లక్ష్మణ్ సంగప్ప సవాడి (జననం 16 ఫిబ్రవరి 1960) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 ఆగస్టు 20 నుండి 2021 జూలై 28 వరకు బి.ఎస్. యడియూరప్ప మంత్రివర్గంలో కర్ణాటక 8వ ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు.

లక్ష్మణ్ సంగప్ప సవాడి
లక్ష్మణ్ సవాడి


కర్ణాటక 8వ ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
2019 ఆగస్టు 20 – 2021 జూలై 28
ముందు జీ. పరమేశ్వర
తరువాత డీ.కే. శివ కుమార్

రవాణా మంత్రి
పదవీ కాలం
20 ఆగస్టు 2019 – 28 జూలై 2021
ముందు డిసి తమ్మన్న
తరువాత బి. శ్రీరాములు

వ్యవసాయ మంత్రి
పదవీ కాలం
27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020
ముందు శివశంకర రెడ్డి
తరువాత బీసీ పాటిల్

సహకార మంత్రి
పదవీ కాలం
7 జూన్ 2008 – 9 ఫిబ్రవరి 2012
ముందు జి.టి. దేవెగౌడ
తరువాత బీజే పుట్టస్వామి

కర్ణాటక శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
17 ఫిబ్రవరి 2020 – 2023
ముందు రిజ్వాన్ అర్షద్
తరువాత జగదీష్ షెట్టర్
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023
ముందు మహేష్ కుమతల్లి
నియోజకవర్గం అథని
పదవీ కాలం
2004- 2018

వ్యక్తిగత వివరాలు

జననం (1960-02-16) 1960 ఫిబ్రవరి 16 (వయసు 64)
నాగనూరు, మైసూర్ రాష్ట్రం , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2023–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2023 వరకు)
నివాసం నాగనూర్ , మైసూర్ రాష్ట్రం , భారతదేశం[1]

రాజకీయ జీవితం

మార్చు

లక్ష్మణ్ సవాడి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో అథని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దొంగగావ్ షాహజన్ ఇస్మాయిల్‌పై 31253 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ కుమార్ తాత్యాగౌడ పాటిల్‌పై 21668 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2008 జూన్ 7 నుండి 2012 ఫిబ్రవరి 9 వరకు సహకార శాఖ మంత్రిగా పని చేశాడు.

లక్ష్మణ్ సవాడి 2004 శాసనసభ ఎన్నికలలో అథని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ ఇరానగౌడ కుమతల్లిపై 23771 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ ఇరనగౌడ కుమతల్లి చేతిలో 2331 ఓట్ల తేడాతో ఓడిపోయి, 2019 ఆగస్టు 20న బి.ఎస్. యడ్యూరప్ప మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టి 2020 ఫిబ్రవరి 17న కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై,[2] 2019 సెప్టెంబర్ 27 నుండి 2020 ఫిబ్రవరి 10వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా, 2019 ఆగస్టు 19 నుండి 2021 జూలై 28 వరకు రవాణా శాఖ మంత్రిగా పని చేశాడు.

లక్ష్మణ్ సవాడికి భారతీయ జనతా పార్టీ 2023 శాసనసభ ఎన్నికలలో అథని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీ పార్టీని వీడి,[3] కాంగ్రెస్ పార్టీలో చేరి[4] కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మహేష్ కుమతల్లిపై 76,122 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. "Laxman Sangappa Savadi (Indian National Congress): Constituency - Athani (Belgaum) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 4 January 2021.
  2. The Times of India (17 February 2020). "Laxman Savadi wins council seat, retains Karnataka DyCM post". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  3. The Times of India (12 April 2023). "Karnataka elections: Laxman Savadi, former deputy CM, quits BJP; meets Congress leader Raju Kage". Archived from the original on 10 May 2023. Retrieved 18 November 2024.
  4. Rediff (14 April 2024). "Jolt to Karnataka BJP, former deputy CM Savadi joins Cong" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  5. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  6. Hindustantimes (14 May 2023). "Karnataka assembly election 2023: Constituency-wise full list of winners from BJP, Cong, JD(S)". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.