మార్కో జాన్సెన్

మార్కో జాన్సెన్ (జననం 2000 మే 1) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. అతను దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుకు, దేశీయ మ్యాచ్‌లలో వారియర్స్‌కూ ఆడతాడు. [2]

మార్కో జాన్సెన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2000-05-01) 2000 మే 1 (వయసు 24)
క్లెర్క్స్‌డార్ప్, నార్త్‌వెస్ట్, దక్షిణాఫ్రికా
ఎత్తు2.09 m (6 ft 10 in)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
పాత్రBowling ఆల్ రౌండరు
బంధువులుDuan Jansen (Twin brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 349)2021 డిసెంబరు 26 - ఇండియా తో
చివరి టెస్టు2023 ఫిబ్రవరి 28 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 144)2022 జనవరి 19 - ఇండియా తో
చివరి వన్‌డే2023 ఏప్రిల్ 2 - నెదర్లాండ్స్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.70
తొలి T20I (క్యాప్ 96)2022 జూన్ 17 - ఇండియా తో
చివరి T20I2023 ఆగస్టు 30 - ఆస్ట్రేలియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.70
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018North West
2019–2020నైట్స్
2020–2021వారియర్స్
2021ముంబై ఇండియన్స్
2022–presentసన్ రైజర్స్ హైదరాబాద్
2022–presentSunrisers Eastern Cape
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 11 9 31 23
చేసిన పరుగులు 306 131 976 248
బ్యాటింగు సగటు 20.40 26.20 21.68 27.55
100లు/50లు 0/1 0/0 0/6 0/0
అత్యుత్తమ స్కోరు 59 43 87 43
వేసిన బంతులు 1,775 470 4,864 1,033
వికెట్లు 44 10 113 27
బౌలింగు సగటు 22.38 45.70 22.84 35.44
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/35 2/46 6/38 3/25
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 3/– 16/– 7/–
మూలం: Cricinfo, 2 April 2023

తొలి జీవితం మార్చు

అతని ప్రారంభ సంవత్సరాల్లో, జాన్సెన్ బ్యాటింగులో ఓపెనరుగా దిగేవాడు. తొమ్మిదేళ్ల వయసులో, 20 ఓవర్ల మ్యాచ్‌లో, అతను 164 పరుగులు చేశాడు. అతని తండ్రి ఆ మ్యాచ్‌ని చూసి కొడుకు ప్రతిభను గుర్తించాడు. అతనికి, అతని కవల సోదరుడు డువాన్‌కూ కలిపి నెట్స్‌లో శిక్షణ ఇచ్చాడు. [3] డువాన్ కూడా నార్త్ వెస్టు తరపున క్రికెట్ ఆడతాడు. [4]

దేశీయ, T20 ఫ్రాంచైజీ కెరీర్ మార్చు

జాన్సెన్, 2018 ఏప్రిల్ 8న 2017–18 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో నార్త్ వెస్టు కోసం తన లిస్టు A అరంగేట్రం చేశాడు [5] అతను 2018 అక్టోబరు 11న 2018–19 CSA 3-డే ప్రొవిన్షియల్ కప్‌లో నార్త్ వెస్టు తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు [6]

2019 జనవరిలో, జాన్సెన్ భారతదేశ పర్యటనకు ముందు దక్షిణాఫ్రికా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు జట్టులో ఎంపికయ్యాడు. [7] అతను 2018–19 CSA 3-డే ప్రొవిన్షియల్ కప్‌లో నార్త్ వెస్టు తరపున ఆరు మ్యాచ్‌లలో 27 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలరు. [8]

జాన్సెన్ 2019 ఏప్రిల్ 28న 2018–19 CSA T20 ఛాలెంజ్‌లో నైట్స్ కోసం తన ట్వంటీ20 రంగ ప్రవేశం చేసాడు [9] అతను 2018–19 CSA 3-డే ప్రొవిన్షియల్ కప్‌లో నార్త్ వెస్టు తరపున ఆరు మ్యాచ్‌లలో 27 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలరయ్యాడు. [10]

2019 సెప్టెంబరులో, 2019 మజాన్సి సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం డర్బన్ హీట్ జట్టుకు జాన్సెన్ ఎంపికయ్యాడు. [11]

ఫిబ్రవరి 2021లో , 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ముందు జరిగిన ఐపిఎల్ వేలంలో జాన్సన్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.[12] జాన్సన్ 9 ఏప్రిల్ 2021న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అతను తన 4 ఓవర్లలో 28 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు , ఇందులో గ్లెన్ మాక్స్వెల్ వికెట్ కూడా ఉంది - అతని తొలి ఐపిఎల్ వికెట్.[13] అదే నెలలో దక్షిణాఫ్రికాలో 2021 - 22 క్రికెట్ సీజన్కు ముందు తూర్పు ప్రావిన్స్ జట్టులో అతన్ని ఎంపిక చేశారు.[14]


2022 ఫిబ్రవరిలో జాన్సెన్‌ను 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. [15]

2023 మేలో, ప్రారంభ 2023 మేజర్ లీగ్ క్రికెట్ పోటీలో ఆడేందుకు జాన్సెన్‌ను వాషింగ్టన్ ఫ్రీడమ్ ఎంపిక చేసింది.

అంతర్జాతీయ కెరీర్ మార్చు

2021 జనవరిలో, పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం జాన్సెన్‌ను దక్షిణాఫ్రికా టెస్టు జట్టులోకి తీసుకున్నారు. [16]

2021 మేలో, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో జాన్సెన్‌ను ఎంపిక చేశారు. [17] 2021 డిసెంబరులో, జాన్సెన్ దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు మరొక పిలుపు అందుకున్నాడు -ఈసారి భారత్‌తో జరిగే వారి స్వదేశీ సిరీస్ కోసం. [18] అతను 2021 డిసెంబరు 26న భారత్‌పై తన టెస్టు రంగప్రవేశం చేశాడు. [19] అతని తొలి టెస్టు వికెట్ జస్ప్రీత్ బుమ్రా, మూడో స్లిప్‌లో వియాన్ ముల్డర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. [20]

2022 జనవరిలో, జాన్సెన్ తన తొలి వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) పిలుపు భారత్‌తో దక్షిణాఫ్రికా స్వదేశీ సిరీస్ కోసం పొందాడు. [21] అతను 2022 జనవరి 19న భారత్‌పై దక్షిణాఫ్రికా తరపున తన తొలి వన్‌డే ఆడాడు. [22] 2022 మేలో, జాన్సెన్ దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) స్క్వాడ్‌లో భారతదేశంలో విదేశీ సిరీస్ కోసం ఎంపికయ్యాడు. [23] అతను తన తొలి T20I మ్యాచ్‌ 2022 జూన్ 17న, దక్షిణాఫ్రికా తరపున భారతదేశానికి వ్యతిరేకంగా ఆడాడు. [24]

మూలాలు మార్చు

  1. "Marco Jansen Profile ESPN". ESPNcricinfo. Retrieved 2022-08-18.
  2. "Marco Jansen". ESPN Cricinfo. Retrieved 8 April 2018.
  3. "Marco Jansen, a kid who beat Virat Kohli in the nets, is now a Mumbai Indian". ESPNcricinfo. Retrieved 2021-03-23.
  4. "India vs South Africa: Meet Duan and Marco Jansen, 17-year-old twins who have impressed Virat Kohli and Co in nets". First Post. Retrieved 5 March 2019.
  5. "Final, CSA Provincial One-Day Challenge at Johannesburg, Apr 8 2018". ESPN Cricinfo. Retrieved 8 April 2018.
  6. "Cross Pool, CSA 3-Day Provincial Cup at Port Elizabeth, Oct 11-13 2018". ESPN Cricinfo. Retrieved 11 October 2018.
  7. "Uncapped Matthew Montgomery to lead SA U19s in tour to India". Cricket South Africa. Archived from the original on 30 మార్చి 2019. Retrieved 8 January 2019.
  8. "CSA 3-Day Provincial Cup, 2018/19 - North West: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 30 March 2019.
  9. "28th Match, CSA T20 Challenge at East London, Apr 28 2019". ESPN Cricinfo. Retrieved 28 April 2019.
  10. "CSA 3-Day Provincial Cup, 2018/19 - North West Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-04-09.
  11. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 సెప్టెంబర్ 2019. Retrieved 4 September 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  12. "IPL 2021 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 18 February 2021.
  13. "Live Cricket Score - MI vs RCB, Match 1, IPL 2021 | Cricbuzz.com". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2021-04-10.
  14. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  15. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
  16. "Jansen replaces Baartman as South Africa fly to Pakistan". ESPN Cricinfo. Retrieved 15 January 2021.
  17. "Subrayen, Williams crack the nod for Proteas". SA Cricket Mag. Retrieved 18 May 2021.
  18. "Duanne Olivier returns as South Africa name 21-member squad for India Tests". ESPN Cricinfo. Retrieved 7 December 2021.
  19. "1st Test, Centurion, Dec 26 - 30 2021, India tour of South Africa". ESPN Cricinfo. Retrieved 26 December 2021.
  20. "1st Test, Centurion, Dec 26 - 30 2021, India tour of South Africa". ESPN Cricinfo. Retrieved 26 December 2021.
  21. "MARCO JANSEN RECEIVES MAIDEN PROTEAS ODI CALL-UP". Cricket South Africa. 2 January 2022.
  22. "1st ODI, Paarl, Jan 19 2022, India tour of South Africa". ESPN Cricinfo. Retrieved 19 January 2022.
  23. "Nortje back in South Africa squad for India T20Is; Stubbs earns maiden call-up". ESPN Cricinfo. Retrieved 17 May 2022.
  24. "4th T20I (N), Rajkot, June 17, 2022, South Africa tour of India". ESPN Cricinfo. Retrieved 17 June 2022.