ప్రదీప్ మాచిరాజు

వ్యాఖ్యాత, నటుడు
(మాచిరాజు ప్రదీప్ నుండి దారిమార్పు చెందింది)

ప్రదీప్ మాచిరాజు ఒక టీవీ వ్యాఖ్యాత. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. జీ తెలుగు లో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమాన్ని రూపొందించి దానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. జీ తెలుగులో ప్రసారమైన గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి గాను ప్రదీప్ కు టీవీ నంది పురస్కారం లభించింది.[2]

ప్రదీప్ మాచిరాజు
జననం (1985-10-23) 1985 అక్టోబరు 23 (వయసు 39) [ఆధారం చూపాలి] అమలాపురం,తూర్పు గోదావరి జిల్లా ,ఆంధ్ర ప్రదేశ్
విద్యఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
విద్యాసంస్థవిజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదు
వృత్తిటివి వ్యాఖ్యాత
తల్లిదండ్రులు
  • పాండురంగ[1] (తండ్రి)

వృత్తి

మార్చు

ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత విదేశాలకు వెళ్ళి ఎం. బి. ఎ చదవాలనుకున్నాడు. కానీ తల్లిదండ్రుల అనుమతితో కొంత సమయం తీసుకుని మరేదైనా వృత్తిలో ప్రవేశించాలనుకున్నాడు. కొద్ది రోజులు ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేశాడు. తర్వాత రేడియో జాకీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అక్కడ అతని గాత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

సినిమాలు

మార్చు

వివాదం

మార్చు

డిసెంబరు 31, 2017 న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల ప్రదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.[4] కారు స్వాధీనం చేసుకుని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు.[5]

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (2 May 2021). "యాంకర్‌ ప్రదీప్‌ తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
  2. "Here's what Pradeep has to say about his life, success and the latest season of KTUC". timesofindia.indiatimes.com. Retrieved 19 January 2018.
  3. ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Archived from the original on 18 March 2015. Retrieved 24 February 2020.
  4. Jonnalagadda, Pranita. "Pradeep Machiraju apologises". deccanchronicle.com. Deccan Chronicle. Retrieved 19 January 2018.
  5. "కోర్టుకు హాజరైన యాంకర్‌ ప్రదీప్‌". హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 19 జనవరి 2018. Retrieved 19 జనవరి 2018.