మాంటీస్ హోటల్ (సికింద్రాబాద్)

తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ప్రాంతంలో ఉన్న హోటల్

మాంటీస్ హోటల్ (మోంట్‌గోమేరీ హోటల్ & బార్) తెలంగాణ రాజధాని హైదరాబాదుకు సమీపంలోని సికింద్రాబాద్‌లో ప్రాంతంలో ఉన్న హోటల్. ఇది 1880లలో పార్క్‌లేన్‌లో ఏర్పాటుచేయబడింది. బ్రిటీష్ అధికారులచే ఈ హోటల్, బార్‌ను స్థాపించారు.[1] హోటల్‌లో గోతిక్ ట్రేసరీడ్ కిటికీలు, చెక్క బ్రేసింగ్‌లతో నిటారుగా ఉన్న పైకప్పులు, యూరోపియన్ శైలీలో ముందరి భాగం ఉన్నాయి.

మాంటీస్ హోటల్
Restaurant information
ఆవిష్కరణ1880
ప్రస్తుతము owner(s)రమేష్ అండ్ సన్స్
వీధి చిరునామా108, సరోజిని దేవి రోడ్డు
నగరముసికింద్రాబాద్
దేశముభారతదేశం
రాష్ట్రముతెలంగాణ
దేశముభారతదేశం
Coordinates17°26′31″N 78°29′24″E / 17.4418242°N 78.4898901°E / 17.4418242; 78.4898901
రిజర్వేషన్లులేదు
శాఖలులేదు

నిర్మాణం మార్చు

1880-90 మధ్యకాలంతో ఒక పార్సీచే నిర్మించబడిన ఈ భవనం బ్రిటిష్ వారికి బార్‌గా పనిచేసింది.

వారసత్వ గుర్తింపు మార్చు

ప్రస్తుతం ఇందులో బార్ మాత్రమే నడుస్తోంది.[2] హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ ఈ మాంటీస్ హోటల్‌ను హెరిటేజ్ నిర్మాణంగా ప్రకటించింది.[3] హోటల్ శిథిలావస్థలో ఉండడంతో 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిని వారసత్వ నిర్మాణాల జాబితా నుండి తొలగించి, కూల్చివేయాలని ప్రతిపాదన చేసింది.[4] అయితే దీనిపై ఉమ్మడి ఏపీ హైకోర్టు స్టే విధించింది.[5] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

మూలాలు మార్చు

  1. "'Bridging two cultures'". May 2008. Archived from the original on 24 November 2010. Retrieved 2022-06-28.
  2. "Heritage Capital Hyderabad". Issuu. Archived from the original on 15 March 2016. Retrieved 2022-06-28.
  3. "Hyderabad Greens.org - Heritage Cell". www.hyderabadgreens.org. Archived from the original on 13 December 2011. Retrieved 2022-06-28.
  4. "State rejects pleas to protect heritage". The Hindu. 28 June 2011. Archived from the original on 8 December 2011. Retrieved 2022-06-28.
  5. "'High Court stays demolition of Monty's'". The Hindu. 19 June 2009. Archived from the original on 22 June 2009. Retrieved 2022-06-28.

బయటి లింకులు మార్చు