మార్క్ ట్వేయిన్

అమెరికన్ రచయిత

శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్ (నవంబర్ 30, 1835 - ఏప్రిల్ 21, 1910), తన కలం పేరైన 'మార్క్ ట్వేయిన్' గా ప్రసిద్ధికెక్కిన ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత, మానవతావాది. హకల్ బెరి ఫిన్ నవల ఈయనలోని మానవతావాదిని లోకానికి పరిచయం చేస్తుంది. ఈయన ఇతర నవలలు - టాంమ్ సాయర్, విచిత్ర వ్యక్తి, రాజు పేద ఇత్యాదులు. విలియం ఫాక్నర్ చే ట్వేయిన్ "అమెరికన్ సాహిత్య పిత" అని కీర్తించబడ్డాడు.

Mark Twain, detail of photo by Mathew Brady, February 7, 1871

బాల్యంసవరించు

శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్ (ఇక మీదట మార్క్ ట్వెయిన్ గా వాడుదాం) అమెరికా (USA) లోని ఫ్లోరిడా, మిస్సొరిలో 1835 నవంబర్ 30 న జన్మించారు. ఈయన తల్లి గారు జేన్ లామ్టాన్ క్లెమెన్స్, తండ్రి

శామ్యూల్‌కి నాలుగు సంవత్సరాల వయస్సప్పుడు అతని తల్లిదండ్రులు ముస్సోరీ రాష్ట్రంలోని హానిబల్‌ అనే ఊరికి బస మార్చేరు. ఈ ఊరు ప్రతిబింబమే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన "టామ్‌ సాయర్‌ సాహస యాత్రలు (The Adventures of Tom Sawyer, 1876), హకల్‌బెరీ ఫిన్‌ సాహస యాత్ర;లు (The Adventures of Huckleberry Finn, 1884 ) అనే పుస్తకాలలో మనకి దర్శనమిస్తుంది.

శామ్యూల్‌ తన చిరుతప్రాయం అంతా సంపన్నమైన కుటుంబంలోనే గడిపేడు. వారి సంపదకి గురుతుగా ఆ ఇంట ఎంతో మంది నీగ్రో బానిసలు ఉండేవారు. ఆ రోజుల్లో తెల్లవాళ్లు నల్ల బానిసలని ఎలా చూసేవారో మనకి ఇతని నవలలో స్పష్టంగా కనిపిస్తుంది. శామ్యూల్‌ తండ్రి 1847 లో చనిపోవడంతో వీరి సంసారం ఎన్నో ఆర్ధికమైన ఇబ్బందులని ఎదుర్కొంది. శామ్యూల్‌ బడి మానేసి ఒక ముద్రణాలయంలో చేరి, పని నేర్చుకుంటూ, పొట్టగడుపుకోవడం మొదలు పెట్టేడు. శిక్షణ పూర్తి అయిన తరువాత, 1851లో, తన అన్న ఒరాయన్‌ నడుపుతూన్న ద హానిబల్‌ జర్నల్‌ అనే పత్రికకి అచ్చు మూసలు సమకూర్చే పనిలో చేరేడు. కాని చురుకైన శామ్యూల్‌ బుర్రకి హానిబల్‌ పరిధి సరిపోలేదు; దేశ దిమ్మరిలా తిరుగుతూ న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా వంటి అనేక అమెరికా నగరాలలో పని చేసేడు.

జీవితంసవరించు

ఇరవయ్యో పడిలో పడ్డ శామ్యూల్‌కి ముద్రణాలయాల్లో నాలుగు గోడల మధ్య పనిచేయడం పడ లేదు; ఆ ఉద్యోగం వదిలేసి మిసిసిపీ నది మీద తిరిగే పడవలలో కళాసుగా చేరేడు. చేరి, ఆ వృత్తిలో ఎదిగి, చివరికి పడవని నడిపే అధికారి (pilot) గా పనిచేసేడు. ఈ అనుభవం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు. ఉదాహరణకి పడవ నడిపేటప్పుడు ఒక మునుజూపు మనిషి (leadsman) ఎదట నీటి లోతు నావ గమనానికి అనుకూలంగానే ఉందని చెప్పడానికి "బైద మార్క్, ట్వైన్" (By the mark, twain) అని అరిచేవారు. ఈ వాక్యం మధ్య భాగంలో ఉన్న "తోకని పీకగా" వచ్చిన మార్క్‌ ట్వైన్ (Mark Twain) అన్న మాటని తన కలం పేరుగా వాడుకుని శామ్యూల్‌ క్లెమెంస్ ప్రపంచ ప్రఖ్యాతి గణించుకున్నాడు. మన బాపు, ఆరుద్ర లలాగే కలం పేరు మార్క్‌ ట్వేన్‌ చాల మందికి తెలుసు - అసలు పేరు తెలియదు.

రచయుతసవరించు

మార్క్‌ ట్వైన్‌ రచనలలో కొట్టొచ్చినట్లు కనిపించేది ఆయన వాడిన మాండలికం. తరువాత చెప్పుకోదగ్గది ఆయన చలోక్తులు. ఆయన రాసిన టామ్‌ సాయర్‌ ప్రపంచ సాహితీ రంగంలో ఆయనకి ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టింది. అమెరికా అంతర్యుద్ధం పూర్తి అయి, జీవితాలు స్థిరపడుతూన్న ఆ స్వర్ణయుగపు రోజుల్లో (గిల్టు శకం) మార్క్‌ ట్వైన్‌ పుస్తకాలు వేడి వేడి పకోడీల్లా అమ్ముడు పోయి ఆయనకి కీర్తితో పాటు అయిశ్వర్యాన్ని కూడా తెచ్చి పెట్టేయి. ఆ డబ్బుతో కనెట్టికట్ రాష్ట్రంలోని హార్ట్ఫర్డ్ అనే ఊళ్ళో పెద్ద ఇల్లు కట్టుకుని, భార్య ఒలీవియాతో ఆ ఇంట్లో ఉండేవాడు.

ఇలా వచ్చిన పేరు, ప్రతిష్ఠలని దన్నుగా చేసుకుని మార్క్‌ ట్వేన్‌ హకల్‌బెరీ ఫిన్‌ నవల రాయడం ప్రారంభించేడు. ఇది టామ్‌ సాయర్‌ లా ఆడుతూ, పాడుతూ నడిచే కథ కాదు. అమెరికాలో విశృంఖలంగా ఉన్న నీగ్రో బానిసత్వం ఇక్కడ కథా వస్తువు. గిల్టు శకంలో ఈదులాడుతూన్న ప్రజలకి హకల్‌బెరీ ఫిన్‌ కథ గురువింజ గింజ వెనక ఉన్న నలుపుని ఎత్తి చూపినట్లు అవుతుందని భ్రమించి, గిల్టు (gilt) శకంలో ఉన్న వారికి వారి గిల్టు (guilt) ని ఎత్తి చూపితే రాణించదేమోనని ఆ పుస్తకాన్ని మధ్యలో ఆపేసేడు.

ముఖ్యమైన రచనలుసవరించు

తెలుగులో వచ్చిన అనువాదాలు, అనుకరణలుసవరించు

మూలాలుసవరించు

http://www.sparknotes.com/lit/huckfinn/context.html