మహా పురుషుడు

మహాపురుషుడు, 1981 లో విడుదలైన తెలుగు డ్రామా చిత్రం, దీనిని ఆదిత్య చిత్ర నిర్మాణ సంస్థ [1] లో వి. రోషిని నిర్మించింది. పి. లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించారు.[2] ఇందులో ఎన్.టి.రామారావు, జయసుధ, సుజాత ప్రధాన పాత్రలలో నటించారు.[3] చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[4][5] కొన్నేళ్ళ పాటు నిర్మాణంలో ఆలస్యమైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైంది.

మహా పురుషుడు
(1981 తెలుగు సినిమా)
Maha Purushudu.jpg
దర్శకత్వం లక్ష్మీదీపక్
నిర్మాణం వి. రోషిణి
కథ మహేష్
చిత్రానువాదం లక్ష్మీదీపక్
తారాగణం నందమూరి తారక రామారావు,
జయసుధ ,
మాగంటి మురళీమోహన్
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం కన్నప్ప
భాష తెలుగు

కథసవరించు

పెద్ద పారిశ్రామికవేత్త అయిన విజయ్ (ఎన్‌టి రామారావు) తన సోదరి లక్ష్మి (సుజాత) అంటే ఎంతో అనురాగం. అతను పద్మ (జయసుధ) అనే అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. సోదరి పెళ్ళి ఓ ధనిక కుటుంబంలో చేయాలనుకుంటాడు. కాని లక్ష్మి టాక్సీ డ్రైవర్ మురళి (మురళి మోహన్) ను ప్రేమిస్తుంది. విజయ్ వారి పెళ్ళి జరిపిస్తాడు. కానీ మురళి తల్లి కాంతం (సూర్యకాంతం) చాలా క్రూరమైనది. ఆమె లక్ష్మిని బాగా చూసుకోదు. ఈ పరిస్థితిలో విజయ్ ఏమి చేస్తాడు అనేది తదుపరి కథ.

తారాగణంసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

పాటలుసవరించు

చక్రవర్తి కూర్చిన పాటలను SEA రికార్డ్స్ ఆడియో కంపెనీ విడుదల చేసింది.

ఎస్. పాట పేరు సాహిత్యం సింగర్స్ పొడవు
1 "శ్రీ కృష్ణ" సి.నారాయణరెడ్డి పి. సుశీల 1:17
2 "మంగమ్మత్త కూతురా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 3:44
3 "తోలి సారీ" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 3:53
4 "కోవెలలో దీపంలా" సి.నారాయణరెడ్డి ఎస్పీ బాలు 4:27
5 "బోణీ కొట్టు బేరం" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 3:32
6 "చిలకలూరిపేట చిన్నాదాన్నీ" గోపి ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:50
7 "ప్రతీ వసంత వేళలో" సి.నారాయణరెడ్డి జి. ఆనంద్, పి. సుశీల 4:29

మూలాలుసవరించు

  1. "Maha Purushudu (Banner)". Chitr.com.[permanent dead link]
  2. "Maha Purushudu (Direction)". Filmiclub.
  3. "Maha Purushudu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-04. Retrieved 2020-08-06.
  4. "Maha Purushudu (Preview)". Know Your Films.
  5. "Maha Purushudu (Review)". The Cine Bay. Archived from the original on 2018-10-04. Retrieved 2020-08-06.