మాధవపెద్ది మీనాక్షి

మాధవపెద్ది మీనాక్షి ప్రముఖ సంగీత విద్వాంసులు. ఈమె విజయవాడకు చెందినవారు. వీరి తల్లి వెంకట లక్ష్మమ్మ. ఈమె శాస్త్రీయ సంగీతమును పారుపల్లి రామకృష్ణయ్య గారి వద్ద నేర్చుకున్నారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో బి.ఎ. డిప్లొమా పొందారు.

మాధవపెద్ది మీనాక్షి

ఈమె చిరుతప్రాయంలోనే ఆకాశవాణి నిర్వహించే శాస్త్రీయ సంగీత పోటీలలొ బహుమతీ పొందారు. తర్వాత జాతీయస్థాయిలో ఆకాశవాణి మద్రాసు కేంద్రం నిర్వహించిన సంగీత పోటీలలో పాల్గొన్నారు.

ఈమె తెనాలిలో "Trinity College of Music" అనే సంస్థను 1974లో స్థాపించి ఎందరో బాలబాలికలను సంగీతం నేర్పుతున్నారు.[1] వీరి శాస్త్రియ, లలిత సంగీత కచేరీలు తరచుగా ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారం చేయబడుతున్నాయి.

వీరి భర్త మాధవపెద్ది లక్ష్మణమూర్తి తెనాలిలో ప్రముఖ న్యాయవాదిగా ఉంటున్నారు.

మూలాలు

మార్చు
  1. నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీలు: 385-6.