మహేష్ కుమతల్లి
మహేష్ ఇరనగౌడ కుమతల్లి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అథని శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మహేష్ ఇరనగౌడ కుమతల్లి | |||
కర్ణాటక శాసనసభ సభ్యుడు & కర్ణాటక రాష్ట్ర మురికివాడల అభివృద్ధి బోర్డు ఛైర్మన్ [1]
| |||
పదవీ కాలం 2018 మే 15 – 2019 జూలై 28 | |||
ముందు | లక్ష్మణ్ సవాడి | ||
---|---|---|---|
తరువాత | మహేష్ కుమతల్లి | ||
నియోజకవర్గం | అథని | ||
పదవీ కాలం 5 డిసెంబర్ 2019 – 13 మే 2023 | |||
ముందు | మహేష్ కుమతల్లి | ||
తరువాత | లక్ష్మణ్ సవాడి | ||
నియోజకవర్గం | అథని | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [2] సవాడి ( అథని తాలూకా , కర్ణాటక, భారతదేశం) | 1962 జనవరి 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ | ||
నివాసం | అథని, బెల్గాం జిల్లా , కర్ణాటక, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | KLE ఇంజనీరింగ్ కళాశాల, బెలగావి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుమహేష్ కుమతల్లి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో అథని శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ సవాడిపై 2,331 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన ఆ తరువాత 2019లో బిఎస్ యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీకి సహకరించిన ఫిరాయింపుదారుల కీలక గ్రూపులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కుమతల్లి ఉన్నాడు. కర్ణాటకలో 17 మంది కాంగ్రెస్ - జేడీ(ఎస్) ఎమ్మెల్యేలపై అప్పటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయడంతో 2019లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గజానన్ భాలచంద్ర మంగసూలిపై 39,989 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
మహేష్ 2023 శాసనసభ ఎన్నికలలో అథని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ సవాడి చేతిలో 76,122 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
మార్చు- ↑ "GOK Slum Development Board Chairman". karunadu.karnataka.gov.in. Retrieved 13 April 2020.
- ↑ MAHESH IRANAGOUDA KUMATHALLI
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ The Times of India (13 May 2023). "Athani Constituency 2019 bypolls Results". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
- ↑ The Indian Express (9 December 2019). "Athani (Karnataka) Assembly Bye-Election Results 2019 : BJP wins by over 39,000 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 21 March 2023. Retrieved 14 November 2024.