మాస్టర్ సి.వి.వి.

మాస్టర్ సి.వి.వి.[2][3]గా జనబాహుళ్యానికి తెలిసిన మాస్టర్ కంచుపాటి వెంకటరావు వేంకాస్వామి రావు, (4 ఆగస్టు 1868 - 12 మే 1922) ఒక భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు. ఇతడు కొంతకాలం కుంభకోణం మునిసిపల్ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా పని చేశారు . తర్వాతి కాలంలో ఆధ్యాత్మిక సంస్కర్తగా మారి మానవ ప్రగతి, ఆధ్యాత్మిక పరిణామాలపై తన దృక్పథాన్ని పరిచయం చేశారు.[4][5][6][7]

మాస్టర్ సి.వి.వి.
శిష్యులతో మాస్టర్ సి.వి.వి.(1912 డిసెంబర్ నాటి చిత్రం)
జననంకంచుపాటి వెంకటరావు వెంకాస్వామిరావు
(1868-08-04)1868 ఆగస్టు 4
కుంభకోణం, బ్రిటీషు ఇండియా (ప్రస్తుతం తమిళనాడు, భారతదేశం)
నిర్యాణము1922 మే 12(1922-05-12) (వయసు 53)
కుంభకోణం, బ్రిటీషు ఇండియా
భాగస్వా(ములు)మి
రుక్మిణి
(m. 1880; died 1904)
వెంకమ్మ
(m. 1906; died 1922)
(మరణించేవరకు)
స్థాపించిన సంస్థభ్రుక్త రహిత తారక రాజయోగం
తత్వంరాజయోగం (భ్రుక్త రహిత తారక రాజయోగం), ఎలెక్ట్రానిక్ యోగా
ప్రముఖ శిష్యు(లు)డుఎక్కిరాల కృష్ణమాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి,మైనంపాటి జ్వాలా నరసింహం, కొత్త రామకోటయ్య
ఉల్లేఖనం

కర్మ వాయిదా వేయబడదు లేదా ప్రక్షాళన చేయబడదు కాని తటస్థీకరించబడుతుంది.[1]

జీవితచరిత్ర మార్చు

మాస్టర్ సి.వి.వి. తమిళనాడులోని కుంభకోణంలో ఒక మధ్యతరగతి నియోగి బ్రాహ్మణ కుటుంబంలో 1868 ఆగష్టు 4వ తేదీ (విభవ నామ సంవత్సరం శ్రావణ బహుళ పాడ్యమి తిథి)నాడు జన్మించాడు.ఇతని ఇంటిపేరు కంచుపాటి.[8]కుప్పుస్వామి అయ్యంగార్, కామమ్మ ఇతని తల్లిదండ్రులు. ఇతని పూర్వులు విజయనగర సామ్రాజ్య కాలంలో ఆంధ్రదేశం నుండి తమిళదేశానికి వలసవచ్చారు. ఇతనికి ఐదవయేట ఉపనయనం అయ్యింది. ఇతడిని ఇతడి మేనత్త కంచుపాటి సుబ్బమ్మకు దత్తత ఇచ్చారు. సుబ్బమ్మనే ఇతని చదువు సంధ్యలు చూసుకున్నది. ఇతడు వీధి బడిలో తెలుగు, తమిళం, ఇంగ్లీషు, సుబ్బమ్మ వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. ఇతడు పద్నాల్గవ యేట మెట్రిక్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. శ్రీరంగంలో ఇంటర్ చదివాడు. డిగ్రీ చదవడానికి మద్రాస్ పంపడం తల్లికి ఇష్టం లేనందువల్ల ఇంటివద్దనే ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు[9].

వ్యక్తిగత జీవితం మార్చు

ఇతడు తన 12వ యేట రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. ఇతనికి 36యేండ్ల వయసులో ఇతని భార్య రుక్మిణి మరణించింది. ఇతడు తిరిగి 1908లో తన 38వ యేట వెంకమ్మను వివాహం చేసుకున్నాడు. ఇతనికి వెంకమ్మ ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.[10]

ఆధ్యాత్మిక, తాత్త్విక దృష్టి మార్చు

మాస్టర్ సి.వి.వి. 1910లో "భ్రుక్త రహిత తారక రాజయోగం" అనే కొత్త యోగ పద్ధతిని స్థాపించాడు. భ్రుక్తం అంటే పూర్వకర్మ. భ్రుక్తరహితం అంటే పూర్వ కర్మలు లేకుండా చేయడం. అంటే భగవంతుని దగ్గరకు వచ్చి శరణు కోరితే పూర్వ కర్మలు అన్నీపోయి తరిస్తారు అని అర్థం. ఆయనను తలిస్తే చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడనే నమ్మకం.[11]

ఎక్కిరాల వేదవ్యాస తన "మాస్టర్ c.v.v గారి ఎలక్ట్రానిక్ యోగం" అనే పుస్తకంలో నూతనయోగం గురించి ఇలా చర్చిస్తారు.

సాధారణయోగములో క్రింద (మూలాధారము) నుండి జీవశక్తి మేల్కొని సహస్రారము వైపు ప్రయాణిస్తూ పోతుంది. ఈ 'నూతన యోగం'లో జరిగే యోగ ప్రక్రియ సహస్రారముపై నుంచి ప్రారంభించి క్రిందకు దిగుతుంది. మాస్టర్ సి.వి.వి. శరీరాన్ని బ్యాటరీతో పోల్చుతూ ఎడమవైపు నెగెటివ్ కరెంట్ "ఇడా" నాడిద్వారా, కుడివైపు పాజిటివ్ కరెంట్ "పింగళా" నాడిద్వారా ప్రవహిస్తుందంటారు. చేతులు దగ్గరగా జోడించినప్పుడు హృదయచక్రంలో మెరుపు పుడుతుంది.

ఇంకా ఈ గ్రంథంలో వేదవ్యాస ఎలెక్ట్రానిక్ యోగా విధానాన్ని మేడమ్‌ బ్లావెస్కీ, జార్జ్ గుర్డ్జిఫ్, అరవింద మహర్షి, రమణమహర్షుల యోగ విధానాలలో ఉన్న సాదృశ్యాలను, తేడాలను చర్చించారు. [12] మాస్టర్ సి.వి.వి. తన శిష్యులను మీడియమ్స్ అని పిలుస్తాడు. ప్రస్తుతం మాస్టర్ సి.వి.వి.యోగా ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాస్టర్ సి.వి.వి. మీడియమ్స్ కొత్త మీడియమ్స్ కొరకు కోర్సులను నిర్వహించే పనిలో క్రియాశీలంగా ఉన్నారు.[13]

మాస్టర్ సి.వి.వి. తన జీవితకాలంలో అనేక గ్రహగతులను సరిచేసే కోర్సులను, గ్రహదోష నివారణ కోర్సులను అభివృద్ధి చేశాడు. మాస్టర్ ఎం.టి.ఎ. ఇతని గురువు. అతడు మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలలో ఒకరు. అతని యోగా విధానాన్ని ఎలెక్ట్రానిక్ యోగా అని పిలుస్తారు.[14]

మాస్టర్ సి.వి.వి., తాము భౌతికమును విడిన తరువాత ఇతరులు సాధన చేయుటకు ఈ యోగ మార్గమును ఇవ్వలేదు. జనవరి 31, 1922 తో ఈ మార్గములో క్రొత్త వారిని చేర్చుకొనుటను ఆపివేసినట్లు వారి డైరీ లో చూడవచ్చు.

గ్రంథాలు మార్చు

మాస్టర్ సి.వి.వి. బోధించిన యోగాపై వెలువడిన గ్రంథాలు:

 1. మాస్టర్ C.V.V గారి యోగమార్గ ప్రాధమిక సమాచారము (https://archive.org/details/master-cvvs-yoga-basic-information)
 2. భ్రుక్త రహిత రాజయోగం - కొత్త రామకోటయ్య (తాతగారు)
 3. మాస్టర్ సి.వి.వి. - ఎక్కిరాల కృష్ణమాచార్య
 4. మాస్టర్ సి.వి.వి.గారి ఎలక్ట్రానిక్ యోగము - ఎక్కిరాల వేదవ్యాస
 5. భ్రుక్త రహిత రాజయోగం - సాధకుల ప్రశ్నలు - సమాధానములు - ఎ.వి.శ్రీనివాసాచార్యులు
 6. మాస్టర్ సి.వి.వి. - శార్వరి
 7. Master CVV-N.R.B.V - ఎన్.బి.వి.రామమూర్తి
 8. New Yoga - నారాయణ అయ్యర్

మూలాలు మార్చు

 1. K. Parvathi Kumar (2006). Occult Meditations. Dhanishta Publications. p. 121. ISBN 978-8189467043.
 2. Cornelis Bennema; Paul Joshua Bhakiaraj (9 November 2011). Indian and Christian: Changing Identities in Modern India. SAIACS Press & Oxford House Research. p. 140. ISBN 9788187712268. Retrieved 9 November 2011.
 3. Joseph Prasad Pinto (1985). Inculturation through basic communities: an Indian perspective. Asian Trading Corp. p. 94.
 4. Triveni: Journal of Indian Renaissance, Volume 71. Triveni Publishers. 2002. p. 19.
 5. Nigel Ajay Kumar (15 January 2014). What is Religion?: A Theological Answer. SAIACS Press. p. 148. ISBN 9788187712329. Retrieved 15 January 2014.
 6. Origen Vasantha Jathanna (1981). The decisiveness of the Christ-event and the universality of Christianity in a world of religious plurality: with special reference to Hendrik Kraemer and Alfred George Hogg as well as to William Ernest Hocking and Pandipeddi Chenchiah. P. Lang. p. 364. ISBN 9783261049742.
 7. Michaël Amaladoss (22 June 2017). Interreligious Encounters: Opportunities and Challenges. Orbis Books. p. 183. ISBN 9781608336869. Retrieved 22 June 2017.
 8. Prajna Prabhakaram, a Symbol of Transcendence and Immanence: Auto-biography of Sri Veturi Prabhakara Sastri, Vēṭūri Prabhākaraśāstri, Prabhakara Prachuranalu Publishers, 1991
 9. గబ్బిట దుర్గాప్రసాద్ (1 July 2019). "అపర పతంజలి యోగి -మాస్టర్ సి.వి.వి". గురు సాయిస్థాన్: 18–20. Retrieved 29 April 2020.[permanent dead link]
 10. Ekkirala Krishnamacharya (1992). Master C.V.V. Kulapathi Book Trust. p. 9.
 11. K. Parvathi Kumar (2006). Occult Meditations. Dhanishta Publications. p. 121. ISBN 978-8189467043.
 12. Daren Callahan (28 January 2015). Yoga: An Annotated Bibliography of Works in English, 1981-2005. McFarland. p. 232. ISBN 978-1476607023. Retrieved 28 January 2015.
 13. Triveni: Journal of Indian Renaissance, Volume 53. Triveni Publishers. 1984. p. 93.
 14. Triveni: Journal of Indian Renaissance, Volume 71. Triveni Publishers. 2002. p. 19.

Sources మార్చు

బయటి లింకులు మార్చు