మాచర్ల పురపాలక సంఘం

మాచర్ల పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలోని,మాచర్ల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

మాచర్ల పురపాలక సంఘం
మాచర్ల
స్థాపన1983
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
మాచర్ల
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

మాచర్ల పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 127 కి.మీ దూరంలో ఉంది.1983లో మునిసిపాలిటీగా స్థాపించబడింది. ఈ పురపాలక సంఘంలో 31 ఎన్నికల వార్డులు ఉన్నాయి. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.

రమణబాబు ... మాచర్ల మున్సిపాలిటీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగిన విధంగా పనిచేశారు ఒకప్పుడు గ్రామపంచాయతీగా ఉన్న మాచర్ల 1983 నవంబరు 19న పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. 2011 నాటికి పట్టణంలో దాదాపు 60 వేల మంది నివసిస్తున్నారు. మాచర్ల పట్టణంలో పురపాలక సంఘం కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రమణబాబు రూటే సపరేటు. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా ప్రణాళిక బద్దంగా పనిచేస్తూ, తోటి ఉద్యోగుల పట్ల స్నేహంగా వ్యవహరిస్తూ,ఆఫీసులో అందర్నీ కలుపుకొని ఆయన సాగదించిన ప్రగతి అద్భుతం అని చెప్పాలి. పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు వేస్తూ మరో ప్రక్క సమస్యలను పరిష్కరిస్తూ క్లీన్ మాచర్ల గ్రీన్ మాచర్ల నినాదంతో స్వచ్ఛ సైనికులు, సచివాలయ సిబ్బంది సహకారంతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మాచర్ల మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా నిలబెట్టి, రెండుసార్లు బెస్ట్ కమీషనర్ అవార్డును దక్కించుకున్నారు. జీవిత విశేషాలు: ఒంగోలులో ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీనివాసరావు రమాదేవి దంపతులకు జన్మించిన రమణ బాబు టెన్త్ క్లాస్ వరకు చిలకలూరిపేట హైస్కూల్లో విద్యనభ్యసించారు. ఒంగోలు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత మాచర్ల పురపాలక సంఘంలో జూనియర్ అసిస్టెంట్ గా 1999లో ఉద్యోగంలో చేరారు. ఆరు సంవత్సరాల పాటు ఆర్ ఐగా పనిచేశారు. 2009లో మరల మాచర్లలో పోస్టింగ్ పొందారు .సొంత ఊరు కన్నా మాచర్ల అంటే ఆయనకు ఎంతో ప్రేమ అభిమానం. మాచర్ల పట్టణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మాచర్లలో పనిచేయడం నా అదృష్టం అనే భావనతో పట్టణ ప్రజల, అధికారుల, నాయకుల సహకారంతో స్వచ్ఛ సర్వేక్షన్ లో మాచర్ల మున్సిపాలిటీకి 8 వ ర్యాంకు తీసుకువచ్చారు. జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు మాచర్ల మున్సిపాలిటీకి రావడంలో ఆయన కృషి మరువలేము. తడి పొడి చెత్త వేరు చేసి వాటిని కంపోస్ట్ ఎరువుగా మార్చడం కోసం ఆయన ప్రయాస మాటల్లో వివరించలేము ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలలో విరివిగా పాల్గొంటూ ప్రజల అవగాహన కల్పిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఫ్రెండ్లీ కమీషనర్ గా గుర్తింపు పొందారు పని పూర్తి వరకు అక్కడే ఉంటూ ఒక అధికారి వల్లే కాకుండా ఒక సేవకున్నిలా పనిచేస్తూ ఉద్యోగులకు మాదిరిగా నిలిచారు మాచర్ల మున్సిపల్ చరిత్రలో రమణబాబుది సువర్ణ అధ్యాయాలతో రాయదగిన చరిత్ర. ఎన్నికల నేపథ్యంలో మాచర్ల నుండి మరో ప్రాంతానికి బదిలీ అయిన సందర్భంగా కమిషనర్ గారు వెళ్తున్నారు అని విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు, ఆప్తులు వెల్లువల వచ్చి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఉద్వేగానికి గురయ్యారు.. కమిషనర్ గారు చరిత్ర మరువదు పట్టణానికి మీరు చేసిన సేవలు పల్నాటి ప్రజలకు గుండెల్లో శాశ్వత జరగని ముద్ర వేసిన మీ పనితీరు ముందున్న తరాలకు మాదిరి.బదిలీపై వెళ్తున్న సందర్భంగా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను మొదటగా పోస్టింగ్ పొందినది ఈ పట్టణంలోనే అని, ఎంతో ఇష్టంతో,ప్రేమతో ఈ పట్టణంలో ఒక అధికారి వలే కాక ఒక సేవకుని వలే పనిచేసే అదృష్టం దొరికిందని అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మొదలుకొని సాధారణ ప్రజలందరూ ఎంతో సహకరించడం వలన మాచర్ల పురపాలక సంఘానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు.ఈ సందర్భంగా తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కమిషనర్ రమణ బాబుకు అభినందనలు తెలుపుట కోసం పట్టణంలో ప్రజలు వెల్లువలా వచ్చారు. పురపాలక సంఘం అంత సన్నిహితులు, స్నేహితులతో నిండిపోయింది. ఇంతమంది గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆయన, మరల తిరిగి ఈ పట్టణంలో మరింత సేవ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

జనాభా గణాంకాలు మార్చు

ఈ పురపాలక సంఘం పరిధిలో 2001 నాటికి 49221 జనాభా ఉండగా, 2011 నాటికి 57,290 మందికి పెరిగారు.2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పురపాలక సంఘ జనాభా 57,290 మంది జనాభా ఉండగా, అందులో పురుషుల సంఖ్య 28,454 కాగా, స్త్రీలు 28,836 మంది ఉన్నారు.పట్టణ పరిధి 10.58 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది.పురపాలక సంఘం పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6430 మంది ఉన్నారు. మాచర్ల నగర అక్షరాస్యత రేటు రాష్ట్ర 71.13% ఉండగా అందులో పురుషుల అక్షరాస్యత 80.37%, స్త్రీల అక్షరాస్యత 62.09%.గా ఉంది.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా గోపవరపు శ్రీదేవి పనిచేస్తుంది.[2] వైస్ చైర్మన్‌గా నెల్లూరి మంగమ్మ పనిచేస్తుంది.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

 
లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయం

ఇతర వివరాలు మార్చు

ఈ పురపాలక సంఘంలో 14605 గృహాల ఉన్నాయి.15 రెవెన్యూ వార్డులు,29 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ పరిధిలో 26 మురికివాడలు ఉండగా, అందులో జనాభా 21070 ఉన్నారు.పురపాలక సంఘం పరిధిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి,7ప్రభుత్వ పాఠశాలు,2 ఉన్నత పాఠశాలలు, 2 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు,5 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Macherla Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-28.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.
  3. https://books.google.co.in/books?id=nxtnsT8CdZ4C&pg=PA65&dq=thallapalle&redir_esc=y#v=onepage&q=thallapalle&f=false

వెలుపలి లంకెలు మార్చు