మహాలక్ష్మి (కన్నడ నటి)

మహాలక్ష్మి భారతీయ నటి. ప్రధానంగా కన్నడ చిత్రసీమకు చెందిన ఆమె తమిళం, మలయాళం, తెలుగు చలనచిత్రాలలో కూడా నటించింది.[1]

మహాలక్ష్మి
జాతీయతభారతీయురాలు
వృత్తి
  • సినిమా నటి
  • దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు1982–1993
2021-ప్రస్తుతం
తల్లిదండ్రులుఎ. వి. ఎమ్. రాజన్ (తండ్రి)
పుష్పలత (తల్లి)

కన్నడలో బారే నాన్న ముద్దిన రాణి (1990), హెంద్తిగెల్బేడి (1989), పరశురామ్ (1989), సంసార నూకే (1989), జయసింహ (1987) వంటి విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించింది. అలాగే, తమిళంలో పూ మనం (1989), ముతల్ వసంతం (1986), నంద్రి (1984) వంటి చిత్రాలు, మలయాళంలో విలిచు విలికెట్టు (1985), రంగం (1985) మొదలైన చిత్రాలలో తన నటనతో మెప్పించింది.

ఇక తెలుగులో రెండుజెళ్ళ సీత (1983) చిత్రంతో ఆమె ప్రసిద్ధిచెందింది.[2] ఆ తరువాత, ఆమె ఆనంద భైరవి (1984), కుట్ర (1986) చిత్రాలలోనూ నటించింది.[3]

2023లో, ఆమె కన్నడ మీడియ స్టార్ సువర్ణలో ప్రారంభమైన టెలివిజన్ ధారావాహిక కావేరిలో ప్రమోదా దేవి పాత్రనుపోషిస్తోంది.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె ప్రముఖ నటీనటులైన పుష్పలత, ఎ. వి. ఎమ్. రాజన్ దంపతుల కుమార్తె.[5] ఆమె వివాహమై ప్రస్తుతం చెన్నైలో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఒకరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మరొకరు ఆర్కిటెక్చర్ చదువుకున్నారు.

మూలాలు

మార్చు
  1. "ಕನ್ನಡದ ಸ್ಫುರದ್ರೂಪಿ ನಟಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಬಾಳಿನಲ್ಲಿ ಹೀಗೆಕಾಯ್ತು, ನಿಗೂಢ ಬದುಕಿನ ಸನ್ಯಾಸಿನಿ!". udayavani.com. Retrieved 21 July 2023.
  2. Desk, HT Kannada. "Senior Actress Mahalakshmi: ಒಂದು ಕಾಲದ ಸ್ಟಾರ್‌ ನಟಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಈಗ ಏನ್ಮಾಡ್ತಿದ್ದಾರೆ? ಹೇಗಿದ್ದಾರೆ?". Kannada Hindustan Times (in కన్నడ). Retrieved 6 June 2023.
  3. "Kutra (1986)". Indiancine.ma. Retrieved 2020-08-23.
  4. "Veteran actress Mahalakshmi to make her acting comeback after thirty years; details inside". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 6 September 2021.
  5. "Opportunity Knocks for Moonlighters". Moneylife NEWS & VIEWS (in ఇంగ్లీష్). Retrieved 6 June 2023.