మాలికాపురం 2023లో విడుదలైన తెలుగు సినిమా.[2] కావ్య ఫిలిం కంపెనీ బ్యానర్‌పై మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు విష్ణు శశి శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఉన్ని ముకుందన్, సజ్జు కురూప్‌, మనోజ్‌ కే జయన్‌, రంజి పానికర్‌, రమేశ్‌ పిషరోడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ తెలుగులో జనవరి 21న విడుదల చేశాడు[3].

మాలికాపురం
దర్శకత్వంవిష్ణు శశి శంకర్
రచనఅభిలాష్ పిళ్ళై
తారాగణం
ఛాయాగ్రహణంవిష్ణు నారాయణన్
కూర్పువిష్ణు శశి శంకర్
సంగీతంరంజిన్ రాజ్
పంపిణీదార్లుగీత ఆర్ట్స్
విడుదల తేదీs
21 జనవరి 2023 (2023-01-21)(థియేటర్)
16 ఫిబ్రవరి 2023 (2023-02-16)( డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో)[1]
సినిమా నిడివి
121 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ష‌న్ను (దేవ‌నంద‌) ఎనిమిదేళ్ల చిన్నారి అయ్యప్ప భక్తురాలు. శ‌బ‌రిమ‌ల వెళ్లాల‌న్న‌ది ఆమె క‌ల‌. కూతురిని శ‌బ‌రిమ‌ల తీసుకెళ్తాన‌ని తండ్రి అజ‌య్ మాటిస్తాడు. కానీ అప్పుల‌ బాధ కార‌ణంగా అవ‌మానాలు భ‌రించ‌లేక‌ అజ‌య్‌ ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. త‌న క్లాస్‌మేట్ బుజ్జితో క‌లిసి క‌ళ్యాణి శ‌బ‌రిమ‌ల వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ష‌న్నును కిడ్నాప్ చేయాల‌ని ఓ రౌడీ ప్ర‌య‌త్నిస్తుంటాడు. అత‌డి నుంచి ష‌న్ను, బుజ్జిల‌ను అయ్య‌ప్పన్‌ (ఉన్ని ముకుంద‌న్‌) కాపాడుతాడు. ఆ చిన్నారులిద్ద‌రిని శ‌బ‌రిమ‌ల తీసుకెళ్తాన‌ని మాటిస్తాడు. ఆ మాట‌ను అత‌డు నిల‌బెట్టుకున్నాడా? అయ్య‌ప్ప‌న్ ఎవ‌రు? వారికి ఎందుకు స‌హాయం చేశాడు ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (11 February 2023). "ఈ వారమే విడుదల". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  2. NTV Telugu (25 January 2023). "మాలికాపురం (మళయాళం డబ్బింగ్)". Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.
  3. Eenadu (23 January 2023). "సంక్రాంతి తర్వాత సందడి.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 25 January 2023. Retrieved 25 January 2023.
  4. Zee News Telugu (26 January 2023). "మాలికాపురం మూవీ ఎలా ఉందంటే?". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.