మాచ బొల్లారం
మాచ బొల్లారం, సికింద్రాబాదు జోన్ లోని అల్వాల్ సర్కిల్ లో ఉంది. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండల పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ లోని వార్డు నంబరు 133 లో ఉంది.[2]
మాచ బొల్లారం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°30′52″N 78°30′49″E / 17.51444°N 78.51361°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
నగరం | హైదరాబాదు |
విస్తీర్ణం | |
• Total | 8.36 కి.మీ2 (3.23 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 19,385 |
• జనసాంద్రత | 2,300/కి.మీ2 (6,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 010 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భౌగోళికం
మార్చుమాచ బొల్లారం 17°30′52″N 78°30′49″E / 17.51444°N 78.51361°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.
విస్తీర్ణం - జనాభా
మార్చుఇది 8.36 చ.కి.మీ. (3.23 చ.మై.)ల విస్తీర్ణంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఇక్కడ 19,385 జనాభా ఉంది.
సమీప ప్రాంతాలు
మార్చుకృష్ణ నగర్ కాలనీ, గోపాల్ నగర్ కాలనీ, అల్వాల్, చంద్ర నగర్ కాలనీ, చేతనా హౌసింగ్ కాలనీ మొదలైనవి ఇక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతాలు.[3]
రవాణా
మార్చుమాచ బొల్లారం ప్రాంతం, కొంపల్లి నుండి 5 కి.మీ., అల్వాల్ నుండి 2 కి.మీ., సికింద్రాబాదు రైల్వే స్టేషను నుండి 10 కి.మీ., బేగంపేట విమానాశ్రయం నుండి 11 కి.మీ., రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 42 కి.మీ.ల దూరంలో ఉంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మాచ బొల్లారం నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలోని బొల్లారం బజార్ రైల్వే స్టేషను నుండి ఎం.ఎం.టి.ఎస్. రైలు సర్వీసులు కూడా ఉన్నాయి.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 44. Retrieved 2021-01-18.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-18.
- ↑ 3.0 3.1 "Machabollaram, Bolarum, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-18.