మాస్టర్ (2021 సినిమా)

మాస్టర్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో మాస్టర్ పేరుతో విడుదలైన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు తెలుగులో విడుదల చేశాడు. విజయ్, విజయ్​ సేతుపతి, మాళవిక మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 విడుదలకావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ 2021 జనవరి 13న తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషాల్లో విడుదలైంది.[1] మాస్టర్ సినిమా జనవరి 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.[2]

మాస్టర్
దర్శకత్వంలోకేష్ కనగరాజ్
రచనలోకేష్ కనగరాజ్
నిర్మాతమ‌హేశ్ కోనేరు
తారాగణంవిజయ్ , విజయ్​ సేతుపతి మాళవిక మోహన్
ఛాయాగ్రహణంసత్యన్ సూర్యన్
కూర్పుఫిలోమిన్ రాజ్
సంగీతంఅనిరుధ్‌ రవిచంద్రన్
విడుదల తేదీ
13 జనవరి 2021 (2021-01-13)(భారతదేశం)
సినిమా నిడివి
179 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

జేడీ (విజయ్) కాలేజ్ లో ప్రొఫసర్ గా పనిచేస్తుంటాడు. కాలేజీ యాజమాన్యానికి మాత్రం జేడీ ప్రవర్తన నచ్చదు. ఈ క్రమంలో జరిగిన స్టూడెంట్ ఎన్నికల్లో జేడీని కాలేజీ నుంచి వెళ్లగొట్టాలని కావాలనే కాలేజీ యాజమాన్యం ఎన్నికల్లో గొడవలు సృష్టించి అతడిని కాలేజీని వదిలి వెళ్లేలా చేస్తారు. ఆ తరువాత జేడీ జువైనల్ హోంకు టీచర్ గా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన జేడీకీ ఆదిలోని అనుకోని ఒక సంఘటన ఎదురవుతుంది. ఈ క్రమంలో భవాని (విజయ్‌ సేతుపతి) గురించి జేడీకీ తెలుస్తుంది. ఇంతకీ జువైనల్ హోంకు భావానికి ఏమి సంబంధం? జేడీ భవానిని ఎలా ఎదుర్కొంటాడు ? అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్
 • నిర్మాత: మ‌హేశ్ కోనేరు
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
 • సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్
 • సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
 • ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
 • పాటలు: కృష్ణకాంత్

మూలాలు

మార్చు
 1. Sakshi (29 December 2020). "విజయ్‌ 'మాస్టర్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది." Retrieved 14 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
 2. TV9 Telugu (27 January 2021). "డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దమైన దళపతి 'మాస్టర్'.. రిలీజ్ ఎప్పుడంటే." Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. Rao, Samba Siva (13 January 2021). "మాస్టర్‌ మూవీ రివ్యూ". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
 4. Eenadu (14 October 2021). "రివ్యూ: మాస్టర్‌". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.