మున్నార్ కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న పట్టణం, హిల్ స్టేషను. మున్నార్ సుమారు 1,600 మీ. ఎత్తున పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలోఉంది.  [2] మున్నార్ ను "దక్షిణ భారత కాశ్మీర్" అని కూడా పిలుస్తారు. హనీమూన్ వెళ్ళేవారికి ఇది ప్రసిద్ది. మున్నార్‌లోని పూర్వపు కుందా వ్యాలీ రైల్వే 1924 లో వచ్చిన వరదల్లో ధ్వంసమైంది. అయితే పర్యాటకులను ఆకర్షించడానికి రైల్వే మార్గాన్ని పునర్నిర్మించాలని పర్యాటక అధికారులు పరిశీలిస్తున్నారు. [3]

మున్నార్
హిల్ స్టేషను
మున్నార్ దృశ్యం
మున్నార్ దృశ్యం
ముద్దుపేరు(ర్లు): 
దక్షిణ భారత కాశ్మీరు
మున్నార్ is located in Kerala
మున్నార్
మున్నార్
మున్నార్ is located in India
మున్నార్
మున్నార్
అక్షాంశ రేఖాంశాలు: 10°05′21″N 77°03′35″E / 10.08917°N 77.05972°E / 10.08917; 77.05972Coordinates: 10°05′21″N 77°03′35″E / 10.08917°N 77.05972°E / 10.08917; 77.05972
దేశంభారత దేశం
రాష్ట్రంకేరళ
జిల్లాఇదుక్కి జిల్లా
పేరు వచ్చినవిధముటీ తోటలు, చల్లటి వాతావరణం
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంపంచాయితీ
 • నిర్వహణమున్నార్ గ్రామ పంచాయితీ
విస్తీర్ణం
 • మొత్తం187 కి.మీ2 (72 చ. మై)
సముద్రమట్టము నుండి ఎత్తు1,532 మీ (5 అ.)
జనాభా
(2001)
 • మొత్తం38,471
 • సాంద్రత210/కి.మీ2 (530/చ. మై.)
భాషలు
 • అధికారికమలయాళం, English
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
PIN
685612
Telephone code04865
వాహనాల నమోదు కోడ్KL-68, KL-06
అక్షరాస్యత76%
జాలస్థలిkeralatourism.org/destination

పద చరిత్రసవరించు

మున్నార్ అంటే "మూడు నదులు" అని అర్ధం. [4] ముదిరపుళ, నల్లతన్ని, కుండలి అనే మూడు నదుల సంగమం వద్ద ఉన్న ప్రదేశం మున్నార్ అని సూచిస్తుంది. [5]

స్థానంసవరించు

మున్నార్ యొక్క భౌగోళిక నిర్దేశాంశాలు 10 ° 05′21 ″ N 77 ° 03′35 ″ E. మున్నార్ పట్టణం దేవికులం తాలూకాలోని కన్నన్ దేవన్ హిల్స్ లో ఉంది. దాదాపు 557 చ.కి.మీ. లతో విస్తీర్ణం గల మున్నార్, ఇడుక్కి జిల్లాలో కెల్లా అతిపెద్ద పంచాయతీ.  

త్రోవసవరించు

 
మున్నార్ కెఎస్ఆర్టిసి బస్ స్టాండ్

మున్నార్‌కు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు ఉన్నాయి. ఈ పట్టణం కొచ్చి - ధనుష్కోడి జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 49) లో కొచ్చి నుండి 130 కి.మీ., ఆదిమాలి నుండి  31 కి.మీ.,     ఆదిమాలి నుండి, తమిళనాడులోని ఉడుమలైపెట్టై నుండి 85 కి.మీ.,  నెరియమంగళం నుండి 60 కి.మీ. దూరంలో ఉంది.

రైల్వేసవరించు

సమీప ప్రధాన రైల్వే స్టేషన్లు ఎర్నాకుళం, అలువా (రోడ్డు ద్వారా సుమారు 140 కి.మీ). సమీప ఫంక్షనింగ్ రైల్వే స్టేషన్ ఉడుమలైపెట్టై వద్ద ఉంది.

విమానాశ్రయంసవరించు

సమీప విమానాశ్రయం 110 కి.మీ. దూరంలో ఉన్న కొచ్చిలో ఉంది.  కోయంబత్తూర్, మదురై విమానాశ్రయాలు  165 కి.మీ. దూరంలో ఉన్నాయి.

వృక్ష జంతుజాలాలుసవరించు

 
మున్నార్ వద్ద టీ తోటలు

తోటల పెంపకం ఫలితంగా ఆవాస ప్రాంతాలు విచ్ఛిన్నమయ్యాయి. ఈ కారణంగా మున్నార్ లోని స్థానిక వృక్షజాలం, జంతుజాలం చాలావరకు కనుమరుగయ్యాయి. అయితే, కొన్ని జాతులు జీవించి, సమీపంలోని రక్షిత స్థలాల్లో వృద్ధి చెందుతున్నాయి. తూర్పున ఉన్న కురింజిమల అభయారణ్యం, ఈశాన్యం లోని చిన్నార్ అభయారణ్యం, మంజంపట్టి లోయ, ఇందిరా గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం లోని అమరావతి అడవి, ఉత్తరాన ఎర్నాకుళంలో నేషనల్ పార్కు, అనాముడి షోలా నేషనల్ పార్కు, దక్షిణాన పంపడం షోలా నేషనల్ పార్కు, తూర్పున ప్రతిపాదిత పళని హిల్స్ నేషనల్ పార్క్ వంటివి ఈ రక్షిత స్థలాల్లో కొన్ని.

స్థానిక జాతులుసవరించు

 
మున్నార్ సమీపంలోని రాజమలై వద్ద నీలగిరి తహర్

ఈ రక్షిత ప్రాంతాల్లో అనేక క్షీణిస్తున్న జాతులకు చెందిన జీవులున్నాయి.  నీలగిరి థార్, నెరసిన వన్నె పెద్ద ఉడుత, నీలగిరి వుడ్ పిజియన్, ఏనుగు, గౌర్, నీలగిరి లంగూర్, సాంబార్, నీలకురింజి (పన్నెండేళ్ళకు ఒకసారి పూచే మొక్క) వీటిలో కొన్ని. [6] [7]

భూమి యాజమాన్యంసవరించు

ల్యాండ్ మాఫియా ఆస్తులను కబ్జా చెయ్యడం మున్నర్‌లో పెద్ద సమస్య. 2011 లో, ప్రభుత్వం 20,000 హెక్టార్ల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు అంచనా వేసింది. ఈ ఆక్రమణలను ఎత్తివేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. [8]

మున్నార్‌లో చెయ్యదగ్గ పనులుసవరించు

మున్నార్‌లో నాలుగు ప్రధాన దిశల్లో పర్యటనకు వెళ్ళవచ్చు.మట్టుపట్టి వైపు, తెక్కెడి వైపు, ఆదిమాలి వైపు, కోయంబత్తూర్ వైపు. మున్నార్‌లో పర్యాటకానికి వాతావరణం, టీ తోటలూ ఆధారం. చుట్టూ పరుచుకుని ఉన్న పచ్చటి తివాచీ లాంటి ప్రకృతిని చూడటానికి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. దేశవ్యాప్తంగా వేసవి సెలవుల రోజులైన ఏప్రిల్ - మే నెలల్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.

భౌగోళికం, శీతోష్ణస్థితిసవరించు

మున్నార్ ఎత్తు సముద్ర మట్టం నుండి 1,450 మీ. - 2,695 మీ. ఎత్తున ఉంది. ఉష్ణోగ్రత శీతాకాలంలో 5 - 25oC మధ్య, వేసవిలో 15 -25 oC ల మధ్య ఉంటుంది. అత్యల్పంగా, మున్నార్ లోని సెవెన్మల్లె ప్రాంతంలో -4oC నమోదైంది. [9]   

Climate data for Munnar
Month జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు Year
సగటు అధిక °C (°F) 22.4 23.7 25.3 25.6 25.6 23.7 22.4 22.8 23.2 22.7 21.8 21.9
రోజువారీ మీన్ °C (°F) 17.6 18.7 20.2 21 21.4 20.3 19.3 19.5 19.6 19.2 18.3 17.7
సగటు అల్ప °C (°F) 12.9 13.7 15.1 16.5 17.3 16.9 16.3 16.3 16 15.7 14.8 13.5
Precipitation mm (inches) 18 29 47 129 189 420 583 364 210 253 164 64
Avg. rainy days 2 2 3 6 8 9 10 9 10 12 8 5
Mean monthly sunshine hours 248 232 248 240 217 120 124 124 150 155 180 217
Source #1: Climate-Data.org, altitude: 1461m[10]
Source #2: Weather2Travel for sunshine and rainy days[11]
 
తేయాకు తోటల చుట్టూ కొండలు, మున్నార్

గ్యాలరీసవరించు

మూలాలుసవరించు

 1. Munnar - Fallingrain
 2. "Munnar - the Hill Station of Kerala in Idukki | Kerala Tourism". మూలం నుండి 2014-01-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-02-16. Cite web requires |website= (help)
 3. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 4. Munnar History Error in webarchive template: Check |url= value. Empty.
 5. Munnar.
 6. "Government of Kerala, Forest and Wildlife Department, Notification No. 36/2006 F&WLD". Kerala Gazette. 6 October 2006. మూలం నుండి 30 డిసెంబర్ 2007 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-12-05.
 7. Roy, Mathew (25 September 2006). "Proposal for Kurinjimala sanctuary awaits Cabinet nod". The Hindu. Retrieved 2007-12-05.
 8. Jacob, Jeemon (12 July 2011). "Kerala government launches eviction drive in Munnar". మూలం నుండి 27 ఆగస్టు 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-07-10. Cite news requires |newspaper= (help)
 9. Frost hits plantations in Munnar[ఆధారం యివ్వలేదు]
 10. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Climate-Data.org అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 11. "Munnar Climate and Weather Averages, Kerala". Weather2Travel. Retrieved 2013-08-28. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=మున్నార్&oldid=2875023" నుండి వెలికితీశారు