మహారాణి శ్రీమంతురాలు అఖండ సౌభాగ్యవతి అహల్యాబాయి సాహిబా
Her Highness Maharani Shrimant Akhand Soubhagyavati Ahilya Bai Sahiba
ఇండోర్‌ మహారాణి అహల్యాబాయి హోల్కర్
Queen of the Malwa Kingdom
పరిపాలన1 December 1767 – 13 August 1795
Coronation1767 డిసెంబరు 11
పూర్వాధికారిMalerao Holkar
ఉత్తరాధికారిTukojirao Holkar I
జననం(1725-05-31)1725 మే 31
Grram Chaundi, Jamkhed, Ahmednagar, Maharashtra, India
మరణం1795 ఆగస్టు 13
SpouseKhanderao Holkar
Names
Ahilya Bai Sahiba Holkar
HouseHouse of Holkar
రాజవంశంమరాఠా సామ్రాజ్యం
తండ్రిమన్‌కోజీ షిండే
మతంహిందూ

జీవిత విశేషాలు

మార్చు

అహల్యా బాయి హోల్కర్, 1725వ సంవత్సరం ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామపెద్ద మంకోజీ షిండే దంపతులకు జన్మించింది. 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మరాఠా సర్దార్లలో ప్రముఖుడైన మల్హర్ రావ్ హోల్కర్ ఏకైక కుమారుడు ఖండే రావు హోల్కర్ తో అహల్యా బాయి వివాహం జరిగింది.ఈ సమయంలో ఇండోర్ పాలకుడిగా మరాఠా సర్దార్లలో ప్రముఖుడిగా మల్హర్ రావ్ వెలుగొందుతున్నాడు. 1754వ సంవత్సరం కుంభేర్ కోట ముట్టడి సమయంలో ఖండే రావు మృతిచెందాడు. సతీ సహగమనానికి ఉపక్రమించిన అహల్యా బాయిని మల్హర్ రావ్ అడ్డుకున్నాడు.ఆయన అహల్యా బాయికి యుధ్ధవిద్యలలో, రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు. 1766వ సంవత్సరంలో మల్హర్ రావ్, 1767వ సంవత్సరంలో అహల్యా బాయి ఏకైక కుమారుడు మాళోజీ రావు మృతి చెందడంతో ఇండోర్ పాలనా బాధ్యతలు అహల్యా బాయి స్వీకరించారు.[1]

పరిపాలన

మార్చు

ఒక స్త్రీ పాలనా బాధ్యతలు చేపట్టడంపట్ల రఘోబా వంటి మరాఠా సర్దార్లు అభ్యంతరమం చెప్పినప్పటికీ, నాటి పీష్వా మాధవ రావు అండతో ఆమె ఇండోర్ పాలనా బాధ్యతలు చేపట్టారు. 1767వ సంవత్సరం నుండి 1795వ సంవత్సరం వరకు ఆమె ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించారు. ఆమె పర్దా పధ్ధతిని (ఘోషా) పాటించలేదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. తుకోజీ హొల్కర్ ను సుబేదార్ గా నియమించారు. సామంత నాయకులు అమెకెంతో గౌరవమిచ్చేవారు. ఇండోర్ని విస్తరింపచేశారు. రాజధానిని నర్మదా నది ఒడ్డున కొత్తగా నిర్మించిన మహేశ్వర్ కి మార్చారు. మధ్యభారత మాళ్వా ప్రాంతాన్ని మహేశ్వర్ రాజధానిగా శాంతి సౌభాగ్యాలతో పరిపాలించారు. యుధ్ధవిద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచారు. వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేశారు. కాలువలు, చెరువులు త్రవ్వించి వ్యవసాయ అభివృధ్ధికి పాటుపడ్డారు.

సేవ, హిందూ ధర్మ పరిరక్షణ

మార్చు

పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. ఆమె శివుని భక్తురాలు. మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమంతటా శివాలయాలు నిర్మించారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిమించారు. కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, ఘృష్ణేశ్వర్ ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని అలయాలను పునరుద్ధరించింది.ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేసింది. మహేశ్వర్ నేత కార్మికులను ప్రొత్సహించి మహేశ్వరం చీరలు అను కొత్త నేతను అందుబాటులోనికి తెచ్చింది. ఈనాటికీ మహేశ్వరం చీరలు మహారాష్ట్రలోనే కాక భారతదేశమంతటా ప్రసిద్ధి.

గుర్తింపు

మార్చు

భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారు. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యా బాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు.[2]

తెలుగు సాహిత్యంలో

మార్చు

అహల్యాబాయి జీవితాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం నవలగా మలచగా[3] 1958 నాటి ఎస్సెస్సెల్సీ విద్యార్థులకు ఉపవాచకంగా ఆ చారిత్రిక నవలను సంక్షిప్తీకరించారు. దీనిలో వీరేశలింగం, బాలగంగాధర తిలక్, అరవింద ఘోష్ ల జీవితాల గురించిన రచనలూ ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-25. Retrieved 2014-03-29.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2001-10-09. Retrieved 2014-03-29.
  3. భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.

ఇతర లింకులు

మార్చు