మాక్సిం గోర్కీ
అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్ (మార్చి 28, 1868 – జూన్ 18, 1936), మాక్సిం గోర్కీ గా ప్రసిద్ధి. రష్యాకు చెందిన రచయిత. "సోషల్ రియలిజం" (సాహిత్య విధానము, రాజకీయ ఉద్యమం) స్థాపకుడు.
అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్ | |
గోర్కీ సంతకంతో కూడిన చిత్రం | |
కలం పేరు: | మాక్సిమ్ గోర్కీ |
---|---|
జననం: | నిజ్ఞీ నొవ్గోరోడ్, రష్యన్ సామ్రాజ్యం | 1868 మార్చి 28
మరణం: | 1936 జూన్ 18 (68 సంవత్సరాలు) మాస్కో, యు.ఎస్.ఎస్.ఆర్ |
వృత్తి: | రచయిత, రాజకీయ ఉద్యమకారుడు |
జాతీయత: | రష్యన్ (సోవియట్) |
Literary movement: | Socialist Realism |
బాల్యం
మార్చుగోర్కీ మార్చి 28, 1868న రష్యాలోని నిజ్ని నోవోగార్డ్‌లో జన్మంచాడు తన తండ్రి పేరును కూడా కలుపుకుని మాక్సింగోర్కీ గా ప్రాచుర్యంలోకి వచ్చాడు. మూడేళ్లప్పుడు గోర్కీ వాళ్ల నాన్న చనిపోయాడు. దీంతో అమ్మమ్మ దగ్గర గోర్కీని వదిలి తల్లి వెళ్లిపోయింది. గోర్కీ కేవలం రెండేళ్లే బడిలో చదువుకున్న గోర్కీ 12 ఏళ్ళలోపే చెప్పులు కుట్టే షాపులో, తాపీ పని, ఓడలో వంట కుర్రాడుగా పనిచేశాడు. తర్వాత రొట్టెల దుకాణంలో, నాటక కంపెనీలో పనిచేశాడు. వీధుల్లో తిరిగి పండ్లమ్మాడు. ప్లీడరు గుమాస్తాగా, రైల్వే కర్మాగారంలో కూలీగా బతుకుపోరాటం చేశాడు.
సుభాషితాలు
మార్చు- "లొంగని శత్రువుకు మరచిపోండి."
- "పని, ఆనందమైతే, జీవితం సంతోషమవుతుంది! పని, బాధ్యతైతే, జీవితం బానిసత్వమవుతుంది."
- "ఒక అసంతోషి, ఇంకో అసంతోషి కోసం వెతికి, ఆనందం పొందుతాడు."
గోర్కీ గ్రంథాల తెలుగు అనువాదాలు
మార్చుగోర్కీ రచించిన గ్రంథాలు తెలుగులోకి అనువాదమయ్యాయి.
అమ్మ
మార్చుఅమెరికాలోని అడిరాన్ డాక్ పర్వతశ్రేణిలో ప్రవాస జీవితం గడుపుతూ, అమ్మకు ప్రాణం పోశాడు గోర్కీ. విప్లవకారుడైన కొడుకు భావాల బాటలో నడుస్తూ - సోషలిజాన్ని మతస్ఫూర్తితో కొనసాగించడం అమ్మకు సహజంగానే అబ్బింది. అమ్మతో ప్రపంచ ప్రసిద్ధమైన గోర్కీ మేధో ప్రస్థానం "అధోజనం" "మధ్య తరగతులు" అన్న ప్రసిద్ధ నాటకాల మీదుగా సాగి -"అసందర్భ ఆలోచనలు (1918, కొత్త జీవితం (Navya Zhizn, New Life) పత్రికలో కొనసాగి - "అర్టమోం వాణిజ్యం (1925) వరకూ విస్తరించింది.
అమ్మ పలుమార్లు తెలుగులోకి అనువాదమయింది:
- క్రొవ్విడి లింగరాజు గోర్కీ అమ్మ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. అమ్మ నవల 1956 నాటికి ఆరో ముద్రణ పొందింది.[1]
-
అమ్మ ముఖచిత్రం
-
బ్యాక్ కవర్
ఇవీ చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అమ్మ గ్రంథ ప్రతి
- Brief biography
- Maxim Gorky Internet Archive at Marxists.org
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Maxim Gorky పేజీ
- "Anton Chekhov: Fragments of Recollections" by Maxim Gorky
- Some works of Maxim Gorky in the original Russian
- The Song of the Stormy Petrel in original Russian
- The Song of the Storm-Finch translated into English by Alice Stone Blackwell
- Works by Maxim Gorky at Project Gutenberg
- Informative review of Gorky's short fiction
- Text of Gorky Essay on Coney Island
- Marxist Tributes to Maxim Gorky
- Maxim the Bitter Life experiences influencing the work of Maxim Gorky
- A collection of images of the Maxim Gorkiy A collection of images of the Maxim Gorkiy
మూలాలు
మార్చు- ↑ అమ్మ:మూలం.మాక్సిం గోర్కీ, అనువాదం.క్రొవ్విడి లింగరాజు:ఆదర్శ గ్రంథమండలి:1956(ఆరో ముద్రణ)