మాతికెట్టన్ షోలా జాతీయ వనం
మాతికెట్టన్ షోలా జాతీయ వనం కేరళ, ఇడుక్కి జిల్లా, ఉడుంబంచోలా తాలూకా లోని పూపారా ప్రాంతంలో ఉంది..[1] ఇది 12.82 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 1897 లో ట్రావెన్కూరు ప్రభుత్వం ఈ అడవిని రిజర్వు ఫారెస్టుగా గుర్తించింది. ఇందులోని కొంత భాగాన్ని ఏలకుల తోటల పెంపకానికి లీజుకిచ్చారు. ఆ తరువాత, ఇందులోని వృక్ష జంతుజాలాన్ని, పర్యావరణాన్నీ సంరక్షించేందుకు దీన్ని 2003 నవంబరు 21 న జాతీయ వనంగా ప్రకటించారు.[2] ఈ వనంలో ఏనుగు ప్రధానమైన జంతువు.
మాతికెట్టన్ షోలా జాతీయ వనం | |
---|---|
ప్రదేశం | కేరళ, భారతదేశం |
సమీప నగరం | మున్నార్ |
విస్తీర్ణం | 12.82 కి.మీ2 (4.95 చ. మై.) |
స్థాపితం | 2003 నవంబరు 21 |
రవాణా మార్గం
మార్చుపూపారా నుండి మున్నార్ మీదుగా మాతికెట్టన్ షోలాకు వెళ్ళవచ్చు. కొత్తమంగళం మీదుగా పూపారా నుండి ఇడుక్కి వెళ్ళే దారి గుండా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. కొచ్చి, మదురైలు, దీనికి సమీపం లోని విమానాశ్రయాలు. దగ్గర లోని రైల్వే స్టేషను కొట్టాయం.
మూలాలు
మార్చు- ↑ Mathikettan Shola National Park Kerals Forests and Wildlife Department, 2009
- ↑ (21 November 2003) The Hindu, retrieved 6/21/2007 Mathikettan declared National Park Archived 2004-03-28 at the Wayback Machine