శార్వరి (రచయిత)
శార్వరి (వాసిలి రామకృష్ణశర్మ) ప్రముఖ పాత్రికేయుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, పండితునిగా, కథారచయితగా, నవలాకారునిగా, వ్యాసకర్తగా, నాటకరచయితగా, అనువాదకుడిగా, బాలసాహితీవేత్తగా వెలుగొందాడు. శతాధిక గ్రంథకర్త. ఆధ్యాత్మిక మార్గం వైపు మొగ్గి యోగమార్గంలో పయనించారు.
వాసిలి రామకృష్ణశర్మ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | గుంటూరు జిల్లా తెనాలి మండలం కోపల్లె గ్రామం | 1929 నవంబరు 7
మరణం | 2015 డిసెంబరు 12 హైదరాబాద్ |
కలం పేరు | శార్వరి |
వృత్తి | సంపాదకుడు, పాత్రికేయుడు,రచయిత, అనువాదకుడు |
జాతీయత | భారతీయుడు |
కాలం | 20వ శతాబ్దం |
విషయం | తెలుగు సాహిత్యము |
జీవిత భాగస్వామి | యామినీదేవి |
తండ్రి | పార్వతీశ్వరాచార్యులు |
తల్లి | ఈశ్వరమ్మ |
సంతానం | వాసిలి వసంతకుమార్, శ్యాంసుందర్, రమణ, పద్మప్రియ |
బాల్యము, విద్యాభ్యాసము
మార్చువాసిలి రామకృష్ణశర్మ గుంటూరు జిల్లా తెనాలి మండలం కోపల్లె గ్రామంలో 1929, నవంబరు 7న పార్వతీశ్వరాచారి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించాడు[1]. విశ్వబ్రాహ్మణ కులస్తుడు. ఇతడు ప్రాథమిక విద్యను కోపల్లెలో పూర్తి చేసుకుని తెనాలిలో ఉన్నత పాఠశాల చదువు ముగించాడు. ఇంటర్మీడియట్, బి.ఎ.లను గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివాడు. 1952లో బి.ఎ.పట్టాను పొందాడు. ఆంగ్లభాషాసాహిత్యాలు బి.ఎ.లో ఇతని ఐచ్ఛికాంశాలు.
కుటుంబము
మార్చుఇతడు 1955లో యామినీదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు వసంతకుమార్, శ్యామ్‌సుందర్, రమణ అనే ముగ్గురు కుమారులు, పద్మప్రియ అనే కుమార్తె జన్మించారు.
ఉద్యోగము
మార్చుబి.ఎ. పూర్తి అయిన తర్వాత ఇతడు 1952లో తెనాలిలోని వి.ఎన్.ఆర్ కళాశాలలో ఇంగ్లీషు ట్యూటర్‌గా చేరి 1958 వరకు పనిచేశాడు. ఇతని గంభీరోపన్యాసాలను విని అక్కడి విద్యార్థులు ఉత్తేజితులయ్యేవారు. అక్కడ పనిచేసే రోజుల్లో రావూరి భరద్వాజ, రాంషా, జి.వి.కృష్ణారావు, శారద మొదలైనవారు ఇతని మిత్రబృందంలో ఉన్నారు. కళాశాల విడిచిన తర్వాత జర్నలిజంలో ప్రవేశించాడు. 1958లో మద్రాసులోని ఆంధ్రప్రభలో చేరి దిన వార పత్రికలలో వివిధ హోదాలలో 30 సంవత్సరాలు పనిచేసి హైదరాబాదులో రిటైర్ అయ్యాడు. ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో విద్వాన్ విశ్వం, పిలకా గణపతిశాస్త్రి, కె.సభా, తిరుమల రామచంద్ర, తులికా భూషణ్, నండూరి పార్థసారథి మొదలైనవారు ఇతని సహోద్యోగులు.
పత్రికారంగం
మార్చుఇతడు ఆంధ్రప్రభ దినపత్రిక, ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికల సంపాదకవర్గంలో వివిధ హోదాలలో పనిచేశాడు. దినపత్రికలో ఆదివారం అనుభంధాన్ని నిర్వహించాడు. కొంతకాలం చిత్రప్రభ శీర్షికను నడిపాడు. “వింతలు-విడ్డూరాలు” శీర్షిక ఇతనికి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఉద్యోగ ధర్మంగా వేలకొలది రాజకీయ, శాస్త్ర సంబంధ, చలనచిత్ర వ్యాసాలను వ్రాసి ప్రకటించాడు. శార్వరి అనే కలంపేరుతోపాటుగా గురూజీ, కృష్ణ, శర్మ అనే పేర్లతో ఎన్నో గ్రంథసమీక్షలు, సినిమాసమీక్షలు చేశాడు. ఆంధ్రప్రభతో పాటుగా చిత్రప్రగతి, మహిళ, యోగమార్గం, యోగదర్శిని మొదలైన పత్రికలకు అడ్వైజరీ ఎడిటర్‌గా సేవలను అందించాడు. కొన్నినాళ్లు నెలవంక అనే పత్రికను నడిపాడు. సత్యసంహిత అనే పత్రికను కూడా నిర్వహించాడు.
రచనలు
మార్చుకథాసంపుటాలు
మార్చు- స్వర్గసీమ
- ఎర్రభూతం
- మమకారం
- నయాగరా
- మంజరీద్విపద
నాటకాలు
మార్చు- నిజానిజాలు[2]
- బ్రతుకుబాట
- పిచ్చిలోకం
- ఒకనాటి కథ
- దైవనిర్ణయం
- కామాయని (నృత్యనాటకం)
- మోహినీభస్మాసుర (నృత్యనాటకం)
నవలలు
మార్చు- వైతరణి
- పరిత్యక్త
- ప్రియురాలు
- అజంతా
- భగ్నజీవులు
- సౌందర్యవల్లి
- మోడల్ గర్ల్
- తైమూర్ ఖాన్
- వెన్నెల కెరటాలు
- అతనొక్కడు అతివలు ముగ్గురు
- జీవచ్ఛవం
- హేమమాలిని
- ఎలిజబెత్ టైలర్
- లయతప్పిన హృదయాలు
- చీకటిదేవతలు
ఆధ్యాత్మిక రచనలు, యోగ సాహిత్యం
మార్చు- ఆత్మయోగి సత్యకథ -1[3]
- ఆత్మయోగి సత్యకథ -2[4]
- యోగాశ్రమ జీవితం
- యోగావిజన్
- మహాయాత్ర
- ఆంధ్ర మహాసావిత్రి (ఆరవిందుని ఆంగ్ల రచన సావిత్రికి 9 సంపుటాల 1000పుటల తెలుగు అనువాదం)
- రసరేఖలు
- మాస్టర్ యోగదర్శిని (రెండు సంపుటాలు)
- The Discovery of Master Yoga
- యోగాశ్రమ లేఖలు
- గీతా పరమార్థం
- గీతా సాంఖ్యం
- మాస్టర్ ప్రేయర్స్
- Master Prayers
- The Mystery of Kundalini
- మృత్యువు తర్వాత జీవితం
- The Life beyond Death
- అతీత మానసం
- గురుదర్శనం
- విశ్వదర్శనం
- దివ్యజ్ఞానం
- జీవన్ముక్తి
- కుండలిని
- శక్తిపాతం
- సమాధి (నిర్వికల్ప)
- పరావిద్య
- ఆత్మజ్ఞానం
- బ్రహ్మజిజ్ఞాస
- ధ్యానం ఎలా చేయాలి?
- ధ్యానం - యోగం
- భృక్తం - రహితం - తారకం
- ఇహం పరం అన్నీ
- కర్ణ మహాభారతం
- శ్రీకృష్ణావతారం
- అసతోమా సద్గమయా
- తమసోమా జ్యోతిర్గమయా
- మృత్యోర్మా అమృతంగమయా
- యోగా ట్రీట్‌మెంట్
మహాత్ముల జీవితకథలు
మార్చు- భగవాన్ బుద్ధ
- మహాత్మా జీసస్
- సద్గురు సాయిబాబా
- సద్గురు రమణ
- యు.జి.కృష్ణమూర్తి:జీవితం-తాత్వికత
- భగవాన్ రజనీష్ :ధ్యాన సూత్ర
- అవతార్ మెహెర్‌బాబా
- అరవింద దర్శనం
- కొత్తకోణంలో కృష్ణమూర్తి
- మాస్టర్ సి.వి.వి.
- పరేంగిత ప్రజ్ఞ (దాదాజీ ఆత్మకథ)
బాలసాహిత్యం
మార్చు- సాగరిక
- నాగార్జున
జ్యోతిష్య శాస్త్రం
మార్చు- జ్యోతిష సాముద్రిక సర్వస్వం
- Secrets of Palmistry
- హస్తసాముద్రికం
కావ్యాలు
మార్చు- రోదసి
- ఆరాధన
ఇతరాలు
మార్చు- కథలు రాయడం ఎలా?
- కథలెలా రాస్తారు
యోగసాధన
మార్చు1970 తరువాత ఇతని జీవితంలో మార్పు వచ్చింది. మాస్టర్ సి.వి.వి. యోగమార్గంపై ఇతడు తన దృష్టిని మరలించాడు. సి.వి.వి. యోగజీవితాన్ని, యోగమార్గాన్ని The Discovery of Master Yoga అనే పేరుతో ఆంగ్లభాషలో రచించాడు. దానినే తెలుగులో మాస్టర్ యోగదర్శిని అనే పేరుతో రెండుసంపుటాలలో అనువదించాడు. తన యోగ జీవితాన్ని ఆత్మయోగి సత్యకథ అనే పేరుతో రెండు భాగాలుగా, మహాయాత్ర పేరుతో మరో గ్రంథంగా వ్రాశాడు. మద్రాసులో ఇతడు సి.వి.వి. యోగాస్కూలు మాస్టర్ యోగాశ్రమం పేరుతో స్థాపించాడు. తరువాత దానిని సికిందరాబాదులో తిరుమలగిరికి తరలించాడు. ఈ స్కూలులో వేలకొలది వ్యక్తులు యోగశిక్షణ పొంది ఇతని శిష్యులుగా మారారు.
మరణం
మార్చుఇతడు తన 87 యేట హైదరాబాదులో 2015, డిసెంబర్ 12వ తేదీన కన్నుమూశాడు. [5]
మూలాలు
మార్చు- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు (2012-09-01). విశ్వబ్రాహ్మణ సర్వస్వము విశ్వబ్రాహ్మణ ప్రముఖులు ప్రథమ భాగము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 335–338.
- ↑ శార్వరి (1953-01-01). నిజానిజాలు (1 ed.). తెనాలి: కళావాణి పబ్లికేషన్స్. Retrieved 2 March 2015.
- ↑ శార్వరి (1998-03-01). ఆత్మయోగి సత్యకథ (1 ed.). సికిందరాబాద్: మాస్టర్ యోగ్రాశ్రమ్. Retrieved 2 March 2015.
- ↑ శార్వరి (1998-03-01). ఆత్మయోగి సత్యకథ-2 (1 ed.). సికిందరాబాద్: మాస్టర్ యోగాశ్రమం. Retrieved 2 March 2015.
- ↑ ఆంధ్రభూమి దినపత్రికలో వార్త